India vs Pakistan : ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు మ్యాచ్ లు ఆడడం ఒక ఎత్తు అయితే ఇండియా పాకిస్థాన్ టీమ్ ల మధ్య మ్యాచ్ అనేది ఇంకో ఎత్తు ఎందుకంటే కొన్ని దశాబ్దాల కాలం నుంచి ఈ రెండు టీమ్ ల మధ్య పోటీ అనేది నడుస్తూ వస్తుంది. ఈ రెండు టీంల దాయాధుల పోరులో ఎవరు గెలుస్తారు అనే ఉత్కంఠ ప్రపంచం లో ఉన్న ప్రతి ఒక్క అభిమానికి ఉంటుంది. ఈ మ్యాచ్ పట్ల ప్రపంచం అంత ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ఇక ఇండియా ఈ మ్యాచ్ లో గెలిస్తే వరల్డ్ కప్ లో వరుసగా మూడు విజయాలను సొంతం చేసుకుంటుంది.
అదే పాకిస్తాన్ గెలిచిన కూడా వరుసగా మూడు విజయాలను సొంతం చేసుకుంటుంది. కాబట్టి ఈ వరల్డ్ కప్ లో ఈ రెండు జట్ల మధ్య జరిగే పోటీ అనేది చాలా కీలకం గా మారనుంది.అయితే చూడటానికి ఈ రెండు టీముల్లో ఇండియా చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తున్నప్పటికీ పాకిస్తాన్ టీం ని కూడా తక్కువ అంచనా వేయడానికి వీలులేదు. అయితే ఈ రెండు టీంలు కూడా రీసెంట్ గా ఏషియా కప్ లో తలపడితే అక్కడ ఇండియానే పాకిస్తాన్ మీద పై చేయి సాధించింది. ఇప్పుడు జరిగే మ్యాచ్ లో పాకిస్తాన్ కూడా చాలా స్ట్రాంగ్ టీమ్ గానే కనిపిస్తుంది. ఇక ఇప్పటికే రెండు మ్యాచ్ లలో గెలిచింది అంటే వాళ్లు కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నారని అర్థం…
ఇక ఇలాంటి సమయంలో ఇండియా పాకిస్తాన్ టీం ని ఎలా ఎదుర్కోవాలని కొన్ని వ్యూహాలను కూడా రచించినట్టుగా తెలుస్తుంది.ఇక ఈ క్రమంలోనే ఈ మ్యాచ్ లో ఏ ప్లేయర్ల మధ్య పోటీ ఉండబోతుంది అనేది మనం తెలుసుకుందాం…
షాహిన్ అఫ్రిది వర్సెస్ రోహిత్ శర్మ
కొద్ది రోజుల క్రితం వరకు పాకిస్తాన్ టీమ్ బౌలింగ్ లో చాలా స్ట్రాంగ్ ఉందంటూ చాలా ప్రచారాలు కూడా చేసుకున్నారు. కానీ ఎప్పుడైతే ఏషియా కప్ జరిగిందో అప్పటి నుంచి వాళ్ళ బౌలింగ్ టీం మొత్తం డీలా పడిపోయింది. ముఖ్యంగా పాకిస్తాన్ పేస్ బౌలర్ అయిన షాహిన్ అఫ్రిది పైన వాళ్లు చాలా అంచనాలను పెట్టుకున్నారు కానీ ఏషియా కప్ లో అఫ్రిది బౌలింగ్ లో భారత బ్యాట్స్ మెన్స్ విపరీతమైన రన్స్ రాబడుతూ ఆయన బౌలింగ్ ని చీల్చి చెండడారు. ఇక ఇలాంటి క్రమంలో వరల్డ్ కప్ జరుగుతున్న మ్యాచ్ లో మన ఓపెనర్ ప్లేయర్లు అయిన రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ లను కొంత వరకు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది అంటూ చాలా వార్తలు వస్తున్నాయి. కానీ రోహిత్ శర్మ ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్ టీమ్ మీద ఒక భారీ సెంచరీ చేసి తన స్టాండర్డ్ ఏంటో మరొకసారి ప్రూవ్ చేశాడు. ఇక ఇలాంటి టైంలో రోహిత్ శర్మని ఆపడం షాహిన్ అఫ్రిది వల్ల కాదు ఎందుకంటే అఫ్రిది ఇప్పటికే సరైన ఫామ్ లో లేడు.
