IND vs BAN : వాళ్లు 241 కొట్టాలి… మనం నాలుగు వికెట్లు పడగొట్టాలి: రసకందాయంలో భారత్-బంగ్లా టెస్ట్

IND vs BAN : బంగ్లాదేశ్, భారత్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ అనేక మలుపులు తిరుగుతోంది. శనివారం నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంది. మొదటి ఇన్నింగ్స్ లో ఎదురైన తప్పులను ఈసారి పునరావృతం చేయలేదు. ముఖ్యంగా ఓపెనర్లు శుభారంభం ఇచ్చారు. 124 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత భారత బౌలర్లు విజృంభించారు. -అడ్డు గోడగా నిలబడ్డారు మొదటి ఇన్నింగ్స్ లో భారత బౌలర్లకు దాసోహం అన్న బంగ్లా […]

Written By: Bhaskar, Updated On : December 17, 2022 10:10 pm
Follow us on

IND vs BAN : బంగ్లాదేశ్, భారత్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ అనేక మలుపులు తిరుగుతోంది. శనివారం నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంది. మొదటి ఇన్నింగ్స్ లో ఎదురైన తప్పులను ఈసారి పునరావృతం చేయలేదు. ముఖ్యంగా ఓపెనర్లు శుభారంభం ఇచ్చారు. 124 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత భారత బౌలర్లు విజృంభించారు.

-అడ్డు గోడగా నిలబడ్డారు

మొదటి ఇన్నింగ్స్ లో భారత బౌలర్లకు దాసోహం అన్న బంగ్లా బ్యాట్స్ మెన్ రెండో ఇన్నింగ్స్ లో మాత్రం దాటిగా ఆడారు. ముఖ్యంగా శాంటో, హసన్ తొలి వికెట్ కు 124 పరుగులు జోడించారు.. వీరిలో హసన్ సెంచరీ చేశాడు. శాంటో 67 పరుగులు చేసి ఉమేష్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు.. హసన్ అశ్విన్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు.. వీరి తర్వాత వచ్చిన యాసిర్ అలీ, లిటన్ దాస్, నూరుల్ హాసన్, రహీం అలా వచ్చి ఇలా వెళ్ళిపోయారు.. ప్రస్తుతం శకీబ్ ఉల్ హాసన్, మిరాజ్ బ్యాటింగ్ చేస్తున్నారు..

-చెమటోడ్చాల్సి వచ్చింది

అయితే ఈరోజు బంగ్లాదేశ్ ను తొలి ఇన్నింగ్స్ మాదిరే త్వరగా ఆల్ అవుట్ చేయాలని భారత శిబిరం అనుకున్నది.. అనుకున్నట్టుగానే బౌలర్లు మొదటి సెషన్ లో బౌలింగ్ బాగానే చేశారు. కానీ బంగ్లా ఓపెనర్లు కొరకరాని కొయ్యలుగా మారారు.. వీరిద్దరిని విడదీసేందుకు కేఎల్ రాహుల్ బౌలర్లను మార్చి మార్చి బౌలింగ్ చేయించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అయితే బంగ్లాదేశ్ స్కోరు 124 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఉమేష్ యాదవ్ చేసిన బంతి ని హుక్ చేయబోయిన
శాంటో కీపర్ కు దొరికిపోయాడు. ఆ తర్వాత హసన్ కూడా వెంటనే అవుట్ అయ్యాడు. ఈ వికెట్ తర్వాత పెద్దగా భాగస్వామ్యాలు నమోదు కాలేదు. కానీ బంగ్లా బ్యాట్స్మెన్ పెద్దపెద్ద స్కోర్లు చేయకుండానే అవుట్ అయ్యారు. అయితే ఈరోజు ఇన్నింగ్స్ లో అక్షర్ పటేల్ 3 వికెట్లు తీయడం గమనార్హం.

-నాలుగు వికెట్ల దూరంలో

ప్రస్తుతం బంగ్లాదేశ్ ఆరు వి కెట్ల నష్టానికి 272 పరుగుల వద్ద ఉంది. అయితే ఆదివారం మొత్తం భారత బౌలర్లను కాచుకోవాల్సి ఉంటుంది . అయితే పిచ్ రోజురోజుకు నిర్జీవంగా మారిపోతుంది.. మైదానంపై తేమ బౌలర్లకు సహకరించడం లేదు.. అందుకోసమే ఈరోజు బంగ్లా ఆ స్థాయి స్కోరు సాధించగలిగింది. ఒకవేళ భారత బౌలర్లు మొదటి ఇన్నింగ్స్ మాదిరి విజృంభించి బౌలింగ్ చేస్తే మొదటి టెస్ట్ విజయం ఖాయమవుతుంది. లేదా షకీబుల్ హసన్ కొరకరానికి కొయ్యగా మారితే బంగ్లాదేశ్ కు టెస్ట్ ఓటమి తప్పుతుంది.