IND VS BAN Test : బంగ్లాదేశ్ జట్టుతో జరుగుతున్న తొలి టెస్ట్ రెండవ రోజు రెండవ ఇన్నింగ్స్ లో ఆట ముగిసే సమయానికి భారత్ 81/3 వద్ద నిలిచింది. గిల్(33), రిషబ్ పంత్ (12) పరుగులతో నాట్ ఔట్ గా ఉన్నారు. శనివారం బ్యాటింగ్ ప్రారంభించిన వారిద్దరూ బంగ్లా బౌలర్లపై దూకుడు కొనసాగించారు. వీరిద్దరూ నాలుగో వికెట్ కు 167 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. రిషబ్ పంత్ (109) సెంచరీ చేశాడు. గిల్ కూడా 119 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. తొలి ఇన్నింగ్స్ లో గిల్ డక్ ఔటయ్యాడు. అయితే రెండవ ఇన్నింగ్స్ లో మాత్రం గిల్ అదరగొట్టాడు. బంగ్లా బౌలర్లను ధైర్యంగా ప్రతిఘటించాడు.. ఓవరాల్ గా తన టెస్ట్ కెరియర్ లో ఐదవ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.. 160 బంతుల్లో అతడు సెంచరీ చేశాడు.. రెండవ ఇన్నింగ్స్ లో భారత జట్టు 4 వికెట్లు కోల్పోయి 287 పరుగులు చేసిన అనంతరం.. కెప్టెన్ రోహిత్ శర్మ ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడు. ఫలితంగా భారత జట్టుకు 514 పరుగుల లీడ్ లభించింది. ఆట మరో రెండున్నర రోజులు ఉంది. బంగ్లాదేశ్ గెలవాలంటే 515 పరుగులు చేయాల్సి ఉంది. ప్రస్తుతం రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ జట్టు వికెట్లు నష్టపోకుండా 56 పరుగులు చేసింది. క్రీజ్ లో జాకీర్ హసన్ (32), షాద్మాన్ ఇస్లాం (21) ఉన్నారు. తొలి ఇన్నింగ్స్ లో తేలిపోయిన వీరిద్దరూ.. రెండవ ఇన్నింగ్స్ లో సత్తా చాటుతున్నారు.
సెకండ్ ఇన్నింగ్స్ అంటే చాలు..
గిల్ మొదటి ఇన్నింగ్స్ లో సున్నా పరుగులకే అవుట్ అయ్యాడు. సెకండ్ ఇన్నింగ్స్ లో మాత్రం సత్తా చాటాడు. ఇప్పుడు మాత్రమే కాదు గత నాలుగు మ్యాచ్ లలో గిల్ సెకండ్ ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేసి అదరగొట్టాడు..86*, 52*, 91, 119* పరుగులు చేసి ఆకట్టుకున్నాడు.. కాగా, శనివారం రెండవ ఇన్నింగ్స్ పున: ప్రారంభమైన తర్వాత గిల్, పంత్ బంగ్లా బౌలర్లను ఒక ఆట ఆడుకున్నారు. సులభంగా స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు.. పంత్ దూకుడుగా ఆడగా.. గిల్ తన ట్రేడ్ మార్క్ ఆటతీరుతో అలరించాడు.. వీరిద్దరూ 167 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. పంత్ 109 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. గిల్ 119* పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. గిల్ సెంచరీ చేసిన నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా అతనిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. సరైన సమయంలో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు అంటూ అభిమానులు అతడిని కొనియాడుతున్నారు. సెంచరీ చేసినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.