Dukes ball controversy: ఇప్పుడు డ్యూక్ బాల్స్ పై క్రికెట్ ప్రపంచంలో చర్చ జరుగుతోంది. ఈ బాల్స్ తయారు చేసే కంపెనీ అధినేత ఈ సందర్భంగా తెరమీదికి వచ్చారు. అసలు ఈ బాల్స్ గురించి ఎందుకు చర్చ అంటే..
ఇంగ్లాండ్ తో జరుగుతున్న మూడో టెస్టు రెండో రోజు బాల్ మార్పు చేసిన 10 ఓవర్లకే కొత్త బంతి షేప్ మారిపోయింది. మరో బంతి తీసుకోవాల్సి వచ్చింది. అయితే 10 ఓవర్లు ఆడిన బాల్స్ లో ఒకటి ఎంపిక చేసి ఇచ్చిన ఆ బాల్ పై కూడా ఇండియన్ కెప్టెన్ గిల్ తో పాట్ పేస్ బౌలర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పదేపదే ఆ బాల్ కూడా మార్చాలని అంపైర్స్ ను అడగడంతో చివరికి బాల్ మార్చేందుకు ఒప్పుకున్నారు. అయితే డ్యూక్ కంపెనీ కి చెందిన క్రికెట్ బాల్ విషయంలో ఎప్పుడూ ఈ విధంగా రాద్దాంతం చోటుచేసుకోలేదు. ఇంగ్లాండ్ లో టెస్ట్ మ్యాచులకు మన్నికైన డ్యూక్ బాల్స్ మాత్రమే ఎన్నో ఏళ్లుగా వాడుతారు. ఇంగ్లాండ్ వాతావరణం, పిచ్ స్వభావానికి అనుకూలంగా డ్యూక్ బాల్ స్వింగ్ అవుతూ బౌలర్లకు అనుకూలిస్తుంది. ఇండియా లో మాత్రం ఎస్జీ బాల్స్, మిగతా దేశాలలో ఆస్ట్రేలియాలో తయారయ్యే కోకబుర్ర బాల్స్ ఉపయోగిస్తారు. అయితే డ్యూక్ బాల్స్ పదేపదే మార్చాల్సి రావడం. ఆ బాల్స్ నాణ్యత విషయంలో వివాదానికి తెరలేపడంతో కంపెనీ అధినేత దిలీప్ జజోడియ మీడియా ముందుకు వచ్చి మాట్లాడడంతో మరింత ప్రచారం ఊపందుకుంది. ఈ విషయాన్ని పట్టుకొని పేపరజీలు బౌలర్లు, క్రికెట్ దిగ్గజాలను డ్యూక్ బాల్స్ పై ప్రశ్నలు అడగడం, వారి నుంచి ఏదైనా నెగెటివ్ వస్తే దాన్ని హైలైట్ చేసేపనిలో ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే ఈ డ్యూక్ బాల్స్ తయారు చేసే బ్రిటిష్ ట్రేడింగ్ కంపెనీ అధినేత భారతీయుడు కావడం అందుకు కారణంగా చెబుతున్నారు.
దీంతో ఆయన గురించి తెలుసుకోవాలని ఆసక్తి పెరిగింది. రాజస్థాన్ కు చెందిన దిలీప్ జజోడియ బిషప్ కాటన్ స్కూల్ బెంగుళూరు లో 50వ దశకంలో ప్రాథమిక విద్య నుంచి గ్రాడ్యుయేషన్ వరకు చదివారు. ఆ సమయంలో పూర్వ ఇండియన్ క్రికెటర్ బ్రిజేష్ పటేల్ ఆయనకు స్కూల్ క్రికెట్ ఫ్రెండ్. ఆ తరువాత 1962లో ఉన్నత విద్య కోసం లండన్ వెళ్ళిన ఆయన అక్కడే ఒక కంపెనీలో చార్టెడ్ ఇన్సూరెన్స్ ప్రాక్టిషనరగా, పెన్షన్ ఫండ్ మేనేజర్ గా పనిచేస్తూ వచ్చాడు. ఆ తరువాత ఇంగ్లాండ్ లో క్లబ్ క్రికెట్ ఆడిన అనుభవం ఉంది. గవాస్కర్ తో పాటు చాలా మంది క్రికెటర్లతో అనుబంధం ఉంది. క్రికెట్ పాషన్ కొన్ని సంవత్సరాల్లోనే 1987లో డ్యూక్ క్రికెట్ బాల్స్ తయారు చేసే కంపెనీని కొనుగోలు చేసేందుకు ప్రేరేపించింది. స్వతహాగా క్రికెటర్ కావడంతో బాల్ నాణ్యత విషయంలో ఆయన ఎక్కువ శ్రద్ధ చూపడం వల్ల ఆ కంపెనీ కి వృద్ధిలోకి వచ్చింది. ప్రస్తుతం సంవత్సరానికి లక్షకుపైగా క్రికెట్ బాల్స్ ప్రపంచ వ్యాపితంగా ఈ కంపెనీ బిజినెస్ చేస్తుంది. టెస్ట్ మ్యాచ్ క్వాలిటీ బాల్ ధర 100 పౌండ్స్ ఉంటుంది.
Also Read: ఐసీసీ 2026 టీ20 వరల్డ్ కప్ కు ఎంపికైన ఇటలీ, నెదర్లాండ్స్.. యూరప్ లోని అన్ని జట్లు ఔట్
అయితే కొన్నేళ్ల ముందు దిలీప్ జజోడియా ఇండియాలో డ్యూక్ బాల్స్ బిజినెస్ చేయాలని అనుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే అప్పటికే ఆ ప్రచారాన్ని ఆయన కొట్టివేశాడు. వికెట్ కీపర్ ప్యాడ్స్, బేస్ బాల్ కిట్స్ కూడా తయారు చేసే ఈ కంపెనీ ప్రస్తుత ఇండియాలో ఉన్న అనుకూల పరిస్థితుల్లో ప్రారంభించే అవకాశాలు ఉన్న నేపథ్యంలోనే ఈ బాల్స్ పై నెగెటివ్ ట్రోలింగ్ ఎక్కువ అవుతున్నట్లు కూడా భావిస్తున్నారు.