spot_img
Homeక్రీడలుక్రికెట్‌Glenn Maxwell: మాక్స్ వెల్ లేకి కూతలు: ఐపీఎల్, పీసీఎల్ కు తేడా లేదట.. అందుకే...

Glenn Maxwell: మాక్స్ వెల్ లేకి కూతలు: ఐపీఎల్, పీసీఎల్ కు తేడా లేదట.. అందుకే భయ్యా నిన్ను తరిమేసింది

Glenn Maxwell: లక్ష కోట్లకు మించిన మార్కెట్ వాల్యూ.. పోటీలు పడుతున్న కార్పొరేట్ కంపెనీలు.. ఏ టికేడు పెరుగుతున్న ఆదాయం.. చివరికి ఫుట్ బాల్ క్లబ్ లు కూడా నోరెళ్లబెట్టి చూసే తీరు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ఐపీఎల్ అంటే కేవలం క్రికెట్ మాత్రమే కాదు.. అంతకుమించిన సామ్రాజ్యం.. ఆట, పాట, వినోదం, వ్యాపారం, ఉపాధి, ఆర్థిక చేయూత, సామాజిక బాధ్యత.. ఇన్ని ఉన్నాయి కాబట్టే ప్రపంచ వ్యాప్తంగా ఐపీఎల్ పేరు మార్మోగిపోతుంది.

ఈ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు సాధించిన ఐపిఎల్ లో ఆస్ట్రేలియా ఆటగాడు మాక్స్ వెల్ దాదాపు పుష్కర కాలం పాటు ఆడాడు. ప్రతి ఏడాది కోట్లాది రూపాయల డబ్బును సొంతం చేసుకున్నాడు. ప్రారంభంలో మెరుగ్గానే ఆడాడు. ఆ తర్వాత విఫలమవుతూ వచ్చాడు. అయినప్పటికీ అతని ఆట తీరు మీద నమ్మకం పెట్టుకున్న ఆయా యాజమాన్యాలు అతన్ని కొనుగోలు చేస్తూనే ఉన్నాయి. డబ్బులు ఇస్తూనే ఉన్నాయి. ఆ స్థాయిలో డబ్బు తీసుకుంటున్నప్పటికీ ఏ రోజు కూడా తన ఆటకు పూర్తిస్థాయిలో న్యాయం చేయలేకపోవడంతో అతడిని యాజమాన్యాల పక్కన పెట్టాయి.

ప్రస్తుతం మాక్స్ వెల్ పాకిస్తాన్ సూపర్ లీగ్ లో ఆడుతున్నాడు. అక్కడ కూడా చెప్పుకునే స్థాయిలో పరుగులు చేయలేకపోతున్నాడు. వాస్తవానికి మాక్స్ వెల్ కు ఇటీవల ప్రకటించిన జాతీయ కాంట్రాక్టులో చోటు లభించలేదు. దీంతో అతడు ఒక రకమైన నిరాశలో ఉన్నాడు. అదే నిరాశను ఐపీఎల్ మీద చూపించాడు. ఆడ లేక మద్దెల ఓడు అన్నట్టుగా.. ఐపీఎల్ లో సత్తా చూపించలేకపోయిన అతడు.. జాతీయ కాంట్రాక్టులో చోటు దక్కించుకోలేకపోయిన అతడు.. పాకిస్తాన్ సూపర్ లీగ్ లో లేకి కూతలు కూశాడు.

పాకిస్తాన్ సూపర్ లీగ్, ఐపీఎల్ కు పెద్ద తేడా లేదట. పాకిస్తాన్ సూపర్ లీగ్ లో ఆటగాళ్ల మీద ఒత్తిడి ఉండదట. స్వేచ్ఛ ఇస్తారట.. పైగా తోటి ఆటగాళ్ల నుంచి ప్రోత్సాహం ఉంటుందట. ఐపీఎల్ లో మాత్రం ఆడక పోతే తీవ్రమైన ఒత్తిడి ఉంటుందట. తోటి ఆటగాళ్ల నుంచి కూడా ఇబ్బందులు ఎదురవుతాయట. పాకిస్తాన్ సూపర్ లీగ్ లో ఆడకపోయినా సరే తోటి ఆటగాళ్లు విపరీతమైన ప్రేమ మర్యాదలు కురిపిస్తారట.

అన్నట్టు మాక్స్ వెల్ భయ్యా.. పాకిస్తాన్ సూపర్ లీగ్ లో నిన్ను ఎంతకు కొనుక్కున్నారు.. ఇప్పటివరకు ఎన్ని డబ్బులు ఇచ్చారు.. వాళ్లు ఇచ్చిన చెక్కులు చెల్లుబాటు అవుతాయా.. ఇటీవల ఇరాన్, అమెరికా చర్చలకు వేదికైన హోటల్ కు ఇంతవరకు పాకిస్తాన్ డబ్బులు చెల్లించలేదు. మరి నువ్వేమో పాకిస్తాన్ సూపర్ లీగ్ లో ఆడుతున్నావు. ఇంతకీ డబ్బులు ఇచ్చారా లేదా ఒకసారి చూసుకో.. ఇప్పటికే పాకిస్తాన్ సూపర్ లీగ్ మీద కే జీ ఎఫ్ లెవెల్ లో ఎలివేషన్ ఇచ్చావ్ అని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular