https://oktelugu.com/

England Vs Australia 3rd Test: అలా గెలిచే సత్తా ఇంగ్లాండ్ కి ఉందా ?

ఇంగ్లాండ్ జట్టు తప్పక గలవాల్సిన మూడో టెస్టులో విజయం సాధించడం ద్వారా సిరీస్ లో పోటీలో నిలిచింది. లీడ్స్ వేదికగా జరిగిన మూడో టెస్టులో ఇంగ్లాండ్ జట్టు మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

Written By:
  • BS
  • , Updated On : July 10, 2023 11:30 am
    England Vs Australia 3rd Test

    England Vs Australia 3rd Test

    Follow us on

    England Vs Australia 3rd Test: ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ లో ఇంగ్లాండ్ జట్టు ఎట్టకేలకు విజయం సాధించింది. మొదటి, రెండు టెస్టుల్లో ఘోరంగా ఓటమిపాలైన ఇంగ్లాండు జట్టు.. తప్పక గెలవాల్సిన మూడో టెస్టులో విజయం సాధించి సిరీస్ లో పోటీలో నిలిచింది. తాజా విజయంతో సిరీస్ లో ఆస్ట్రేలియా 2-0 తో ఉన్న ఆధిక్యాన్ని.. 2-1 కి ఇంగ్లాండ్ జట్టు తగ్గించగలిగింది. దీంతో యాషెస్ సిరీస్ పై అభిమానులకు అత్యంత ఆసక్తిని పెంచింది.

    ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్లు అత్యంత ప్రతిష్టాత్మకంగా యాషెస్ సిరీస్ ను. భావిస్తాయి. ఈ సిరీస్ కోసం కొద్ది నెలల నుంచి ఇరు జట్లు సన్నద్ధమవుతుంటాయి. అందుకు అనుగుణంగానే జూన్ 16 నుంచి యాషెస్ సిరీస్ ప్రారంభమైంది. బజ్ బాల్ వ్యూహన్ని అనుసరిస్తూ గత కొన్నాళ్ల నుంచి అద్భుతమైన విజయాలను నమోదు చేస్తున్న ఇంగ్లాండ్ జట్టు.. ఈ సిరీస్ లో కూడా అదే వ్యూహాన్ని అనుసరించి ఆస్ట్రేలియా జట్టుపై ఒత్తిడి పెంచాలని భావించింది. ఒకరకంగా చూస్తే వీరి వ్యూహం ఫలించినట్లే మొదటి టెస్టులో కనిపించింది. కానీ, అనూహ్యంగా మొదటి, రెండు టెస్టుల్లో ఇంగ్లాండ్ జట్టు ఓటమిపాలు కావడంతో బజ్ బాల్ వ్యూహం బెడిసి కొట్టింది అన్న విమర్శలు వచ్చాయి. రెండు టెస్టుల్లోను ఓటమిపాలు కావడంతో ఈ సిరీస్ లో ఆతిధ్య ఇంగ్లాండ్ జట్టు వెనుకబడిపోయింది. తప్పక గెలవాల్సిన మూడో టెస్టులో విజయం సాధించడం ద్వారా ఇంగ్లాండ్ జట్టు ఈ సిరీస్ లో మళ్ళీ పోటీలోకి వచ్చినట్టు అయింది.

    సిరీస్ పై ఆశలతోనే ఇంగ్లాండ్ జట్టు..

    ఇంగ్లాండ్ జట్టు తప్పక గలవాల్సిన మూడో టెస్టులో విజయం సాధించడం ద్వారా సిరీస్ లో పోటీలో నిలిచింది. లీడ్స్ వేదికగా జరిగిన మూడో టెస్టులో ఇంగ్లాండ్ జట్టు మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదటి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా జట్టు 263 పరుగులు చేయగా, ఇంగ్లాండ్ జట్టు 237 పరుగులు మాత్రమే చేయగలిగింది. రెండో ఇన్నింగ్స్ లో 224 పరుగులు ఆస్ట్రేలియా జట్టు చేయగా.. 254 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండు జట్టు మరో మూడు వికెట్లు మిగిలి ఉండగానే విజయాన్ని నమోదు చేసింది. మూడో టెస్టులో విజయం సాధించడం ద్వారా సిరీస్ సొంతం చేసుకోవాలని భావించిన ఆస్ట్రేలియా జట్టుకు నిరాశే మిగిలింది. మిగిలిన రెండు టెస్టుల్లో ఇంగ్లాండ్ జట్టు విజయం సాధిస్తే.. సిరీస్ కైవశం చేసుకునే అవకాశం ఉంది. ఒక్క టెస్టులో ఆస్ట్రేలియా జట్టు విజయం సాధించినా.. సిరీస్ ఆసీస్ కైవసం అవుతుంది. దీంతో మిగిలిన రెండు టెస్టుల్లోనూ తప్పక గెలవాల్సిన పరిస్థితి ఆస్ట్రేలియా జట్టుకు ఏర్పడింది.

    ఇంగ్లాండ్ జట్టుకు కలిసి వచ్చిన మార్పులు..

    మొదటి రెండు టెస్టుల్లో విఫలమైన తర్వాత ఇంగ్లాండ్ జట్టు టీమ్ లో మార్పులు చేసింది. మూడు మార్పులతో మూడో టెస్ట్ లో బరిలోకి దిగి విజయం సాధించింది. ఈ టెస్ట్ లో బరిలోకి దిగిన మార్కువుడ్, క్రిష్ వోక్స్ ఇంగ్లాండ్ జట్టుకు బలంగా మారారు. వీరిద్దరూ మొదటి ఇన్నింగ్స్ లో ఏకంగా ఎనిమిది వికెట్లు పడగొట్టారు. మార్క్ వుడ్ ఐదు వికెట్లు పడగొట్టుగా, క్రిష్ వోక్స్ మూడు వికెట్లు పడగొట్టి ఆస్ట్రేలియా జట్టు పతనాన్ని శాసించారు. ఇక ఇంగ్లాండ్ జట్టు మొదటి ఇన్నింగ్స్ లోను వుడ్, క్రిష్ వోక్స్ బ్యాటింగ్ లోను సత్తా చాటారు. కీలక బ్యాటర్లు ఆడలేక చేతులెత్తేసిన దశలో మార్క్ వుడ్ 8 బంతుల్లో 24 పరుగులు, క్రిష్ వోక్స్ పది బంతుల్లో పది పరుగులు చేసి జట్టుకు విలువైన పరుగులను జమ చేశారు. అలాగే, ఈ మ్యాచ్ లో బరిలోకి దిగిన మొయిన్ అలీ కూడా రాణించాడు. 46 బంతుల్లో 21 పరుగులు చేశాడు. అలాగే, రెండో ఇన్నింగ్స్ లోను ఇంగ్లాండు బౌలర్లు మార్కు వుడ్, క్రిస్ వోక్స్, మొయిన్ అలీ సత్తా చాటారు. క్రిష్ వోక్స్ మూడు వికెట్లు, మార్కు వుడ్ రెండు, మొయిన్ అలీ రెండు రెండు వికెట్ల చొప్పున పడగొట్టి ఇంగ్లాండ్ పతనాన్ని శాసించారు. ఇక బ్యాటింగ్ లోను ఈ మ్యాచ్ లో బరిలోకి దిగిన ఆటగాళ్లు ఆదుకున్నారు. క్రిస్ వోక్స్ 47 బంతుల్లో 32 పరుగులు (నాటౌట్), మార్కు వుడ్ 8 బంతుల్లో 16 పరుగులు (నాటౌట్) నిలిచి జట్టుకి విజయాన్ని అందించి పెట్టారు. ఏది ఏమైనా మూడో టెస్టులో చేసిన మార్పులు ఇంగ్లాండ్ జట్టుకు కలిసి రావడంతోపాటు సిరీస్ లో పోటీలో నిలిచేలా చేసింది.

    ఇలా రెండు టెస్టులు ఓడిపోయి తరువాత మూడు గెలవడం యాషెస్ సిరీస్ లో ఒకేసారి జరిగింది.. అదే 1936-37 లో బ్రాడ్ మెన్  టీమ్ గెలిచింది..ఈసారి కూడా ఇంగ్లండ్ కసితో ఆడితే దాన్ని సాధించే అవకాశం ఉంటుంది.