England Player Root: అనుకున్నట్టుగానే అండర్సన్ – టెండూల్కర్ టెస్ట్ సిరీస్ లో ఇంగ్లాండ్ ఆటగాడు రూట్ అదరగొడుతున్నాడు. భారత బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారిపోయాడు. ఇంగ్లాండ్ సాధించిన రెండు విజయాలలో అతడు కీలక పాత్ర పోషించాడు. త్వరలో ఇంగ్లాండ్ భారత్ మధ్య నాలుగో టెస్ట్ జరగనుంది. Manchester లోని old Trafford మైదానంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఈ వేదికపై రూట్ కు తిరుగులేని రికార్డు ఉంది. అదే ఇప్పుడు భారత జట్టుకు పెద్ద తలనొప్పిగా మారింది.
ఈనెల 23 నుంచి మాంచెస్టర్ లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా నాలుగో టెస్ట్ జరుగుతుంది. ఇంగ్లీష్ జట్టు ప్లేయర్లలో రూట్ కు ఇక్కడ అద్భుతమైన రికార్డు ఉంది.. ఈ సిరీస్లో మొదటి రెండు టెస్టులలో తన ఆగమనాన్ని చాటుకున్న రూట్.. మూడో టెస్టులో తన పూర్వపులైను అందుకున్నాడు. మూడవ టెస్ట్ రెండు ఇన్నింగ్స్ లలో రూట్ అదరగొట్టాడు. ఇంగ్లాండ్ సాధించిన విజయంలో కీలక పాత్ర పోషించాడు.. ఫస్ట్ ఇన్నింగ్స్ లో రూట్ సెంచరీ చేశాడు. సెకండ్ ఇన్నింగ్స్ లో 40 పరుగులు చేశాడు..రూట్ కు ఇంగ్లాండులో అత్యంత ఇష్టమైన మైదానాలలో ఓల్డ్ ట్రాఫోర్డ్ ఒకటి. ఈ వేదిక మీద అతడి బ్యాటింగ్ సగటు 65.20 గా ఉంది. ఇప్పటివరకు ఈ వేదికపై 11 టెస్ట్ మ్యాచ్లు ఆడిన రూట్ 978 రన్స్ చేశాడు. ఇందులో ఒక సెంచరీ.. 7 అర్థ శతకాలు ఉన్నాయి. తన కెరియర్ లోనే హైయెస్ట్ స్కోర్ అయిన 254 పరుగులను రూట్ ఈ మైదానంలో పాకిస్తాన్ పై సాధించాడు. మరో 22 పరుగులు చేస్తే ఈ వేదికపై 1000 పరుగులు చేసిన ఆటగాడిగా రూట్ నిలుస్తాడు.
రూట్ ప్రస్తుతం టెస్ట్ ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ స్థానంలో ఉన్నాడు. మూడో టెస్టులో తన రూపాన్ని చూపించిన రూట్.. నాలుగో టెస్ట్ లో కూడా అదే జోరు కొనసాగిస్తాడని ఇంగ్లాండ్ జట్టు భావిస్తోంది. ఒకవేళ గనుక అతడు అదే లయను కొనసాగిస్తే టీమిండియాకు ఇబ్బంది తప్పదు .. ఇప్పటికే టీమ్ ఇండియా పై టెస్ట్ ఫార్మేట్ లో 3000 పరుగులు చేసిన ఆటగాడిగా రూట్ రికార్డు సృష్టించాడు.. ఇక నాలుగవ టెస్టును కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఇండియా మీద ఉంది. అలాంటప్పుడు ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో కచ్చితంగా మ్యాచ్ గెలవాలి. అది జరగాలంటే రూట్ కు రూట్ లేకుండా చేయాలి.. మరోవైపు పోప్, క్రాలీ, స్టోక్స్, డకెట్ వంటి ప్లేయర్లు పరుగులు చేయడంలో ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ జట్టు రూట్ మీద ఎక్కువగా ఆధారపడుతోంది. అందువల్ల నాలుగో టెస్టులో రూట్ ను భారత బౌలర్లు త్వరగా అవుట్ చేయాలి. అంతేకాదు సిరీస్ సజీవంగా ఉంచాలి అనుకుంటే కచ్చితంగా ఈ వేదికపై జరిగే మ్యాచ్లో భారత్ గెలవాలి. ఇది జరగాలంటే పకడ్బందీ ప్రణాళిక అనుసరించాలి. ఏ విషయంలోనూ నిర్లక్ష్యాన్ని ప్రదర్శించకూడదు.
భారత బౌలింగ్ లో వైవిధ్యం కచ్చితంగా ఉండాలి. ఇలా జరగాలంటే మరో బౌలర్ కు అవకాశం ఇవ్వాలని సీనియర్ ప్లేయర్లు అభిప్రాయపడుతున్నారు. సిరాజ్, బుమ్రా, ఆకాష్ దీప్ మాత్రమే కాకుండా.. మరో బౌలర్ ని కూడా జట్టులోకి తీసుకోవాలని సూచిస్తున్నారు. మూడో టెస్టులో ఆకాష్ విఫలమైన నేపథ్యంలో.. అర్ష్ దీప్ సింగ్ కు అవకాశం ఇవ్వాలని సీనియర్ ప్లేయర్లు సలహాలు ఇస్తున్నారు.