Virat Kohli: కోహ్లీ ఆడుతుంటే అతడి నామస్మరణతో మైదానాన్ని హోరెత్తిస్తుంటారు. కోహ్లీ కోహ్లీ అంటూ మైదానాన్ని దద్దరిల్లేలా చేస్తుంటారు. ఇక ప్రస్తుతం ఇవాళ కూడా అదే చోటు చేసుకుంది. సుదీర్ఘకాలం తర్వాత టీమ్ ఇండియా ఆటగాడు విరాట్ కోహ్లీ రంజీ మ్యాచ్ ఆడుతున్నాడు. ఇందులో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియానికి ప్రేక్షకులు వేలాదిగా తరలివచ్చారు. ఈ సందర్భంగా ఒక ఊహించని సంఘటన చోటుచేసుకుంది.. విరాట్ కోహ్లీ మీదకు ఒక అభిమాని అదేపనిగా దూసుకు వచ్చాడు.
13 సంవత్సరాల తర్వాత ఢిల్లీ జట్టు తరఫున విరాట్ కోహ్లీ రంజీలో ఆడుతున్నాడు. దీంతో అభిమానులు భారీగా ఈ మైదానానికి తరలివచ్చారు.. టికెట్లు ఉచితంగా ఇవ్వడంతో ప్రజలు భారీగా వచ్చారు. వేలాదిమందిగా అభిమానులు తరలిరావడంతో మైదానం మొత్తం కోహ్లీ సేన లాగా దర్శనమిచ్చింది. అయితే అభిమాని విరాట్ వైపుకు వేగంగా దూసుకు వచ్చాడు. పటిష్టమైన సెక్యూరిటీని దాటుకొని మైదానంలో కోహ్లీ ఫీల్డింగ్ చేస్తున్న చోటుకు వచ్చాడు. అసలు ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాలేదు.. చేతిలో ఫోన్ పట్టుకొని.. పరిగెత్తుకుంటూ వచ్చాడు. వెంటనే విరాట్ కోహ్లీ కాళ్ళ మీద పడ్డాడు. విరాట్ ఆపుతున్నప్పటికీ ఏమాత్రం ఆగకుండా పాదాభివందనం చేశాడు. సెల్ఫీ దిగుదామంటూ ఒత్తిడి చేశాడు. అయితే అదే సమయంలో సెక్యూరిటీ అక్కడికి వచ్చారు. అతడి గల్లా పట్టుకొని లాక్కొని వెళ్లారు. అతడిని ఏమి చేయవద్దని విరాట్ కోహ్లీ కోరినప్పటికీ.. భద్రతా సిబ్బంది ఆ యువకుడి పై కఠినంగా వ్యవహరించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. విరాట్ కోహ్లీకి ఇలాంటి అనుభవం ఎదురవడం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా అతనికి ఇలాంటి ఘటనలే ఎదురయ్యాయి. ఆ సమయంలో విరాట్ కోహ్లీ సెక్యూరిటీకి చెప్పి.. అలా దూసుకు వచ్చిన అభిమానులను ఏమీ చేయవద్దని సూచించారు..కాగా, ఢిల్లీ వర్సెస్ రైల్వేస్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్లో.. ముందుగా బ్యాటింగ్ చేస్తున్న రైల్వేస్ ప్రస్తుతం 5 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. అయితే విరాట్ కోహ్లీ మీదకు అలా అభిమాని దూసుకురావడంతో ఒకసారిగా మైదానంలో కలకలం నెలకొంది. ఆ అభిమానిని సెక్యూరిటీ సిబ్బంది బయటకు తీసుకెళ్లిన తర్వాత.. కొంతసేపటి వరకు మ్యాచ్ జరగలేదు. ఆ తర్వాత యధావిధిగా మ్యాచ్ నిర్వహించారు. విరాట్ కోహ్లీ ఉత్సాహంగా ఫీల్డింగ్ చేశాడు.
BEST VIDEO OF THE DAY.
– A fan entered the ground and touched Virat Kohli’s feet at Arun Jaitley stadium. ❤️pic.twitter.com/rEYlyooTUD
— Tanuj Singh (@ImTanujSingh) January 30, 2025