Virat Kohli: టీమిండియా మూడో టెస్టులో విజయం సాధించాలని భావిస్తోంది. మొదటి టెస్టులో విజయం సాధించినా రెండో టెస్టులో ఓటమి చెందడంతో మూడో టెస్టుపై అందరిలో ఆసక్తి పెరిగింది. కేప్ టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో మూడో టెస్టు మంగళవారం నుంచి జరుగుతోంది. దీంతో ఈ మ్యాచ్ లో గెలిచి రికార్డు నెలకొల్పాలని ఇండియా ఆలోచిస్తోంది. మరోవైపు ఇండియాను ఓడించి టెస్ట్ సిరీస్ గెలుచుకోవాలని సౌతాఫ్రికా కూడా ప్రయత్నాలు చేస్తోంది. దీంతో మూడో టెస్ట్ రసకందాయంలో పడింది.
దీంతో కెప్లెన్ విరాట్ కోహ్లి అన్ని అవకాశాలను ఉపయోగించుకోవాలని చూస్తున్నాడు. సమష్టి ఆటతీరుతో మూడో టెస్టులో విజయం సాధించాలని ఉవ్విళ్లూరుతున్నాడు. ప్రాక్టీసు కూడా అంతే స్థాయిలో కొనసాగించాడు. దీంతో అటు అభిమానుల్లో ఇటు ఆటగాళ్లలో ఆసక్తి పెరుగుతోంది. కేప్ టౌన్ లో విజయం సాధించి కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టాలని చూస్తున్నారు.
Also Read: నేడు ద్రావిడ్ బర్త్ డే: ఇండియన్ క్రికెట్‌ను నిలబెడుతున్న మిస్టర్ డిపెండబుల్..
టీమిండియా బ్యాటింగ్ పటిష్టంగానే ఉంది. సిరీస్ గెలిచి అభిమానుల ఆశలు నెరవేర్చాలని చూస్తోంది. ఇందుకు గాను భారీ స్కోరు చేసేందుకు రెడీ అవుతోంది. ప్రత్యర్థిని కట్టడి చేసే క్రమంలో రాణించి చిరకాల వాంఛ నెరవేర్చుకోవాలని ఆశిస్తోంది. అభిమానుల అంచనాలను తగ్గకుండా ఆడేందకు ప్రయత్నిస్తోంది. విరాట్ కోహ్లి మూడో టెస్టులో ఎలాగైనా విజయం సాధించాలని ఉవ్విళ్లూరుతున్నాడు. విరాట్ కోహ్లి ప్రాక్టీస్ ను చూసిన అభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు. మూడో టెస్టులో విరాట్ కచ్చితంగా రాణించాలని ఆశిస్తున్నారు. అతడి ఆటతీరుకు ఫిదా అవుతున్నారు.
జోహన్స్ బర్గ్ రెండో టెస్టుులో పుజారా, రెహానే ఆకట్టుకున్నారు. దీంతో మూడో టెస్టులో కూడా తమ అద్భుతమైన ఆటతీరు ప్రదర్శించి విజయం సాధించాలని చూస్తున్నారు. టీమిండియా బలహీనతలను బలంగా మార్చుకుని గెలుపు సొంతం చేసుకోవాలని భావిస్తోంది. దీని కోసం అన్ని మార్గాలు అన్వేషిస్తోంది. విరాట్ కోహ్లి కెప్టెన్సీకి ఇదో మచ్చు తునకగా మిగిలిపోవాలని తలపిస్తోంది.
Also Read: తమిళ్ తలైవాస్ ఆడిన ‘విధ్వంసం’.. చూస్తే దిమ్మదిరగాల్సిందే