ESPN CRICINFO AWARDS : ఆట ఆడటం వేరు.. అత్యుత్తమ ప్రతిభ చూపడం వేరు. అలాంటి అత్యుత్తమ ప్రతిభ చూపిన ఆటగాళ్లకే ప్రేక్షక లోకం దాసోహం అంటుంది. వారి ఆట తీరు చూసి మంత్రముగ్ధులవుతుంది. అలాంటి ఆటగాళ్ల ప్రతిభను గుర్తించి కొన్ని కొన్ని సంస్థలు పురస్కారాలు అందజేస్తుంటాయి. అలా క్రికెట్ లో ఐసీసీ తర్వాత ఆ స్థాయిలో ప్రతిష్టాత్మకమైన పురస్కారాలు ఇచ్చే సంస్థగా ESPN క్రీడా చానల్ పేరు పొందింది. ప్రతి సంవత్సరం ESPN క్రీడా చానల్ పురస్కారాలు అందజేస్తూ ఉంటుంది. 2023 కు సంబంధించిన పురస్కారాలను సంస్థ ప్రకటించింది.
ESPN CRICINFO AWARDS ను ఈసారి ఆరుగురు ఆస్ట్రేలియా ఆటగాళ్లు గెలుచుకున్నారు. వారిలో నాథన్ లియోన్, ట్రావిస్ హెడ్, పాట్ కమ్మిన్స్ ముఖ్యులు. ట్రావిస్ హెడ్ భారత జట్టుతో జరిగిన వరల్డ్ టెస్ట్ క్రికెట్ ఫైనల్ లో 163 పరుగులు చేసినందుకు టెస్ట్ బ్యాటింగ్ పురస్కారాన్ని గెలుచుకున్నాడు.
వరల్డ్ టెస్ట్ క్రికెట్ ఫైనల్ లో నాథన్ లియోన్ 64 పరుగులు ఇచ్చి ఇండియా జట్టుపై ఎనిమిది వికెట్లు తీసినందుకు గానూ అందరికీ ఉత్తమ టెస్ట్ బౌలర్ పురస్కారం దక్కింది..
ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో జరిగిన ప్రపంచ కప్ మ్యాచ్లో గ్లెన్ మాక్స్వెల్ 201 పరుగులు చేసి జట్టును సెమీఫైనల్ చేర్చాడు. అతడి వీరోచిత బ్యాటింగ్ కు గానూ ఉత్తమ వన్డే బ్యాటర్ పురస్కారం లభించింది.
న్యూజిలాండ్ జట్టుపై వరల్డ్ కప్ లో భారత బౌలర్ మహమ్మద్ షమీ ఏడు వికెట్లు తీసినందుకు గానూ అతడికి ఉత్తమ వన్డే బౌలర్ పురస్కారం దక్కింది.
శ్రీలంక జట్టుపై టి20 మ్యాచ్ లో 112 పరుగులు చేసిన భారత బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్.. ఉత్తమ టి20 బ్యాటర్ పురస్కారాన్ని దక్కించుకున్నాడు.
సౌత్ ఆఫ్రికా జట్టుపై జరిగిన టి20 మ్యాచ్లో ఐదు వికెట్లు తీసిన ఆల్జారీ జోసెఫ్ కు ఉత్తమ టి20 బౌలర్ పురస్కారం దక్కింది.
లీగ్ మ్యాచ్ లలో అత్యుత్తమ ఆట తీరు ప్రదర్శించిన ఆటగాళ్లకు కూడా పురస్కారాలు దక్కాయి..
మెన్స్ టి20 లీగ్ విభాగంలో నికోలస్ పూరన్ కు ఉత్తమ బ్యాటర్ పురస్కారం దక్కింది. అతడు సిటెల్ ఓర్కాస్ జట్టుపై 137 పరుగులు చేసి అజేయంగా నిలవడంతో అతడికి ఈ పురస్కారం లభించింది.
సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుపై ఐపీఎల్ నాలుగు వికెట్లు తీసిన యజువేంద్ర చాహల్ ఉత్తమ టి20 పురస్కారం దక్కించుకున్నాడు.
మహిళల విభాగంలో..
చమ్రి ఆటపట్టు న్యూజిలాండ్ జట్టుపై జరిగిన మ్యాచ్లో 140 పరుగులు చేయడంతో.. ఆమెకు ఉత్తమ వన్డే విమెన్ బ్యాటర్ పురస్కారం దక్కింది.
ఆస్ట్రేలియాపై 132 పరుగులు చేసిన హేలే కు ఉత్తమ టి20 విమెన్ బ్యాటర్ పురస్కారం లభించింది.
ఇంగ్లాండ్ జట్టు పై నాలుగు వికెట్లు తీసిన అయా బొంగా ఖాఖా కు ఉత్తమ టి20 విమెన్ బౌలర్ అవార్డు లభించింది. పెర్త్ స్క్రాచర్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో 136 పరుగులు చేసిన నేపథ్యంలో గ్రేస్ హారీస్ కు ఉత్తమ టీ – 20 లీగ్ బ్యాటర్ పురస్కారం లభించింది.
బ్రిస్బెన్ హీట్ జట్టుపై మూడు వికెట్లు తీసిన వెల్డింగ్టన్ క్రీడాకారిణి అమాండ జాడే కు ఉత్తమ టి20 లీగ్ విమెన్ బౌలర్ అవార్డు దక్కింది.
అసోసియేట్ బ్యాటింగ్ విభాగంలో బాస్ డీ లీడే కు, అసోసియేట్ బౌలింగ్ భాగంలో మెక్కులమ్ కు పురస్కారాలు లభించాయి.
గెరాల్డ్ కొట్జీ కి ఉత్తమ అరంగేట్ర ఆటగాడి పురస్కారం లభించింది.
ప్యాట్ కమిన్స్ కు ఉత్తమ కెప్టెన్ పురస్కారం దక్కింది. వరల్డ్ టెస్ట్ క్రికెట్ ఫైనల్ కప్, వన్డే క్రికెట్ కప్ తన జట్టుకు దక్కేలా చేయడంతో ప్యాట్ కమిన్స్ కు ఉత్తమ కెప్టెన్ పురస్కారం ప్రకటించినట్టు ESPN వివరించింది. ఇక సూర్య కుమార్ యాదవ్ కు ఉత్తమ బ్యాటర్ పురస్కారం దక్కడం ఇది రెండవసారి.