Homeఎంటర్టైన్మెంట్Bigg Boss Telugu 5: బిగ్ బాస్ రచ్చ రంబోలా.. కొట్టుకున్నారు.. తిట్టుకున్నారు.. ఏడ్చిన లోబో

Bigg Boss Telugu 5: బిగ్ బాస్ రచ్చ రంబోలా.. కొట్టుకున్నారు.. తిట్టుకున్నారు.. ఏడ్చిన లోబో

Bigg Boss Telugu 5: మునుపటికి ముంచి బిగ్ బాస్ ఈసారి సాగుతోంది. గొడవలు, వివాదాలు, తిట్లు, శాపనార్థాలు.. కొట్టుకోవడాల వరకూ వెళుతోంది. తొలి వారం పూర్తయ్యి రెండో వారంలోనే హౌస్ లోని కంటెస్టెంట్లు రచ్చ రచ్చ చేస్తున్నారు.నామినేషన్ల సమయంలో మొదలైన గొడవ తాజాగా రెండు టీంలుగా విడిపోయి కెప్టెన్సీ కోసం చేస్తున్న గేమ్ లో మరింత పతాక స్థాయికి చేరింది. హౌస్ లో ఇంత తీవ్రమైన లొల్లిలు ఎప్పుడూ చూడలేదంటున్నారు.

బిగ్ బాస్ లో ఈ బుధవారం రచ్చ రంబోలా అయ్యింది. యాంకర్ రవికి , గాయకుడు శ్రీరాంకు పెద్ద వివాదమే చెలరేగింది. ఆ తర్వాత శ్రీరాంకు.. మానస్ కు కూడా పెద్ద ఫైట్ జరిగింది. ఈ గొడవల్లో కలత చెందిన లోబో కన్నీళ్లు పెట్టుకోవడం అందరినీ ఎమోషనల్ కు గురిచేసింది.

ఇక ఈ గేమ్ లో యాంకర్ రవి మాస్టర్ ప్లాన్ వేశాడు. ఒక్కొక్కొరిని టార్గెట్ చేసి ప్రత్యర్థులను ఓడించేందుకు స్కెచ్ గీశాడు. గాయకుడు శ్రీరాం టీం కూడా దీనికి ప్రతి వ్యూహాలు సిద్ధం చేసి వ్యూహాత్మకంగా ముందుకెళుతోంది. మైండ్ తో ఆడనున్నట్టు ప్లాన్ చేశాడు.

ఇక శ్వేత పిచ్చిపచ్చినట్టుగా వ్యవహరించడంతో ఆమెకు దెయ్యం పట్టిందని ప్రత్యర్థి ప్రియ, ఆనీ మాస్టర్ మండిపడ్డారు. ఇక సన్నీపై నువ్వు ‘మగాడివా’ అంటూ ప్రియ విరుచుకుపడడం బుధవారం ఎపిసోడ్ లో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. మొత్తానికి ఈ రాత్రి ఎపిసోడ్ హాట్ హాట్ గా సాగిందని అర్థమవుతోంది.

Captaincy task just went up to next level 🔥 🔥 Who will make it ? #BiggBossTelugu5 today at 10 PM

 

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
Exit mobile version