Test Championship Final 2025: ప్రపంచ క్రికెట్ సమాఖ్య కు భారతీయుడైన జై షా చైర్మన్ గా కొనసాగుతున్నారు. అంతే కాదు ప్రపంచంలోనే అత్యంత రిచ్ క్రికెట్ లీగ్ అయిన ఐపీఎల్ ను బీసీసీఐ నిర్వహిస్తోంది. పాకిస్తాన్ మినహా మిగతా దేశాల చెందిన ఆటగాళ్లు ఐపీఎల్ ద్వారా ఆర్థికంగా లబ్ధి పొందుతున్నారు. ఐసీసీ నిర్వహించే మేజర్ టోర్నీలలో ఆడ లేకపోతున్న ఆటగాళ్లు.. ఐపీఎల్ లో మాత్రం కచ్చితంగా ఆడుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. క్రికెట్ లో ప్రస్తుతం బీసీసీఐ చెప్పిందే వేదం. ఇటీవల పాకిస్తాన్ వేదికగా నిర్వహించిన ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడబోమని భారత్ స్పష్టం చేసింది. ఐసీసీకి లేఖ కూడా రాసింది. దీంతో ఐసీసీ హైబ్రిడ్ మోడ్ లో ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించింది. టీమిండి ఆడే మ్యాచ్లను దుబాయ్ వేదికగా నిర్వహించింది. దీంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కు తీవ్రంగా నష్టం వాటిల్లింది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఛాంపియన్స్ ట్రోఫీని దృష్టిలో పెట్టుకొని 500 కు పైగా కోట్ల రూపాయలతో మైదానాలను ఆధునికరించింది. అంతేకాదు భారత్ వస్తుందని ఆశతో భారీగా ఏర్పాట్లు చేసింది. భారత్ తమ దేశంలో ఆడేందుకు ఖచ్చితంగా రావాలని కోరింది. భారత్ వస్తే ప్రకటనలపరంగా తమకు ఆదాయం ఎక్కువగా వస్తుందని.. కార్పొరేట్ కంపెనీలు యాడ్స్ ఇవ్వడానికి క్యూ కడతాయని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పేర్కొంది.. అయినప్పటికీ బిసిసిఐ తమ జట్టును పాకిస్తాన్ పంపడానికి ఆసక్తి చూపించలేదు. దీంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కు తీవ్రంగా నష్టం వాటిల్లింది. పైగా లీగ్ దశలోనే పాకిస్తాన్ జట్టు ఇంటికి వెళ్లడంతో నష్టాలు మరింత ఎక్కువగా వచ్చాయని నివేదికలు చెబుతున్నాయి.
Also Read: ఎట్టకేలకు ‘బాహుబలి 2 ‘ ని దాటేసిన ‘చావా’..’పుష్ప 2′ ని అందుకోవాలంటే ఇంకా ఎంత గ్రాస్ రావాలో తెలుసా!
ఇంగ్లాండ్ కు సైతం..
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ సైకిల్లో గత ఏడాది న్యూజిలాండ్ జట్టుతో జరిగిన మూడు టెస్టుల్లో టీమిండియా ఓడిపోయింది. స్వదేశం వేదికగా జరిగిన ఈ సిరీస్లో తొలిసారిగా వైట్ వాష్ కు గురైంది. ఆ తర్వాత ఆస్ట్రేలియా వేదికగా జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కూడా టీమిండియా విఫల ప్రదర్శన చేసింది. 1-3 తేడాతో సిరీస్ కోల్పోయింది. దీంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ వెళ్లలేకపోయింది.. టీమిండియా పై ఆస్ట్రేలియా గెలవడం.. పాకిస్తాన్ పై దక్షిణాఫ్రికా విజయం సాధించడంతో.. ఈ రెండు జట్లు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ వెళ్లాయి. లార్డ్స్ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది.. అయితే టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ వెళ్లకపోవడంతో.. క్రికెట్ ఇంగ్లాండ్ 45 కోట్ల రూపాయలను నష్టపోతుందని తెలుస్తోంది. టీమిండియా కనుక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ ఆడితే అభిమానులు భారీగా వచ్చేవారు. ఆ సమయంలో లార్డ్స్ లో హోటళ్లు మొత్తం బుక్ అయ్యేవి. విమానాలకు విపరీతమైన గిరాకీ ఉండేది. స్థానికంగా ఉండే వ్యాపారులు కూడా లాభం పొందేవారు. లార్డ్స్ మైదానం భారత అభిమానులతో నిండిపోయేది. తద్వారా క్రికెట్ ఇంగ్లాండ్ కు కూడా దండిగా ఆదాయం వచ్చేది. అయితే భారత్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ ఆడక పోవడం వల్ల ఇన్ని ఆదాయాలు దూరమవుతున్నాయి.
అప్పుడు ఏం జరిగిందంటే..
2021 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ లో న్యూజిలాండ్, భారత్ తలపడ్డాయి. సౌత్ఆఫ్టన్ వేదికగా ఈ మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్ చూసేందుకు భారత అభిమానులు విపరీతంగా వచ్చారు.. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డుకు దండిగా ఆదాయం వచ్చింది. ఆ మ్యాచ్లో భారత్ ఓడిపోయింది. 2023 సీజన్లో భారత్ – ఆస్ట్రేలియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ లో తలపడ్డాయి. ఓవల్ వేదికగా ఈ మ్యాచ్ జరిగింది. అప్పుడు కూడా భారత్ ఓడిపోయింది. అయినప్పటికీ భారత అభిమానులు భారీగా రావడంతో ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డుకు విపరీతంగా ఆదాయం వచ్చింది. ఇక ప్రస్తుత సీజన్లో ఫైనల్ మ్యాచ్ లార్డ్స్ లో జరగనుంది. అయితే ఈసారి టీమిండియా ఫైనల్స్ లో చోటు దక్కించుకోకపోవడంతో… ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు 45 కోట్ల వరకు నష్టపోయే సూచనలు కనిపిస్తున్నాయని నివేదికలు చెబుతున్నాయి.