Ustaad Bhagat Singh OTT: రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలైన పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh Movie) చిత్రం ఎంత పెద్ద ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ‘ఓజీ ‘ చిత్రానికి మొదటి దాదాపుగా 100 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వస్తే, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి క్లోజింగ్ లో 60 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చాయి. దీనిని బట్టీ ఈ సినిమా ఎంతటి ఘోరమైన ఫ్లాప్ అనేది అర్థం చేసుకోవచ్చు. పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఒక మాయని మచ్చ లాంటి సినిమా ఇది. అభిమానులు తీవ్రమైన నిరాశలో ఉన్నారు. అయితే ఈ చిత్రం నేడు ఓటీటీ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. విడుదలకు ముందు నెట్ ఫ్లిక్స్ సంస్థ ఈ చిత్రాన్ని సుమారుగా 82 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది.
వాళ్ళతో కుదిరించుకున్న ఒప్పందం ప్రకారం ఈ చిత్రాన్ని ఏప్రిల్ 24 న విడుదల చెయ్యాలి. కానీ సినిమా ఫ్లాప్ అవ్వడం , థియేట్రికల్ రన్ పూర్తిగా ఆగిపోవడం తో నేడే ఈ చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్ లోకి తీసుకొస్తున్నారు. సరిగ్గా అర్థ రాత్రి 12 గంటల నుండి ఈ చిత్రం స్ట్రీమింగ్ కాబోతుంది. థియేటర్స్ లో దారుణమైన రెస్పాన్స్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రానికి , కనీసం ఓటీటీ లో అయినా మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంటుందో లేదో చూడాలి. చాలా సినిమాలు థియేటర్స్ లో ఫ్లాప్ అయినవి ఓటీటీ లో మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. మహేష్ బాబు ‘గుంటూరు కారం’ చిత్రం అందుకు ఉదాహరణ. అంతే కాకుండా మెగాస్టార్ చిరంజీవి ‘భోళా శంకర్’ చిత్రం ఘోరమైన డిజాస్టర్ గా నిల్చిన సంగతి తెలిసిందే. కానీ ఈ సినిమాకు చిరంజీవి సూపర్ హిట్ ‘వాల్తేరు వీరయ్య’ కంటే ఎక్కువ వ్యూస్ వచ్చాయి.
అదే విధంగా ధనుష్ ‘ఇడ్లీ కొట్టు’ చిత్రం థియేటర్స్ లో ఫ్లాప్ అవ్వగా, నెట్ ఫ్లిక్స్ లో ఈ చిత్రానికి రికార్డు స్థాయి వ్యూస్ వచ్చాయి. దీనిని బట్టీ అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, థియేటర్స్ లో ఫ్లాప్ సినిమాలను ఆడియన్స్ ఎక్కువగా చూడరు కాబట్టి, ఓటీటీ లో విడుదల కోసం ఆడియన్స్ ఎదురు చూస్తుంటారని , అందుకే ఫ్లాప్ సినిమాలకు ఓటీటీ లో మంచి వ్యూస్ వస్తున్నాయని , కచ్చితంగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రానికి నెట్ ఫ్లిక్స్ లో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. కొంతమంది అయితే ‘ఓజీ’ కంటే ఎక్కువ వ్యూస్ వస్తాయని అంటున్నారు. మరి ఆ రేంజ్ కి వెళ్తుందా లేదా అనేది చూడా
