Eng Vs Ind 3rd Test: రెండవ టెస్టులో ఓటమి తర్వాత ప్లాట్ పిచ్ ల వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో బోధపడింది ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్ స్టోక్స్ కు. అందుకే క్రికెట్ మక్కాగా పేరు పొందిన లార్డ్స్ పిచ్ ను ప్లాట్ గా కాకుండా, వికెట్ కు అనుకరించేలా రూపొందించాలని క్యూరేటర్ మీద ఒత్తిడి తీసుకొచ్చాడు. అనుకున్న విధంగానే చేశాడు. అది ఇంగ్లాండ్ జట్టుకు ఏమాత్రం లాభం చేకూర్చలేదు. పైగా టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు ఈ మైదానంలో ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు 387 పరుగులు చేసింది. ఒకానొక దశలో ఐదు వికెట్లకు 260 పరుగులు చేసి పటిష్ట స్థితిలో ఉన్న ఇంగ్లాండ్.. చివరి ఐదు వికెట్లను 127 పరుగుల వ్యవధిలో కోల్పోవడం విశేషం..
Also Read: ప్రముఖ విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూత
వాస్తవానికి ఇంగ్లాండ్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు బంతి బ్యాట్ మీదికి రాలేదు. అలాగని బౌలర్లకు కూడా అనుకూలంగా మారలేదు. బంతిని పదే పదే వేసినచోట వేస్తే తప్ప టీమిండియా బౌలర్లకు వికెట్లు పడలేదు. వేసివేసి బంతి అరిగిపోతున్నప్పటికీ.. అంపైర్లు కొత్త బంతి ఇవ్వడానికి ఆసక్తి చూపించలేదు.. దీంతో అంపైర్ తో టీమ్ ఇండియా కెప్టెన్ గిల్ వాగ్వాదానికి దిగాడు. వాస్తవానికి పాత బంతి ఉన్నప్పుడు కొంతలో కొంత టీమిండియా బౌలర్లు వికెట్లు తీశారు. ఎప్పుడైతే కొత్త బంతి వచ్చిందో వికెట్లు పడిపోవడం అటు ఉంచితే.. కనీసం బౌన్స్ కూడా కాలేదు. తొలి టెస్ట్ జరిగిన లీడ్స్, రెండవ టెస్ట్ జరిగిన బర్మింగ్ హమ్ లో ఇలాంటి పరిస్థితి లేదు. కానీ లార్డ్స్ లో మాత్రమే ఇంతటి దారుణంగా ఉంది.
పిచ్ ను చూస్తే పచ్చగడ్డితో ఆకుపచ్చ రంగులో కనిపిస్తోంది. కానీ బంతి ఏమాత్రం అనుకున్న దిశలో పడటం లేదు.. పోనీ బ్యాటర్ల కైనా అనుకూలంగా ఉండడం లేదు. మొత్తంగా చూస్తే జిడ్డు పిచ్ లాగా లార్డ్స్ ఉంది. దీనిని క్రికెట్ మక్కా అని పిలుస్తుంటారు. ప్రతి ఆటగాడు తన జీవితంలో ఒక్కసారైనా లార్డ్స్ లో ఆడాలని కలగంటాడు. కానీ పిచ్ ను ఇలా రూపొందించిన తర్వాత ఆటగాళ్లు మాత్రం ఆడాలని ఎందుకు ఆసక్తి చూపిస్తారు.. టీమిండియా ఇన్నింగ్స్ సాగుతున్న క్రమంలో వికెట్ కీపర్ రిషబ్ పంత్ తన క్రీజ్ వద్ద కనీసం నిలబడి పరిస్థితి కూడా లేకుండా పోయిందని అంపైర్ దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో అప్పటికప్పుడు మైదాన సిబ్బంది వచ్చి పరిస్థితిని చక్కదిద్దారు. ఆ తర్వాత అక్కడ తాత్కాలికంగా ఏర్పాట్లు చేశారు. దీనినిబట్టి లార్డ్స్ పిచ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
అటు వికెట్లు తీయలేక.. బంతులను సరిగా వేయలేక ఇంగ్లాండ్ బౌలర్లు చుక్కలు చూస్తున్నారు. ఇప్పటికే ఇంగ్లాండ్ కెప్టెన్ స్టోక్ చాలా సందర్భాలలో తన అసహనాన్ని వ్యక్తం చేశాడు. అసలు ఇలాంటి పిచ్ ఉంటే ప్లేయర్లు ఎలా ఆడతారు అంటూ తన ఆవేదనను అనేక సందర్భాలలో వ్యక్తం చేశాడు. ఇంగ్లాండ్ కెప్టెన్ కంటే ముందు టీం ఇండియా స్టార్ బౌలర్ బుమ్రా కుడతన అసహనాన్ని వ్యక్తం చేశాడు. బంతికి బంతికి మధ్య 60 సెకండ్ల ఎవరి మాత్రమే ఉంచడాన్ని అతడు తప్పుపట్టాడు. ఎందుకంటే ఇలాంటి పిచ్ మీద బౌలింగ్ చేయాలంటే కచ్చితంగా శారీరకంగా దృఢంగా ఉండాలని అతడు అభిప్రాయపడ్డాడు. ఈ పిచ్ మీద బౌలింగ్ వేసి అలసిపోయినట్టు ప్రకటించాడు. తనకే కాదు ఇలాంటి అనుభవం చాలామంది ప్లేయర్లకు ఎదురవుతుందనిఅతడు వ్యాఖ్యానించాడు.
వాస్తవానికి ఇంగ్లాండ్ పిచ్ లు బౌన్సీ గా ఉంటాయి. బంతికి, బ్యాట్ కు స్వల్ప అంతరం మాత్రమే ఉంటుంది. కానీ ఈసారి మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. మొదటి రెండు టెస్టులలో పెద్దగా ఇబ్బంది లేకపోయినప్పటికీ.. మూడో టెస్ట్ జరుగుతున్న లార్డ్స్ లో మాత్రం చాలా విచిత్రమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అటు పర్యాటక జట్టుకు.. ఇటు ఆతిథ్య జట్టుకు ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతోంది. వికెట్లు పడటం లేదు. అలాగని పరుగులు రావడం లేదు.. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని తెలుసు కాబట్టే టీమిండియా సీనియర్ ప్లేయర్లు రోహిత్, విరాట్ కోహ్లీ సుదీర్ఘ ఫార్మాట్ కు వీడ్కోలు పలికారని.. అలా వీడ్కోలు పలికి బతికిపోయారని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.
Umpires changing the ball.
Umpires checked 5 balls and all didn’t go through the ring.
Ravi Shastri said, “if the balls cannot go through the ring, then why are they under the box”. pic.twitter.com/RM8OALQLxz
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 12, 2025