https://oktelugu.com/

England Vs Australia : : శ్రీలంక ఇచ్చిన షాక్ నుంచి కోలుకోలేని ఇంగ్లాండ్.. ఆస్ట్రేలియా చేతిలోనూ అదే ఫలితం

మూడు టెస్టుల సిరీస్ ను 2-1 తేడాతో శ్రీలంకపై ఇంగ్లాండ్ గెలిచినప్పటికీ.. చివరి టెస్టులో శ్రీలంక అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఇంగ్లాండ్ జట్టుకు కోలుకోలేని షాక్ ఇచ్చింది. అయితే ఆ షాక్ నుంచి ఇంగ్లాండ్ జట్టు బయటపడినట్టు కనిపించడం లేదు..

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : September 12, 2024 / 12:15 PM IST

    England Vs Australia

    Follow us on

    England Vs Australia :  మూడు టి20 మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా ఆస్ట్రేలియా జట్టు ఇంగ్లాండ్ లో పర్యటిస్తోంది.. తొలి టి20 మ్యాచ్ సౌతాంప్టన్ లోని రోజ్ బౌల్ వేదికగా జరిగింది. ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా జట్టు 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచినప్పటికీ ఇంగ్లాండ్ జట్టు ఆస్ట్రేలియా జట్టును బ్యాటింగ్ కు ఆహ్వానించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా హెడ్(23 బంతుల్లో 59), మాథ్యూ షార్ట్(26 బంతుల్లో 41) పెను విధ్వంసం సృష్టించడంతో నిర్ణీత 19.3 ఓవర్లలో 179 పరుగులు చేసింది. తొలి వికెట్ కు హెడ్, షార్ట్ 83 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వేగంగా హాఫ్ సెంచరీ చేసిన హెడ్.. సాకిబ్ మహమూద్ బౌలింగ్లో ఔట్ అయ్యాడు. ఆ తర్వాత షార్ట్ కూడా లివింగ్ స్టోన్ బౌలింగ్ లో వెనుతిరిగాడు. దీంతో 86 పరుగులకే ఆస్ట్రేలియా రెండు వికెట్ల కోల్పోయింది. ఈ దశలో వచ్చిన జోస్ ఇంగ్లిస్(37) మినహా మిగతా వారంతా ఇంగ్లాండ్ బౌలర్లకు దాసోహం అయ్యారు. దీంతో 19.3 ఓవర్లలో ఆస్ట్రేలియా 179 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది. ఇంగ్లాండ్ బౌలర్లలో లివింగ్ స్టోన్ 3 వికెట్లు దక్కించుకున్నాడు.. సాకిబ్ మహమూద్, జోప్రా ఆర్చర్ చెరో రెండు వికెట్లు సొంతం చేసుకున్నారు. ఆదిల్ రషీద్, సామ్ కరన్ చెరో తమ ఖాతాలో వేసుకున్నారు.

    ఏ దశలోనూ ఓడించేలాగా కనిపించలేదు

    180 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టు ఏ దశలోనూ.. ఆస్ట్రేలియాను ఓడించేలాగా కనిపించలేదు. ఆ జట్టు ఓపెనర్ బ్యాటర్లు స్వల్ప పరుగులకే అవుట్ అయ్యారు. ఇంగ్లాండ్ జట్టు స్కోరు 13 పరుగుల వద్ద ఉన్నప్పుడు జాక్స్ వికెట్ కోల్పోయింది. మరో ఓపెనర్ సాల్ట్ వేగంగా ఆడే క్రమంలో 20 పరుగులు చేసి అబాట్ బౌలింగ్ లో వెనుతిరిగాడు. ఆ తర్వాత వచ్చిన ఆటగాళ్లలో లివింగ్ స్టోన్ (37) మినహా మిగతా వారంతా విఫలమయ్యారు. ఆస్ట్రేలియా బౌలర్ల ఎదుట దాసోహమ య్యారు. ఫలితంగా ఇంగ్లాండ్ జట్టు 19.2 ఓవర్లలో 151 పరుగులకు అలౌట్ అయింది. ఆస్ట్రేలియా బౌలర్లలో అబాట్ 3 వికెట్లు సాధించాడు. హజిల్ వుడ్, జంపా చెరో రెండు వికెట్లు సొంతం చేసుకున్నారు. షార్ట్ లెట్, గ్రీన్, స్టోయినిస్ చెరో వికెట్ సొంతం చేసుకున్నారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం హెడ్ కు లభించింది. తదుపరి మ్యాచ్ సెప్టెంబర్ 13న కార్డిఫ్ సోఫియా గార్డెన్స్ లో జరుగుతుంది. తొలి టి20 ఓడిపోవడంతో ఇంగ్లాండు జట్టుపై ఆ దేశ అభిమానులు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. గెలవాల్సిన మ్యాచ్ లో ఓడిపోయారని మండిపడుతున్నారు.