Shoaib Bashir: షోయబ్ బషీర్.. ఇంగ్లండ్ క్రికెటర్.. విశాఖ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో అదరగొడుతున్నాడు. భారత జట్టులో రెండు కీలక వికెట్లు పగడొట్టి అందరి దృష్టిని తన వైపు మళ్లించుకున్నాడు. రోహిత్ శర్మ, రాహుల్‌ను బషీర్ తన స్పిన్‌తో బురిడీ కొట్టించాడు. 20 ఏళ్ల ఈ క్రికెటర్ అరంగేట్రం మ్యాచ్‌లో తొలి వికెట్‌గా భారత కెప్టెన్‌ను ఔట్ చేశారు. అయితే బషీర్‌కు భారత వీసా రావడంలో ఆలస్యం కావడంతో అతడి ఆరంగేట్రం కాస్త ఆలస్యమైంది. అదొక చేదు జ్ఞాపకం కాగా, రోహిత్ వికెట్ తీయడం అతనికి మధుర జ్ఞాపకంగా మిగిలిపోనుంది.
ఆలస్యం ఎందుకంటే.
పాకిస్ఠానీ వారసత్వం ఉన్న బషీర్‌కు భారత్ వీసా ఇవ్వడం ఆలస్యమైంది. దీంతో హైదరాబాద్ రావడానికి ఇబ్బంది పడ్డాడు. కానీ, చివరకు టెస్ట్ సమయానికి హైదరాబాద్ చేరుకున్నాడు. జట్టుతో కాకుండా ప్రత్యేకంగా వచ్చాడు. అంతేకాదు అరంగేట్రంతో చిరస్మరణీయమైన వికెట్ తీసి అదరగొట్టాడు. తొలి టెస్ట్‌లో అవకాశం రాలేదు. కానీ, రెండో టెస్ట్‌లో అరంగేట్రం చేశాడు. బెయిర్ స్టోక్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టాడు.
ఆరు ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లే.. బషీర్ ఇంగ్లండ్ జట్టుకు ఎంపిక కావడానికి ముందు కేవలం ఆరు ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. అయితే ఆరు మ్యాచ్‌లలోతన స్పిన్‌తో ఇంగ్లండ్ సెలక్షన్ కమిటీ దృష్టిలో పడ్డాడు. ఈ క్రమంలో భారత్ టూర్‌కు ఎంపిక చేశారు.
వీసాకు ఇబ్బంది..
వీసా జారీకి ముందు బషీర్ అబుదాబి నుంచి ఇంగ్లండ్ వెళ్లాడు. అబుదాబి నుంచి వీసా జారీకి భారత్ అభ్యంతరం తెలిపింది. దీంతో కెప్టెన్ స్టోక్స్ కాస్త అసహనానికి గురయ్యాడు. వీసా వచ్చే వరకూ అంబుదాబీలోనే ఉండాలని సూచించాడు. కానీ బషీర్ మాత్రం వీసా వస్తుందన్న నమ్మకంతో ఇంగ్లండ్ వెళ్లాడు.
ఎత్తే అతడికి ప్లస్..
ఇక బషీర్‌కు మరో ప్లస్ పాయింట్ అతని ఎత్తుత 6 అడుగుల నాలుగు అంగుళాల ఎత్తు అతడికి సహాయపడుతుంది. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ అలిస్టర్ కుక్ ఆధ్వర్యంలో శిక్షన పొందాడు. ఈ క్రమంలోనే అరంగేట్రం మ్యాచ్‌ను అతను ప్రెస్టేజ్‌గా తీసుకున్నాడు. తొలి వికెట్‌తోనే ఆకట్టుకున్నాడు. ఇంగ్లండ్ తరఫున 713వ ఆటగాడిగా జట్టులోకి వచ్చాడు. రెండో టెస్టులో తుది జట్టుకు ఎంపికయ్యాడు.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Englands test debutant shoaib bashir gave a brilliant performance on the first day of the second test against india
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com