Virat Kohli : గత సీజన్లో ఖతార్ వేదికగా ఫిఫా కప్ జరిగింది. కేవలం మ్యాచ్లో కోసమే ఖతార్ దేశం ప్రత్యేకంగా మైదానాలను రూపొందించింది. ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా విడిది గృహాలను ఏర్పాటు చేసింది. ఖతార్ దేశం ఫిఫా కప్ నిర్వహించడం ద్వారా భారీగానే విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్జించింది. అంతేకాదు పర్యాటకంగా తమ దేశాన్ని అంతర్జాతీయ స్థాయిలో ప్రమోట్ చేసుకుంది. ఖతార్ లో 2022లో జరిగిన ఫిఫా కప్ లో అర్జెంటీనా విజేతగా నిలిచింది. సాధారణంగా ఫిఫా తన అధికారిక సామాజిక మాధ్యమ ఖాతాలలో ఫుట్ బాల్ కు మాత్రమే ప్రాధాన్యమిస్తుంది. ఇతర క్రీడలను ఏమాత్రం పట్టించుకోదు. ఇతర క్రీడాకారులను పెద్దగా లెక్కలోకి తీసుకోదు.. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ లో భాగంగా పాకిస్తాన్ జట్టుపై భారత్ ఆరు వికెట్ల తేడాతో అనితర సాధ్యమైన విక్టరీ సొంతం చేసుకున్న నేపథ్యంలో.. విరాట్ కోహ్లీ ఆ మ్యాచ్లో సెంచరీ చేసిన సమయంలో.. ప్రపంచ వ్యాప్తంగా నీరాజనాలు అందుకుంటున్న క్రమంలో ఫిఫా కూడా స్పందించింది. విరాట్ కోహ్లీపై ప్రశంసల జల్లు కురిపించింది.
కొల్లేజ్ పిక్చర్ తో..
ఫుట్ బాల్ చరిత్రలో రోనాల్డో తీరుగులేని ఆటగాడిగా కొనసాగుతున్నాడు. సమకాలీన ఫుట్ బాల్ క్రీడలో అనితర సాధ్యమైన ఆటగాడిగా కీర్తిని గడించాడు. అయితే ఈ కాలంలో క్రికెట్లో కూడా విరాట్ కోహ్లీ అదే స్థాయిలో అద్భుతాలు చేస్తున్నాడు. వన్డే క్రికెట్లో సచిన్ టెండుల్కర్, కుమార సంగక్కర తర్వాత ఆ స్థాయిలో పరుగులు చేసిన ఆటగాటిగా రికార్డు సృష్టించాడు. క్రికెట్లో అన్ని ఫార్మాట్లో కలిపి 51 సెంచరీలు చేశాడు విరాట్ కోహ్లీ. పాకిస్తాన్ జట్టుపై సెంచరీ చేసి చిరస్మరణీయ విజయాన్ని టీం ఇండియాకు అందించాడు. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీని, రోనాల్డోను పోల్చుతూ ఫిఫా తన అధికారిక ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో కొల్లెజ్ పిక్చర్ రూపొందించింది.. ఇద్దరూ యోధులే అంటూ కామెంట్ చేసింది. ఫిఫా నా అధికారిక సామాజిక మాధ్యమ ఖాతాలో విరాట్ కోహ్లీ ఫోటోను పోస్ట్ చేసిన నేపథ్యంలో అతడి అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కింగ్ విరాట్ కోహ్లీకి దక్కిన అరుదైన గౌరవం అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. కాగా, విరాట్ కోహ్లీ ఫుట్ బాల్ మ్యాచ్ లు ఎక్కువగా చూస్తాడు. రోనాల్డోను విపరీతంగా ఆరాధిస్తాడు. తనకు ఖాళీ దొరికిన సమయంలో ఫుట్ బాల్ మ్యాచ్ లు చూసేందుకు ఇతర దేశాలకు వెళ్తాడు. నచ్చిన ఫుడ్ తింటూ మ్యాచ్లను ఎంజాయ్ చేస్తుంటాడు. విరాట్ కోహ్లీ ఫుట్ బాల్ మ్యాచ్ లను చూస్తున్న దృశ్యాలను మీడియా ప్రముఖంగా ప్రచురించేది. కొన్ని సందర్భాల్లో విరాట్ కోహ్లీ కూడా ఫుట్ బాల్ మ్యాచ్ ల గురించి మాట్లాడేవాడు.. తనకు ఇష్టమైన ఆటగాడు రోనాల్డో అని.. ఒకవేళ క్రికెట్ లో కనుక రాక పోయి ఉంటే ఫుట్ బాల్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేవాడినని విరాట్ కోహ్లీ గతంలో ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించాడు.
View this post on Instagram