విరాట్ కోహ్లీ వర్సెస్ హరీస్ రావుఫ్, షాదాబ్ ఖాన్, నవాజ్
విరాట్ కోహ్లీ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. వరల్డ్ కప్ లో జరిగిన రెండు మ్యాచ్ ల్లో రెండు హాఫ్ సెంచరీలు చేసి తనకంటూ ఒక మంచి గుర్తింపు అయితే సంపాదించుకున్నాడు. కోహ్లీ తనదైన క్లాస్ ఇన్నింగ్స్ ఆడుతూ ఇండియన్ టీం కి వరుస విజయాలను అందించడానికి రెడీగా ఉన్నాడు. ఇక పాకిస్తాన్ టీం బౌలర్ అయిన హరీస్ రావుఫ్,నవాజ్, శాదబ్ ఖాన్ లాంటి బౌలర్లను ఎదుర్కోవడంలో కోహ్లీ ముందుంటాడు అనే చెప్పాలి. అయితే హరీస్ రావుఫ్, కోహ్లీ ని కొంతవరకు ఇబ్బంది పెట్టినప్పటికీ కోహ్లీ మాత్రం వాటన్నిటినీ అధిగమిస్తూ ఈజీగా ఆయన బౌలింగ్ లో పరుగులను సాధిస్తాడు.ఇక కోహ్లీ ఎలాగూ ఎక్కువసేపు క్రీజ్ లో ఉంటాడు కాబట్టి పాకిస్తాన్ స్పిన్నర్స్ అయిన షాదాబ్ ఖాన్, నవాజ్ ఇద్దరు కోహ్లీ కి బౌలింగ్ చేసే అవకాశం అయితే ఉంది. వాళ్ళ బౌలింగ్ ని ఎదురుకోవడానికి కోహ్లీ ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. స్పిన్నర్లను కోహ్లీ చాలా బాగా ఎదురుకుంటాడు.ఇక గత రెండు మ్యాచ్ ల్లో హాఫ్ సెంచరీ చేసి రాణించిన కోహ్లీ ఈ మ్యాచ్ లో కూడా పరుగుల వరద పారించాలని చూస్తున్నాడు…
ఇండియన్ పెస్ బౌలర్స్ వర్సెస్ బాబర్ అజం,మహమ్మద్ రిజ్వాన్
ఇండియన్ పేస్ బౌలర్లు అయినా మహమ్మద్ సిరాజ్, బుమ్రా లేదా మహమ్మద్ షమీ ముగ్గురు కూడా పాకిస్తాన్ బ్యాట్స్ మెన్స్ అయినా షఫీక్ అలాగే బాబర్ అజమ్ అలాగే మహమ్మద్ రిజ్వాన్లను ఎదురుకోవడంలో వాళ్ళ పాత్రను చాలా బాగా పోషించాలి వీళ్ళ ముగ్గురిని కనక కట్టడి చేసినట్లైతే పాకిస్తాన్ టీంని భారీ స్కోర్ చేయకుండా ఆపవచ్చు…
పాకిస్తాన్ మిడిల్ ఆర్డర్ వర్సెస్ ఇండియన్ స్పిన్నర్లు, కుల్దీప్ యాదవ్
ఈ ఇద్దరూ కూడా బౌలింగ్ లో వాళ్ల సత్తా ఏంటో చూపించడానికి రెడీ అవుతున్నారు. ముఖ్యంగా పాకిస్తాన్ మిడిల్ ఆర్డర్ లో ఈఫ్లికర్ అహ్మద్, సౌద్ షకీల్ ఇద్దరు కూడా మంచి బ్యాటింగ్ తో వాళ్ల టీం కి భారీ పరుగులు చేయాలని చూస్తుంటారు. వీళ్ళని ఆపే క్రమంలో అశ్విన్ కానీ, కుల్దిప్ యాదవ్ కానీ ఇద్దరు చాలా మంచి స్పెల్ వేసి వీళ్లని కట్టడి చేయాలి, లేకపోతే పాకిస్తాన్ టీమ్ భారీ పరుగులు చేసే అవకాశం అయితే ఉంటుంది… ఇది స్పిన్ కి బాగా అనుకూలించే పిచ్ కావడం వల్ల వీళ్లని కట్టడి చేయడం కొంతవరకు ఈజీనే అని చెప్పాలి.