సరికొత్త రికార్డులు..
గుజరాత్ జట్టు ఇన్నింగ్స్ లో కీలక భూమిక పోషించిన సాయి సుదర్శన్, గిల్ సరికొత్త రికార్డులు సృష్టించారు. అహ్మదాబాద్ మ్యాచ్లో 38 పరుగులు చేయడం ద్వారా గిల్ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఐపీఎల్ లో తక్కువ ఇన్నింగ్స్ లలో 1000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా గిల్ నిలిచాడు. జాబితాలో బెంగళూరు జట్టు ఒకప్పటి ఆటగాడు బెంగళూరు వేదికపై గేల్19 ఇన్నింగ్స్ లలో 1000 పరుగులు పూర్తి చేశాడు. గిల్ అహ్మదాబాద్ వేదికగా 20 ఇన్నింగ్స్ లలో 1000 పరుగులు పూర్తి చేశాడు. హైదరాబాద్ ఒకప్పటి ఆటగాడు డేవిడ్ వార్నర్ ఉప్పల్ మైదానంలో 22 ఇన్నింగ్స్ లలో 1000 పరుగులు పూర్తి చేశాడు. మొహాలీ వేదికగా 26 ఇన్నింగ్స్ లలో షాన్ మార్ష్ 1000 పరుగులు పూర్తి చేశాడు.
సాయి సుదర్శన్ నాలుగు ఇన్నింగ్స్ లలో..
గుజరాత్ ఆటగాడు సాయి సుదర్శన్ గడచిన 4 ఇన్నింగ్స్ లలో పరుగుల వరద పారించాడు. అహ్మదాబాద్ వేదికగా గడిచిన నాలుగు ఇన్నింగ్స్ లలో సాయి సుదర్శన్ 84(48)*, 103(51), 74(41),63(41) పరుగులు చేశాడు. ఇదే వేదిక పై గిల్ లాంటి ఆటగాడికి సాధ్యం కాని రికార్డును సాయి సుదర్శన్ సొంతం చేసుకున్నాడు.
Also Read : చేసింది 31 పరుగులే ఐనా.. CSK పై విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు