Eng Vs Ind 1st Test Day 2: లీడ్స్ లోని హెడింగ్లీ వేదికగా ఇంగ్లాండ్, భారత్ మధ్య జరుగుతున్నా టెస్ట్ మ్యాచ్ రెండో రోజు ఆటకు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉందని వాతావరణ నివేదికలు చెబుతున్నాయి. తొలిరోజు టీమ్ ఇండియా ఎలా ఆటలో డామినేట్ చేసిందో అలాగే రెండు రోజూ రాణించాలని అభిమానులు కోరుకుంటున్నారు. శనివారం ఉదయం కేవలం 25 శాతం వర్షం పడే ఛాన్స్ ఉంది. కానీ మధ్యాహ్నం దాదాపు 86 శాతం చినుకులు కురిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.