South Africa Vs New Zealand: ఒంటి చేత్తో స్టంపింగ్ క్యాచ్.. ఏం ఫీల్డింగ్ భాసూ..

శుక్రవారం న్యూజిలాండ్ వేదికగా న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన రెండవ టెస్టులో న్యూజిలాండ్ ఆటగాడు గ్రీన్ ఫిలిప్స్ పట్టిన క్యాచ్ నాటి జాంటీ రోడ్స్ ను గుర్తుచేసింది. గల్లీలో ఉన్న ఫిలిప్స్ రెప్పపాటులో పీటర్సన్ కొట్టిన షాట్ ను అమాంతం గాల్లో ఎగిరి పట్టుకున్నాడు.

Written By: Suresh, Updated On : February 16, 2024 5:16 pm

South Africa Vs New Zealand

Follow us on

South Africa Vs New Zealand: సరిగ్గా 23 సంవత్సరాల క్రితం దక్షిణాఫ్రికా టీం ఇప్పటిలా కాకుండా దిగ్గజ ఆటగాళ్లతో బలంగా ఉండేది. బలవంతమైన ఆస్ట్రేలియాను మట్టికరిపించేది. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్.. ఇలా ఒక్కటేమిటి అన్ని విభాగాల్లో సత్తా చాటేది. ముఖ్యంగా దక్షిణాఫ్రికా ఫీల్టర్ జాంటీ రోడ్స్ అడ్డుగోడ లాగా ఉండేవాడు. ప్రత్యర్థి జట్టుకు చెందిన బ్యాటర్ పరుగులు తీయకుండా అలా ఆపేవాడు. మిడాఫ్ లో అతడు ఉన్నాడంటే ప్రత్యర్థి జట్లకు చెందిన బ్యాటర్లు బంతిని అటు ఆడేవారు కాదంటే అతడి ఫీల్డింగ్ ఏ స్థాయిలో ఉండేదో అర్థం చేసుకోవచ్చు. అతడి శకం ముగిసిన తర్వాత క్రికెట్లో మళ్లీ ఆ స్థాయిలో ఫీల్డింగ్ చేసే ఆటగాళ్లు లేరంటే అతిశయోక్తి కాదు.

శుక్రవారం న్యూజిలాండ్ వేదికగా న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన రెండవ టెస్టులో న్యూజిలాండ్ ఆటగాడు గ్రీన్ ఫిలిప్స్ పట్టిన క్యాచ్ నాటి జాంటీ రోడ్స్ ను గుర్తుచేసింది. గల్లీలో ఉన్న ఫిలిప్స్ రెప్పపాటులో పీటర్సన్ కొట్టిన షాట్ ను అమాంతం గాల్లో ఎగిరి పట్టుకున్నాడు. అతడు పట్టిన క్యాచ్ మ్యాచ్ మొత్తానికే హైలైట్ గా నిలిచింది.

హామిల్టన్ వేదికగా జరిగిన రెండో టెస్టులో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ లో 242 పరుగులకు ఆల్ అవుట్ అయింది.. ఆ తర్వాత న్యూజిలాండ్ 211 పరుగులకే ఆల్ అవుట్ అయింది. రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌత్ ఆఫ్రికా 235 పరుగులు చేసి ఆలౌట్ అయింది. రెండవ ఇన్నింగ్స్ లో 39 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన సౌత్ ఆఫ్రికా జట్టును కెప్టెన్ నీల్ బ్రాండ్ (34), బెడింగ్ హమ్ (110) ఆదుకున్నారు. అని వీరిద్దరూ స్వల్ప స్కోర్ వ్యవధిలో అవుట్ కావడంతో దక్షిణాఫ్రికా చిక్కుల్లో పడింది.

ఈ క్రమంలో పీటర్సన్ బ్యాటింగ్ కు వచ్చాడు. అతనితో కలిసి బెడింగ్ హమ్ 100 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. వీరిద్దరూ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేస్తూ న్యూజిలాండ్ పై ఆధిపత్యం చెలాయించారు.. ఈ క్రమంలో ఫిలిప్స్ పట్టిన క్యాచ్ ఒక్కసారిగా దక్షిణాఫ్రికా ఆట తీరును మార్చేసింది. ఒకానొక దశలో 202 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయి పటిష్ట స్థితిలో ఉన్న దక్షిణాఫ్రికా.. ఆ తర్వాత 235 పరుగులకు ఆల్ అవుట్ కావడం విశేషం. ఫిలిప్స్ పట్టిన క్యాచ్ ఈ మ్యాచ్లో టర్నింగ్ పాయింట్ గా నిలిచింది. మ్యాట్ హేన్రీ బౌలింగ్లో పీటర్సన్ బాండరీ కొట్టాలని కట్ షాట్ ఆడాడు. అయితే గల్లీలో ఉన్న ఫిలిప్స్ రెప్పపాటులో ఎగిరి ఒంటి చేత్తో బంతిని అందుకున్నాడు. ఈ క్యాచ్ ఒకప్పుడు జాంటీ రోడ్స్ చేసిన ఫీల్డింగ్ ను గుర్తు చేసింది. పీటర్సన్ అవుట్ అయిన తర్వాత దక్షిణాఫ్రికా బ్యాటర్లు ఒకరి వెంట చేరుకున్నారు. దక్షిణాఫ్రికా ఆల్ అవుట్ అయిన తర్వాత లక్ష చేదనకు దిగిన న్యూజిలాండ్.. కెన్ విలియమ్సన్ సెంచరీ చేయడంతో విజయం సాధించింది. రెండు టెస్టుల సిరీస్ ను 2_0 తేడాతో గెలుచుకుంది. ఈ టెస్ట్ విజయం ద్వారా 92 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించింది.