England Vs Australia 2nd Test: సెంచరీతో చెలరేగిన స్టీవ్ స్మిత్.. ఆ రికార్డు కైవసం..!

ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో సెంచరీ చేయడం ద్వారా స్టీవ్ స్మిత్ తన పేరిట నమోదు చేసుకున్నాడు. అతి తక్కువ మ్యాచ్ ల్లో అత్యంత వేగంగా 32 సెంచరీలు పూర్తి చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు స్టీవ్ స్మిత్. 99 టెస్టుల్లో స్మిత్ ఈ ఘనతను సాధించాడు.

Written By: BS, Updated On : June 30, 2023 8:33 am

England Vs Australia 2nd Test

Follow us on

England Vs Australia 2nd Test: ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న యాషెస్ సిరీస్ లో భాగంగా రెండో టెస్ట్ జరుగుతోంది. ఈ టెస్టులో తొలుత బ్యాటింగ్ చేస్తున్న ఆస్ట్రేలియా జట్టు అద్భుతమైన బ్యాటింగ్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ తొలి ఇన్నింగ్స్ లో అద్భుతమైన బ్యాటింగ్ తో అదరగొడుతున్నాడు. మొదటి టెస్టులో రెండు ఇన్నింగ్స్ లోనూ దారుణంగా విఫలమయ్యాడు. రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో అద్భుతమైన బ్యాటింగ్ తో అదరగొడుతున్న స్టీవ్ స్మిత్ మరో రికార్డును జమ చేసుకున్నాడు.

యాషెస్ సిరీస్ లో భాగంగా లార్డ్స్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులు ఆస్ట్రేలియా బ్యాటర్ స్టీవ్ స్మిత్ సెంచరీతో కదం తొక్కాడు. తొలి టెస్ట్ లో 16, 6 పరుగులతో విఫలమైన స్మిత్ రెండో టెస్టులో మాత్రం సత్తా చాటాడు. తొలి ఇన్నింగ్స్ లో 110 పరుగులు సాధించి తన టెస్ట్ కెరీర్లో 30వ శతకాన్ని పూర్తి చేశాడు. అంతర్జాతీయ కెరీర్లో ఓవరాల్ గా 44వ శతకాన్ని నమోదు చేసుకున్నాడు స్టీవ్ స్మిత్. ఈ క్రమంలోనే మరో అరుదైన రికార్డును దక్కించుకున్నాడు.

రికార్డు సృష్టించిన స్టీవ్ స్మిత్..

ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో సెంచరీ చేయడం ద్వారా స్టీవ్ స్మిత్ తన పేరిట నమోదు చేసుకున్నాడు. అతి తక్కువ మ్యాచ్ ల్లో అత్యంత వేగంగా 32 సెంచరీలు పూర్తి చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు స్టీవ్ స్మిత్. 99 టెస్టుల్లో స్మిత్ ఈ ఘనతను సాధించాడు. అలాగే ఆస్ట్రేలియా తరఫున అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో స్థానానికి చేరుకున్నాడు స్మిత్. 32 సెంచరీలతో స్టీవ్ వా ఈ జాబితాలో ముందంజలో ఉండగా.. 32 సెంచరీలతో స్టీవ్ వా రికార్డును సమం చేశాడు స్టీవ్ స్మిత్. ఈ క్రమంలోనే స్టీవ్ స్మిత్ మరో రికార్డును సాధించాడు. టీమిండియా ప్రస్తుత సారధి రోహిత్ శర్మను అధిగమించడంతోపాటు యాక్టివ్ క్రికెటర్లలో అత్యధిక ఇంటర్నేషనల్ సెంచరీలు సాధించిన ఆటగాళ్లు జాబితాలో నాలుగో స్థానానికి చేరుకున్నాడు. ఈ జాబితాలో భారత్ ఆటగాడు విరాట్ కోహ్లీ 75 సెంచరీలతో టాప్ లో ఉండగా, 46 సెంచరీలతో ఇంగ్లాండ్ ఆటగాడు జో రూట్ రెండో స్థానంలో, 45 సెంచరీలతో ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్ మూడో స్థానంలో, 44 సెంచరీలతో ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ నాలుగు, 43 సెంచరీలతో భారత ఆటగాడు రోహిత్ శర్మ ఐదవ స్థానంలో కొనసాగుతున్నారు.

138 పరుగుల ఆదిత్యంలో ఆస్ట్రేలియా..

లార్డ్స్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు రెండో రోజు ముగిసే సమయానికి ఆస్ట్రేలియా జట్టు 138 పరుగులు ఆదిత్యంలో ఉంది. ఆస్ట్రేలియా జట్టు మొదటి ఇన్నింగ్స్ లో ను 416 పరుగులకు ఆల్ అవుట్ అయింది. ఆస్ట్రేలియా జట్టులో ఓపెనర్లు డేవిడ్ వార్నర్ 88 బంతుల్లో 66 పరుగులు చేయగా, లబు చేంజ్ 93 బంతుల్లో 47 పరుగులు, స్టీవెన్ స్మిత్ 184 బంతుల్లో 110 పరుగులు, హెడ్ 73 బంతుల్లో 77 పరుగులు, అలెక్స్ క్యారీ 43 బంతుల్లో 22 పరుగులు, కామెంట్స్ 33 బంతుల్లో 22 పరుగులు (నాటౌట్) చేశాడు. మిగిలిన ఆటగాళ్లు ఎవరూ పెద్దగా రాణించకపోవడంతో 416 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇంగ్లాండ్ జట్టు భారీ లక్ష్యంతో బరిలోకి దిగినప్పటికీ ధాటిగానే బ్యాటింగ్ చేసింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి నాలుగు వికెట్లు నష్టపోయి 278 పరుగులు చేసింది. జాక్ క్రావ్లే 48 బంతుల్లో 48 పరుగులు చేయగా, బెన్
డకేట్ 134 బంతుల్లో 98 పరుగులు, ఒల్లి పోప్ 63 బంతుల్లో 42 పరుగులు చేశారు. హ్యరీ బ్రూక్ 51 బంతుల్లో 45 పరుగులు, బెన్ స్టోక్స్ 57 బంతుల్లో 17 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ బౌలర్లో జోష్ టంగు మూడు వికెట్లు, రాబిన్షన్ 3 వికెట్లు, రూట్ 2 వికెట్లు తో చెలరేగి ఆస్ట్రేలియా పతనాన్ని శాసించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్, జోష్ హజల్వుడ్, నాథన్ లయోన్, గ్రీన్ ఒక్కో వికెట్ తీశారు.