New Zealand Vs Australia: వెల్లింగ్టన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్ ఆటగాడు ఫిలిప్స్ అద్భుతం చేశాడు.. శనివారం రెండవ రోజు ఆటలో అద్భుతమైన క్యాచ్ పట్టి ఆస్ట్రేలియా ఆటగాడు లబూ షేన్ (90) ను పెవిలియన్ పంపించాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.. ఓవర్ నైట్ స్కోర్ 32/2 తో రెండవ రోజు ఆట ప్రారంభించిన ఆస్ట్రేలియా జట్టు త్వర త్వరగా నే వికెట్లు కోల్పోయినప్పటికీ లబూ షేన్(90) న్యూజిలాండ్ బౌలర్లను ఎదుర్కొన్నాడు.. 12 ఫోర్ల సహాయంతో 90 పరుగులు చేశాడు.. ఈ క్రమంలో ఆస్ట్రేలియా స్కోరు 221 పరుగుల వద్ద ఉన్నప్పుడు సౌతి బౌలింగ్ లో బ్యాట్ మీదికి దూసుకు వచ్చిన బంతిని లబూ షేన్ అప్పర్ కట్ ఆడాడు. అయితే అది ఎడ్జ్ తీసుకొని గాల్లోకి లేచింది. దీంతో ఫిలిప్స్ అమాంతం గాల్లోకి ఎగిరి ఒంటి చేత్తో బంతిని అందుకున్నాడు. దీంతో లభిషేన్ నిరాశగా పె విలియన్ చేరుకున్నాడు. అతడి అవుట్ తో ఒక్కసారిగా ఆస్ట్రేలియా జట్టు షాక్ కు గురైంది..
తొలి ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ జట్టు 162 పరుగులకు ఆల్ అవుట్ అయింది.38 పరుగులతో లాతం టాప్ స్కోరర్ గా నిలిచాడు.. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా జట్టు 256 పరుగులకు ఆల్ అవుట్ అయింది.. లబూ షేన్(90) పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. అతడు గనుక ఆడకపోయి ఉంటే ఆస్ట్రేలియా కూడా న్యూజిలాండ్ లాగానే తక్కువ స్కోరుకే ఆల్ అవుట్ అయ్యేది.. మైదానం బౌలర్లకు అనుకూలించడంతో.. బ్యాటర్లు కుదురుకునేందుకు ఇబ్బంది పడుతున్నారు. గ్రీన్(25), హెడ్(21), లయన్(20) మెరిసినప్పటికీ.. వాటిని భారీ స్కోరుగా మలిచే ప్రయత్నంలో అవుట్ అయ్యారు.. కీలక ఆటగాళ్లు వెంట వెంటనే అవుట్ అయినప్పటికీ లబూ షేన్ ఒక్కడే మొండిగా నిలబడ్డాడు. న్యూజిలాండ్ బౌలర్లను ధైర్యంగా ఎదుర్కొన్నాడు. పది పరుగుల తేడాతో సెంచరీ కోల్పోయినప్పటికీ స్ఫూర్తిదాయకమైన ఇన్నింగ్స్ ఆడాడు. అతడు అవుట్ అయిన కొంతసేపటికే ఆస్ట్రేలియా కొన్ని పరుగులు తేడాతోనే మిగతా రెండు వికెట్లు కోల్పోయింది. న్యూజిలాండ్ బౌలర్లలో హెన్రీ 7 వికెట్లు పడగొట్టాడు. సౌతి, సియర్స్, పిలిప్స్ తలా ఒక వికెట్ తీశారు.
అనంతరం రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ జట్టు ఒక వికెట్ నష్టపోయి 59 పరుగులు చేసింది. యంగ్(1) ఎప్పటిలాగానే నిరాశపరిచాడు..విలియం సన్(30), లాతం(24) క్రీజ్ లో ఉన్నారు. స్టార్క్ ఒక వికెట్ దక్కించుకున్నాడు. న్యూజిలాండ్ ఇంకా 35 పరుగులు వెనుకబడే ఉంది. తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా జట్టు 256 పరుగులకు ఆల్ అవుట్ అయింది.
WHAT A CATCH, GLENN PHILLIPS.
– One of the best fielders in this generation…..!!!!pic.twitter.com/SIVlW613vH
— Johns. (@CricCrazyJohns) March 9, 2024