IPL 2024: భారీ అంచనాలు పెట్టుకొని ప్రపంచంలోని క్రికెట్ అభిమానులు మొత్తం దేనికోసం అయితే ఎదురు చూస్తున్నారో ఆ రోజు వచ్చేసింది.2024 లో జరిగే ఐపిఎల్ మ్యాచు ఎప్పుడు ప్రారంభం అవ్వబోతున్నాయో దానికి సంబందించిన డేట్ ని కూడా బిసిసిఐ అనౌన్స్ చేసినట్టు గా తెలుస్తుంది. ఇక 2024వ సంవత్సరంలో మార్చ్ 22 వ తేదీ నుంచి ఐపీఎల్ కొనసాగబోతున్నట్టుగా ఇప్పటికే వార్తలు అయితే అందుతున్నాయి. ఇక ఇండియాలోనే ఐపీఎల్ ని కొనసాగించడానికి సన్నాహాలు చేస్తున్నారు.
అయితే ఇండియాలో సమ్మర్ లో సార్వత్రిక ఎన్నికలు ఉండడం వల్ల ఐపీఎల్ లీగ్ ని ఈసారి వేరే దేశంలో నిర్వహిస్తారు అని అందరూ అనుకున్నారు. కానీ వేరే దేశాల్లో కాకుండా ఈసారి ఇండియాలోనే ఐపీఎల్ నిర్వహించడానికి బీసీసీఐ కూడా సిద్ధమైంది. అయితే ఇప్పుడు ఎలక్షన్లు ఉండడం వల్ల ఆయా రాష్ట్రాలకి ఏమైనా ఇబ్బందులు ఉండి ఆ మ్యాచ్ ని అక్కడ నిర్వహించడానికి కష్టంగా ఉంటే ఆ మ్యాచ్ ని ఆ రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి మార్చనున్నట్టు గా కూడా వార్తలైతే వస్తున్నాయి. ఇక ఇంతకుముందు 2009వ సంవత్సరంలో సౌతాఫ్రికాలో ఐపీఎల్ నిర్వహించారు. అలాగే 2014 వ సంవత్సరంలో కూడా కొన్ని మ్యాచ్ లు ఇండియాలో, మరికొన్ని మ్యాచ్ లు వేరే దేశాల్లో నిర్వహించాల్సి వచ్చింది.
కానీ ఇప్పుడు మాత్రం అలాంటి ఇబ్బందులు ఏమీ లేకుండా ఇండియాలోనే కొనసాగించే విధంగా ప్రణాళికలను రూపొందిస్తున్నారు. ఇక ఈసారి జరిగే 17వ ఐపిఎల్ సీజన్ ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించడానికి కూడా నిర్వాహకులు భారీ ఎత్తున హంగులు ఆర్భాటాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక డిసెంబర్ 19వ తేదీన జరిగే మినీ యాక్షన్ లో అన్ని టీములు కూడా వాళ్లకు కావాల్సిన ప్లేయర్లను కొనుగోలు చేసి ఇప్పటికే ఐపీఎల్ కోసం సర్వం సిద్ధం చేసి పెట్టుకుంటున్నాయి.
వాళ్ల కెప్టెన్లు ఎవరు వాళ్ళ టీంలో ఎవరెవరు ఆడాలి ఏ మ్యాచ్ లో ఎవరు ఆడితే టీం బలంగా ఉంటుందనే లెక్కల్ని కూడా పూర్తి చేసుకొని ఐపీఎల్ స్టార్ట్ అయితే ఆడటానికి రెడీగా ఉన్నారు. ఇక ఈ క్రమంలోనే ఐపీఎల్ కి సంబంధించిన డేట్ కూడా వచ్చేసింది కాబట్టి ఇక ఇప్పటినుంచి అన్ని టీముల్లో ఉన్న ప్లేయర్లు చాలా కసరత్తులను కూడా చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి… మరి గత సంవత్సరం చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ గెలిచింది. ఇక ఇప్పుడు ఏ టీమ్ కప్పు కొడుతుందో చూడడానికి అభిమానులందరూ అసక్తి గా ఎదురు చూస్తున్నారు…