GT Vs SRH: హై వోల్టేజ్ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారంటే..

గుజరాత్ జట్టు తొలి మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ (MI) పై గుజరాత్ టైటాన్స్ (GT) గెలుపొందింది. కానీ రెండవ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్(CSK) చేతిలో పరాజయం పాలయ్యింది.

Written By: Anabothula Bhaskar, Updated On : March 31, 2024 12:43 pm

GT Vs SRH

Follow us on

GT Vs SRH: ఐపీఎల్ 17వ సీజన్లో ప్రతి ఆదివారం నిర్వాహక కమిటీ రెండు లీగ్ మ్యాచ్ లు నిర్వహిస్తోంది. ఈ ఆదివారం గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans), సన్ రైజర్స్ హైదరాబాద్ (sunrisers Hyderabad) జట్ల మధ్య లీగ్ మ్యాచ్ జరగనుంది. అహ్మదాబాదులో నరేంద్ర మోడీ స్టేడియంలో మధ్యాహ్నం మూడు గంటల 30 నిమిషాల నుంచి మ్యాచ్ మొదలవుతుంది.. అయితే ఈ మ్యాచ్ రెండు జట్లకు అత్యంత కీలకం. ఈ రెండు జట్లు ఇప్పటికే చెరో రెండు మ్యాచ్ లు ఆడాయి. ఒకదాంట్లో ఓడిపోయి, మరో దాంట్లో విజయం సాధించాయి.

రెండు మ్యాచ్ లు ఆడిన గుజరాత్ జట్టు ఒక గెలుపు ద్వారా ఏడవ స్థానంలో ఉంది. ఎందుకంటే ఈ జట్టుకు నెట్ రన్ రేట్ చాలా తక్కువగా ఉంది. హైదరాబాద్ జట్టు కూడా రెండు పాయింట్లతో ఉన్నప్పటికీ..నెట్ రన్ రేట్ ఎక్కువగా ఉండడంతో నాలుగువ స్థానంలో కొనసాగుతోంది.

గుజరాత్ జట్టు తొలి మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ (MI) పై గుజరాత్ టైటాన్స్ (GT) గెలుపొందింది. కానీ రెండవ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్(CSK) చేతిలో పరాజయం పాలయ్యింది. ఇక హైదరాబాద్ జట్టు కోల్ కతా నైట్ రైడర్స్ తో(KKR) జరిగిన తొలి మ్యాచ్ లో నాలుగు పరుగుల తేడాతో ఓడిపోయింది. ముంబై ఇండియన్స్(MI) జట్టుతో జరిగిన మ్యాచ్ లో గెలుపొందింది.

విజయాల పరంగా చెరి సమానంగా ఉన్నప్పటికీ..నెట్ రన్ రేట్ విషయంలో హైదరాబాద్ గుజరాత్ కంటే ముందుంది. దీంతో ఈ రెండు చెట్లు ఆరోగ్యాలకు సాధించాలని భావిస్తున్నాయి. ఈ రెండు జట్లలో అత్యంత కీలకమైన ఆటగాళ్లు ఉన్నారు. గుజరాత్, హైదరాబాద్ మధ్య ఇప్పటివరకు మూడు ఐపీఎల్ మ్యాచ్ లు జరిగాయి. ఇందులో గుజరాత్ రెండు, హైదరాబాద్ ఒకటి మ్యాచ్ గెలిచాయి. హైదరాబాద్ పై గుజరాత్ అత్యధిక స్కోరు 1999 పరుగులు. గుజరాత్ పై హైదరాబాద్ సాధించిన అత్యధిక స్కోరు 195. ఇక గూగుల్ అంచనా ప్రకారం ఈ మ్యాచ్ లో రెండు జట్లకు విజయవకాశాలు చెరి 50% ఉన్నాయని ప్రకటించింది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం బ్యాటింగ్ కు అనుకూలిస్తుంది. మైదానం ఫాస్ట్ బౌలర్లకు అనుకూలిస్తుందని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు.

గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) జట్టులో శుభ్ మన్ గిల్(కెప్టెన్), వృద్ధిమాన్ సాహ (వికెట్ కీపర్), అభినవ్ మనోహర్, సాయి సుదర్శన్, విజయ శంకర్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తేవాటియా, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, జయంతి యాదవ్, మోహిత్ శర్మ, జాషువా లిటిల్.

సన్ రైజర్స్ హైదరాబాద్( sunrisers Hyderabad)

ట్రావిస్ హెడ్, మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మ, మార్క్రమ్, క్లాసెన్, అబ్దుల్ సమద్, శాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్( కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, మాయాంక్ మార్కండే, జయదేవ్ ఉనద్కత్.