Gautam Gambhir: టీమిండియా క్రికెట్ జట్టు వరుస పరాజయాలు.. క్రికెట్ అభిమానులను ఆందోళనకు గుచిచేస్తున్నాయి. కెప్టెన్ రోహిత్, కింగ్ కోహ్లి ఆటతీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బౌలర్లు రాణిస్తున్నా.. స్టార్ బ్యాట్స్‌మెన్స్ విఫలం కావడం, అదే పిచ్‌పై టెయిలెండర్లు రాణించడం ఇలా అన్నీ.. మన ఆటగాళ్ల ఆటతీరుకు అద్దం పడుతోంది. సొంత గడ్డపై గర్జించే భారత్ ఇప్పటికే న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్ కోల్పోయింది. ఇక ఇప్పుడు ఆస్ట్రేలియా చేతిలోనూ అదే ప్రమాదం పొంచి ఉంది. ఈ నేపథ్యంలో జట్టును గాడిన పెట్టేందు గంభీర్ కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇకపై తాను చెప్పినట్లు ఆడాలని టీం సభ్యులకు స్పష్టం చేశారని సమాచారం. అయితే కోచ్ శైలిపైనా అనుమానాలు, ప్రశ్నలు వస్తున్నాయి. దీంతో డ్రెస్సింగ్ రూంలో ఒత్తిడి వాతావరణం నెలకొంది. ఈ క్రమంలోనే గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశారని తెలిసింది. ఇప్పటి వరకు ఆడింది చాలు.. ఇకపై నేను చెప్పిటన్లు ఆడాలని హుకుం జారీ చేశారని సమాచారం. జట్టు ప్రదర్శనను విశ్లేషించే క్రమంలో ఆటగాళ్ల తప్పులను నిర్మొహమాటంగా ఎత్తి చూపారు. కొందరు ఆటగాళ్లు పరిస్థితులకు తగినట్ల ఆడడం లేదని, సహజమైన ఆట పేరుతో సొంత ఆట ఆడుతున్నారని మండిపడినట్లు తెలిసింది. ఆరు నెలలు కోరుకున్నట్లు ఆడనిచ్చానని, ఇకపై ఆల కుదరదని స్పష్టం చేశాడని సమాచారం. ఇకపై ఎలా ఆడాలో తానే నిర్ణయిస్తానని స్పష్టం చేశారట. వ్యూహాత్మకంగా ఆడని ఆటగాళ్లకు వార్నింగ్ కూడా ఇచ్చారని సమాచారం. కీలక సమయాల్లో జట్టు కోసం ఆడడం లేదని మండిపడినట్లు తెలిసింది. రిషబ్ పంత్ ఆటతీరును తప్పు పట్టినట్లు సమాచారం.
ఏకాభిప్రాయం లేకనే..
ఇదిలా ఉంటే.. కోచ్, ఆటగాళ్ల మధ్య గ్యాప్ ఉన్నట్లు తెలుస్తోంది. కోచ్‌గా ద్రవిడ్ తప్పుకున్న నాటి నుంచి ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఎవరి ఆట వాళ్లు ఆడుతున్నారు. జట్టు కోసం దేశం కోసం ఆడినట్లు కనిపించడం లేదు. ఇక సారథిగా జట్టును రోహిత్ ఏకతాటిపై నడిపించేవాడు. కానీ ఇప్పుడు ఎవరికీ ఏమీ చెప్పడం లేదు. కొత్త వాల్లకు కనీసం చూచనలు చేయడం లేదట. రోహిత్ ఫాం కూడా ఇందుకు కారణం అయి ఉంటుందని తెలుస్తోంది. తానే ఆడనప్పుడు ఇతరులకు ఏం చెప్పాలన్న భావనలో రోహిత్ ఉన్నాడట. జట్టు వైఫల్యం ఇటు కెప్టెన్, అటు కోచ్ భవితవ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
మెరుగు పడకపోతే..
టీమిండియాకు 2025లో ఆసిస్‌తో ఒక టెస్టుతోపాటు చాంపియన్స్ ట్రోఫీ ఆడాల్సి ఉంది. పట్టు ప్రదర్శన మెరుగు పడకపోతే ఆయన పదవి కూడా సురక్షితం కాదు. చాంపియన్స్ ట్రోఫీలో జట్టు రాణించకపోతే గంభీర్‌ను తప్పిస్తారని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. ఇక కొందరు ఆటగాళ్లు కూడా అభద్రతా భావంతో ఉన్నారు. వారిపైనేటు తప్పదన్న సంకేతాలు వస్తున్నాయి. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్‌ను తప్పించే ఆలోచన ఉందన్న సంకేతాలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే గంభీర్ టీమిండియాకు వార్నింగ్ ఇచ్చారని తెలుస్తోంది.
భారత శిబిరంలో అలజడి
టీమిండియా డ్రెస్సింగ్ రూంలో పరిస్థితుల నేపథ్యంలో జట్టులో అలజడి నెలకొంది. ఘర్షణాత్మక వాతావరణం కనిపిస్తుందని సమాచారం. ఆసీస్‌తో సిరీస్‌కు పుజారాను తీసుకోకపోవడం కూడా పొరపాటు. గంభీర్ విజ్ఞప్తిని సెలక్టర్లు పట్టించుకోలేదు. పెర్త్ టెస్ట్ తర్వాత కూడా గంభీర్ పుజారా కావాలని అడిగినా టీమిండియా సెలెక్టర్లు స్పందించలేదని తెలిసింది. ఇక కెప్టెన్సీ పైనా గంభీర్ అసంతృప్తితో ఉన్నారు. కొత్తవారిని ఎంకరేజ్ చేస్తున్నారు. ఇద్దరికి ఆయన సంకేతాలు ఇచ్చారని సమాచారం.
పంత్ స్థానంలో జురెల్!
ఇక ఆస్ట్రేలియాలో అంచనాల మేరకు రాణించని రిషబ్ పంత్‌ను తప్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏడు ఇన్నింగ్స్‌లో 22 సటుతో కేవలం 154 పరుగులే చేశాడు. అత్యధిక స్కోరు 37 ఆత్రమే. ఈ నేపథ్యంలో పంత్‌పై వేటు పడే అవకాశం ఉంది. అతడి స్థానంలో కీపర్, బ్యాట్స్‌మెన్‌గా ధ్రువ్ జురెల్‌ను తీసుకుంటారని సమాచారం. పంత్ ఆటతీరుకన్నా అతని పేలవ షాట్స్ ఇప్పుడు చర్చనీయంశం అయ్యాయి. గవాస్కర్ లాంటి దిగ్గజ ఆటగాళ్లు కూడా పంత్ ఆటతీరును తప్పు పడుతున్నారు. ఈనేపథ్యంలో కోచ్ గంభీర్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.