Kolkata Knight Riders Poor Performance: ఐపీఎల్ మ్యాచ్ లు చూసేవారికి కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా 2024 లో కోల్ కతా నైట్ రైడర్స్ విజేతగా నిలిచింది. గొప్ప గొప్ప జట్లను ఓడించి సరికొత్త చరిత్ర సృష్టించింది. వాస్తవానికి నాడు కోల్ కతా నైట్ రైడర్స్ ఆ స్థాయిలో విజయాలు సాధించడం వెనక ఉన్నది శ్రేయస్ అయ్యర్. జట్టు ఆటగాళ్లలో స్పూర్తి నింపి.. సరికొత్తగా జట్టును రూపాంతరం చేశాడు. అంతే కాదు, జట్టును ఏకంగా ఛాంపియన్ చేశాడు.
నాడు గౌతమ్ గంభీర్ కొనసాగించిన లాబీ వల్ల అయ్యర్ కు రావలసిన పేరు రాలేదు. గుర్తింపు కూడా రాలేదు. అంతేకాదు అయ్యర్ ను జట్టు నుంచి సాగనంపాడు. ఆత్మాభిమానం ఎక్కువగా ఉన్న అయ్యర్ మరో మాటకు తావు లేకుండా జట్టు నుంచి వెళ్ళిపోయాడు. ఈ దశలో బిసిసిఐ అధ్యక్షుడిగా ఉన్న జై షా నుంచి భారీ ఆఫర్ రావడంతో గౌతమ్ గంభీర్ కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు మెంటార్ నుంచి తప్పుకున్నాడు. అటు అయ్యర్ లేకపోవడంతో..కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు కు సారధి అవసరం పడింది.
మెగా వేలంలో చెప్పుకునే స్థాయిలో ప్లేయర్లను కొనుగోలు చేయలేకపోవడం.. ఒకవేళ కొనుగోలు చేసినా వారు సరిగ్గా ఆడ లేకపోవడంతో 2025 సీజన్లో కోల్ కతా దారుణమైన ప్రదర్శన చేసింది. డిపెండింగ్ ఛాంపియన్ హోదాలో ఆడలేక పోయింది. మరోవైపు కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు నుంచి వెళ్లిపోయిన అయ్యర్ పంజాబ్ జట్టుకు సారధి అయ్యాడు. పంజాబ్ జట్టును ఏకంగా 2025లో ఫైనల్ దాకా తీసుకెళ్లాడు. ఫైనల్ లో బెంగళూరు చేతిలో ఓడిపోకపోయి ఉంటే కచ్చితంగా విజేతగా నిలిచేది.
ఇప్పుడు రహానే నాయకత్వంలో కోల్ కతా నైట్ రైడర్స్ విజయాల కోసం ఎదురుచూస్తోంది. వరుస ఓటములతో ఆ జట్టు పూర్తిగా కుంగిపోయింది. బౌలింగ్ సరిగ్గా లేదు. బ్యాటింగ్ గొప్పగా లేదు. ఫీల్డింగ్ నాసిరకంగా ఉంది. 2024లో విజేతగా నిలిచిన ఆ జట్టుకు.. ఇప్పటి జట్టుకు సంబంధం లేదు. అలెన్, గ్రీన్ వంటి ప్లేయర్లు ఉన్నప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. అయ్యర్ వెళ్లిపోయిన తర్వాత.. వెంకటేష్ అయ్యర్ జట్టు నుంచి తప్పుకున్నాడు.. కీలకమైన ప్లేయర్లు వెళ్లిపోవడంతో చుక్కాని లేని నావలాగా మారిపోయింది కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు పరిస్థితి. కనీసం ఇప్పటివరకు ఒక్క విజయం కూడా సాధించ లేదంటే కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
నాడు గౌతమ్ గంభీర్ కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు యాజమాన్యానికి ఇచ్చిన సలహా వల్ల శ్రేయస్ అయ్యర్ జట్టు నుంచి వెళ్ళిపోయాడని ఇప్పటికి విమర్శలు వినిపిస్తూనే ఉంటాయి. అప్పట్లో స్పోర్ట్స్ సర్కిల్లో ఈ అంశం గురించి విస్తృతంగా చర్చ కూడా సాగింది. చివరికి ఈ అంశంపై అధికారికంగా ప్రకటన రాకపోయినప్పటికీ.. అయ్యర్ జట్టు నుంచి వెళ్ళిపోయాడు. అయ్యర్ వెళ్లిపోయిన తర్వాత కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు పరిస్థితి ఎలా మారిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
