Gautam Gambhir: టెస్టు సిరీస్ దక్కించుకోలేకపోయినప్పటికీ.. దాదాపు గెలిచినంత పని చేసింది టీమిండియా. తొలి టెస్ట్ లో గెలిచిన ఇంగ్లాండ్.. రెండో టెస్టును టీమిండియా కు అప్పగించింది.. మూడవ టెస్టును గెలిచిన ఇంగ్లాండ్.. నాలుగో టెస్ట్ ను నిలబెట్టుకోలేకపోయింది. నాలుగో టెస్టులో టీమ్ ఇండియా అద్భుతమైన పోరాట స్ఫూర్తిని ప్రదర్శించి డ్రా చేసుకుంది. దీంతో ఐదవ టెస్టులో విజయం దాకా వచ్చిన ఇంగ్లాండ్ చివర్లో ఒత్తిడి గురైంది. చివర్లో అద్భుతంగా బౌలింగ్ వేసిన టీమ్ ఇండియా బౌలర్లు మ్యాచ్ మొత్తాన్ని తమ వైపు లాగేసుకున్నారు. నాలుగు వికెట్లు కావలసిన సందర్భంలో.. వెంట వెంటనే నాలుగు వికెట్లను సొంతం చేసుకుని.. టీమిండియా కు అద్భుతమైన విజయాన్ని అందించారు.
Also Read: బుమ్రా ను మర్చిపోండి భయ్యా.. ఇకపై సిరాజే మన రేసుగుర్రం..
ఈ విజయం టీమిండియా ఆటగాళ్లలో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. అద్భుతమైన ఆనందాన్ని కలిగిస్తోంది. అంతేకాదు భవిష్యత్తు టెస్టు సిరీస్లలో ఎలా ఆడాలో నిర్దేశిస్తుంది. మొత్తానికి యంగ్ ఇండియా టీం ఇంగ్లాండ్ జట్టుపై టెస్టు సిరీస్ ను సొంతం చేసుకో లేకపోయినప్పటికీ.. అదరగొట్టింది. టెస్ట్ సిరీస్ ను సమం చేసింది. ముఖ్యంగా చివరి టెస్టులో 9 వికెట్లు సాధించి.. టీమిండియా కు సాధ్యం కాదన్న విజయాన్ని అందించి.. హీరోగా నిలిచిపోయాడు సిరాజ్. ఈ నేపథ్యంలో అతడికి విపరీతమైన ప్రశంసలు లభిస్తున్నాయి. అభినందనలు దక్కుతున్నాయి. అయితే సిరాజ్ చేసిన ప్రదర్శన టీమిండియా కు మాత్రమే కాదు.. టీమ్ ఇండియా కోచ్ కు కూడా సాంత్వన కలిగించింది.
ఎందుకంటే గౌతమ్ గంభీర్ శిక్షకుడిగా వచ్చిన దగ్గరనుంచి టీమిండియా స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ కు అర్హత సాధించలేకపోయింది. గతంలో విరాట్ ఆధ్వర్యంలో ఒకసారి, రోహిత్ ఆధ్వర్యంలో ఒకసారి టీమిండియా వరల్డ్ ఛాంపియన్ ఫైనల్స్ వెళ్లాయి. అప్పుడు ఓటములతోనే ఇంటికి వచ్చాయి. గౌతమ్ గంభీర్ వచ్చిన తర్వాత టీమ్ ఇండియాకు ఆ అవకాశం కూడా లేకపోయింది. దీంతో అతడి శిక్షణపై అందరికీ అప నమ్మకం ఏర్పడింది. పైగా ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన చివరి టెస్టులో ముగ్గురు బౌలర్లను మాత్రమే జట్టులోకి తీసుకోవడంతో అతనిపై విమర్శలు తీవ్రస్థాయిలో వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా నాలుగో రోజు ఆటలో టీమిండియా బౌలర్ల పప్పులు రూట్, బ్రూక్ ముందు ఉడకలేదు. దీనికి తోడు సిరాజ్ బ్రూక్ క్యాచ్ మిస్ చేశాడు. దీంతో గౌతమ్ గంభీర్ శిక్షణపై అందరికీ ఆగ్రహం కలిగింది. నాలుగో బౌలర్ ను జట్టులో ఏర్పాటు చేసుకుంటే ఏమైందని ప్రశ్న ఎదురైంది. ఇంత ఒత్తిడి మధ్య గౌతమ్ గంభీర్ తలవంచుకున్నాడు. తప్పంతా తనదే అన్నట్టుగా మౌనంగా ఉన్నాడు. వైపు జాతీయ మీడియాలో గౌతమ్ గంభీర్ తీరును ఉద్దేశిస్తూ కథనాలు ప్రసారమయ్యాయి. వీటన్నిటికీ సమాధానం చెప్పుకోలేని స్థితిలో గౌతమ్ గంభీర్ ఉన్న నేపథ్యంలో.. మహమ్మద్ సిరాజ్ తన ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించాడు. ముగ్గురు బౌలర్లతోనూ.. అది కూడా బుమ్రా లేకుండా మ్యాచ్ గెలుస్తామని నిరూపించాడు. దీంతో గౌతమ్ చేసిన ప్రయోగం విజయవంతమైంది. అంతేకాదు ఈ టెస్ట్ సిరీస్ లో టీమిండియా ఒకవేళ ఓడిపోతే.. అతనికి స్థానచలనం కలిగిస్తారని వార్తలు వచ్చాయి. అదృశవశత్తు సిరాజ్ అద్భుతమైన ప్రదర్శన చేయడంతో.. టీం ఇండియా సిరీస్ కోల్పోలేదు. దీంతో గౌతమ్ గంభీర్ స్థానానికి కూడా చలనం కలగలేదు. మొత్తానికి సిరాజ్ ప్రదర్శనతో టీమిండియా హ్యాపీ. గౌతమ్ గంభీర్ అంతకన్నా హ్యాపీ.