Eng Vs Ind 1st Test 2025: హెడింగ్లీ వేదికగా తొలి టెస్ట్ జరుగుతుంది.. అయితే ఈసారి టీమ్ ఇండియాలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ లేకపోవడం పెద్ద లోటు.. అత్యంత కఠిన పరిస్థితులు ఎదురయ్యే ఇంగ్లీష్ గడ్డమీద పై ముగ్గురు లేకుండానే గిల్ సేన ఎలా ఆడుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఇంగ్లీష్ గడ్డమీద భారత్ గత 93 సంవత్సరాలుగా పర్యటిస్తూనే ఉంది. 1971 లో తొలిసారి, 1986 లో రెండవసారి, 2007లో మూడోసారి మాత్రమే భారత్ సిరీస్ విజయాలను సాధించింది. 93 సంవత్సరాలలో కేవలం మూడుసార్లు మాత్రమే విజేతగా నిలిచిందంటే ఇంగ్లాండ్ గడ్డమీద భారత జట్టుకు ఎలాంటి పరిస్థితి ఎదురైందో అర్థం చేసుకోవచ్చు.
Also Read: శార్దూల్ ఠాకూర్, నితీష్ కుమార్ రెడ్డి.. “లీడ్స్” లో లీడ్ చేసే ఆల్ రౌండర్ ఎవరో?
మైదానం ఎలా ఉందంటే
ఇంగ్లాండ్ పిచ్ లు భిన్నంగా ఉంటాయి. అక్కడి బౌలర్లకు సహకరిస్తాయి. అదే క్రమంలో బ్యాటర్లకు కూడా ఉపకరిస్తాయి. ఇలాంటి పిచ్ పై ఓపెనర్ గా జైస్వాల్ రంగంలోకి దిగుతున్నాడు. అయితే ఇతడికి జోడిగా కేఎల్ రాహుల్ దిగే అవకాశం ఉంది.. ఇక సాయి సుదర్శన్ కు కనుక అవకాశం ఇస్తే అతడు వన్ డౌన్ లో దిగుతాడని తెలుస్తోంది. కీలకమైన నాలుగో స్థానంలో గిల్ ప్రవేశించే అవకాశం ఉంది.. గిల్ అనంతరం రిషబ్ పంత్, లాయర్ రంగంలోకి రావచ్చు
. గతంలో ఇంగ్లీష్ గడ్డ మీద గిల్ మూడు టెస్టులు ఆడాడు. దారుణమైన ప్రదర్శనతో కేవలం 88 పరుగులు మాత్రమే చేశాడు. ఇక లాస్ట్ టూర్లో రాహుల్ సెంచరీ చేశాడు.. పంత్ కూడా శతక విన్యాసాన్ని నమోదు చేశాడు..
బౌలింగ్ పరంగా..
భారత జట్టు బౌలింగ్ పరంగా పూర్తిగా బుమ్రా మీద ఆధారపడింది. ఎందుకంటే అతడికి ఇంగ్లీష్ గడ్డమీద మంచి రికార్డు ఉంది. పిచ్ ఎలా ఉన్నా సరే అతడు అనేక సందర్భాలలో వికెట్లు సాధించాడు.. గడిచిన టూర్లో భారత్ సిరీస్ మీద అంచనాలు పెంచుకుంది అంటే దానికి కారణం బుమ్రా అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బుమ్రా కు అండగా సిరాజ్, ప్రసిద్ద్ ఉండనే ఉన్నారు. ఇక స్పిన్నర్ కోటాలో రవీంద్ర జడేజా సిద్ధంగా ఉన్నాడు. ఒక ఆల్ రౌండర్ గనుక కావాలి అనుకుంటే నితీష్ కుమార్ రెడ్డి లేదా శార్దుల్ ఠాకూర్ కు చోటు లభించే అవకాశాలు ఉన్నాయి.
ఇంగ్లాండ్ జట్టు
ఇంగ్లాండ్ జట్టు లో బ్రాడ్, అండర్సన్ లేరు. ఇది ఒక రకంగా ఆ జట్టుకు ఇబ్బందే. పేస్ బౌలర్లు వోక్స్, కార్స్, టాంగ్, బషీర్ వంటివారు బౌలింగ్ గలాన్ని మోస్తున్నారు. అయితే వీరు భారత బ్యాటర్లను ఎంతవరకు నిలువరిస్తారనేది చూడాలి..జో రూట్ బ్యాటింగ్ విభాగంలో అత్యంత బలంగా కనిపిస్తున్నాడు. పోప్ కూడా భీకరమైన ఫామ్ లో ఉన్నాడు.. క్రాలే, డకెట్ ఓపెనర్లుగా రంగంలోకి దిగుతారు, స్మిత్, రూట్, బ్రూక్, స్టోక్స్ వంటి వారితో మిడిల్ ఆర్డర్ కూడా బలంగా ఉంది.. వోక్స్ కూడా ఇటీవల సెంచరీ చేశాడంటే ఆ జట్టు ఎంతటి భయంకరమైనదో అర్థం చేసుకోవచ్చు.
తుది జట్లు(అంచనా మాత్రమే)
భారత్: గిల్(కెప్టెన్), ప్రసిద్ద్, రాహుల్, సిరాజ్, జైస్వాల్, బుమ్రా, సాయి సుదర్శన్, శార్దుల్, పంత్, జడేజా, నాయర్.
ఇంగ్లాండ్: స్టోక్స్(కెప్టెన్), క్రాలే, బషీర్, డకెట్, జోష్ తొంగ్, పోప్, బ్రైడన్ కార్స్, జో రూట్, వోక్స్, బ్రూక్, స్మిత్.
Also Read: కోహ్లీ స్థానానికి గిల్ న్యాయం చేస్తాడా?