Gambhir Shreyas Iyer controversy : గిల్ కు నాయకత్వ బాధ్యతలు అప్పగించినప్పుడు కొంతమంది విలేకరులు గౌతమ్ గంభీర్ ను ” శ్రేయస్ అయ్యర్ కు నాయకత్వ బాధ్యతలు ఎందుకు అప్పగించలేదు? కనీసం అతనికి జట్టులో అవకాశం కూడా ఎందుకు కల్పించలేదు?” అని ప్రశ్నించారు..” జట్టులో స్థానం కల్పించాలా? వద్దా? అనేది మేనేజ్మెంట్ డిసైడ్ చేస్తుంది.. అది నేను కాదు” అంటూ గౌతమ్ గంభీర్ సమాధానం చెప్పాడు. గౌతమ్ గంభీర్ వ్యాఖ్యలు చేసిన తర్వాత టీమ్ ఇండియా సీనియర్ ఆటగాడు అతుల్ వాసన్ స్పందించాడు. ” గౌతమ్ గంభీర్ చేసిన వ్యాఖ్యలు నిజంగా నమ్మే విధంగా ఉన్నాయి. కాకపోతే అతని మాటలను ఎవరూ నమ్మరని” వ్యాఖ్యానించాడు. దీనిని బట్టి జట్టులో గౌతమ్ గంభీర్ ఎలా వ్యవహరిస్తున్నాడు? శ్రేయస్ అయ్యర్ కు అవకాశాలు ఎలా దూరం చేస్తున్నాడు? అనేది అర్థమవుతోందని అతడు పేర్కొన్నాడు.
Also Read : టీమిండియా కెప్టెన్ మెటీరియల్ అయ్యర్ ను ఎందుకు తొక్కేస్తున్నారు?
గౌతమ్ గంభీర్ గతంలో కోల్ కతా కు నాయకుడిగా.. ఆ తర్వాత మెంటార్ గా వ్యవహరించాడు. గత సీజన్లో షారుఖ్ ఖాన్ జట్టు విజేతగా నిలిచింది. గత సీజన్ వరకు గౌతమ్ గంభీర్ షారుక్ ఖాన్ జట్టు కు మెంటార్ గా వ్యవహరించాడు. నాటి సీజన్లో షారుక్ ఖాన్ జట్టు విజేతగా నిలవడంలో అయ్యర్ పాత్ర ఉన్నప్పటికీ.. అతడి కంటే ఎక్కువగా గౌతమ్ గంభీర్ కు పేరు వచ్చింది. వాస్తవానికి గౌతమ్ గంభీర్ మెంటార్ మాత్రమే. అయితే అయ్యర్ కు రావలసిన పేరు గౌతమ్ గంభీర్ కు రావడం ఆశ్చర్యాన్ని కలిగించింది. అంతేకాదు గత ఏడాది ఇదే సమయానికి గౌతమ్ గంభీర్ ను టీమిండియా కోచ్ గా కూడా నియమించేందుకు అడుగులు పడ్డాయి. నాటి బిసిసిఐ సెక్రటరీ జై షా ఇదే విషయాన్ని గౌతమ్ గంభీర్ మీద ప్రస్తావించి.. ఆ తర్వాత అతడిని జట్టు కోచ్ గా నియమించాడు. అయితే ఈ సీజన్లో పంజాబ్ జట్టుకు నాయకత్వం వహిస్తున్న అయ్యర్.. నేరుగా తన బృందాన్ని ప్లే ఆఫ్ దాకా తీసుకెళ్లాడు. ఇప్పుడు ఫైనల్ లో కూడా అడుగుపెట్టేలా చేశాడు. దీనిని బట్టి గౌతమ్ గంభీర్ ప్రమేయం లేకుండానే తాను కోల్ కతా జట్టును గత సీజన్లో ఛాంపియన్ గా నిలిపానని అయ్యర్ చెప్పకనే చెప్పాడు. మొత్తంగా పంజాబ్ ఫైనల్ వెళ్లిన తర్వాత గౌతమ్ గంభీర్ పై సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ ఇదే జోరు గనుక అయ్యర్ కొనసాగిస్తే.. త్వరలోనే అతడు టీమిండియా కు నాయకుడు అయ్యే అవకాశం లేకపోతేనే కొంతమంది క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. జట్టు అవసరాల దృష్ట్యా భవిష్యత్తు కాలంలోనే అతడిని నాయకుడిగా నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది.