IND-W vs IRE-W 1st ODI : భారత మహిళల జాతీయ క్రికెట్ జట్టు, ఐర్లాండ్ మహిళల జాతీయ క్రికెట్ జట్టు మూడు వన్డేల సిరీస్ జనవరి 10న(శుక్రవారం) ప్రారంభం కానుంది. మూడు వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఈ సిరీస్‌లో విమెన్ ఇన్ బ్లూ ఐర్లాండ్ మహిళలతో తలపడుతుంది. ఇటీవలే భారత మహిళల జట్టు వెస్టిండీస్‌ను 3–0తో చిత్తు చేసింది. ఆ తర్వాత భారత జట్టు స్వదేశంలో ఐర్లాండ్‌తో తలపడుతుంది. వెస్టిండీస్‌పై ఊపునే కొనసాగించాలని చూస్తోంది. ఇదే సమయంలో ఇండియా మహిళల జట్టు, ఐర్లాండ్ మహిళల జట్లు తొల వన్డే లైవ్‌స్ట్రీమింగ్ ఆన్‌లైన్, భారత్‌లో ప్రత్యక్ష ప్రసారం వివరాలు ఇలా ఉన్నాయి.
స్మృతి మంధాన సారథ్యంలో..
భారత మహిళలు ఐర్లాండ్ మహిళల జట్టుపై తొలి వన్డేలో భారత జట్టుకు స్మృతి మంధాన నేతృత్వం వహించనున్నారు. రెగ్యులర్ కెప్టెన్ హర్మన్ ప్రీత్‌కౌర్‌కు ఈ సిరీస్‌లో విశ్రాంతి ఇవ్వడంతో స్మృతి సారథ్యం వహించనున్నారు. ఓపెనర్‌గానూ బరిలో దిగనున్నారు. భారత జట్టులో తన స్థానం సుస్థిరం చేసుకోవాలని చూస్తున్న యువ క్రికెటర్లకు ఇది మంచి అవకాశం. ఇక ఐర్లాండ్ మహిళలు బలమైన భారత్‌తో జరిగే మ్యాచ్‌లో రాణించాలన్న ఆసక్తి, ఉత్సాహంతో ఉన్నారు.
ప్రత్యక్ష ప్రసారాన్ని ఎక్కడ చూడాలి?
భారతదేశంలో జరిగే ఇండియా మహిళల జట్లు, ఐర్లాండ్ మహిళల జట్టు మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం వికాం అధికారిక ప్రసార హక్కులను కలిగి ఉంది. భారతదేశంలోని అభిమానులు స్పోర్ట్స్ 18 ఛానెల్‌లలో చూడవచ్చు. ఆన్‌లైన్‌లో వీక్షించే వారు వివిద సైట్లలో చూడొచ్చు.
ఫాంటసీ బృందం
వికెట్ కీపర్లు: రిచా ఘోష్
బ్యాటర్స్: స్మృతి మంధాన, జెమిమా రోడ్రిగ్స్, హర్లీన్ డియోల్, గాబీ లూయిస్, లేహ్ పాల్
ఆల్ రౌండర్లు: దీప్తి శర్మ. ఓర్లా ప్రెండర్‌గాస్ట్
బౌలర్లు: సైమా ఠాకోర్, టిటాస్ సాధు, ఐమీ మాగ్వైర్
స్క్వాడ్‌లు
టీమిండియా
స్మృతి మంధాన(కెప్టెన్), ప్రతికా రావల్, హర్లీన్ డియోల్, జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్(ఠీ), తేజల్ హసబ్నిస్, దీప్తి శర్మ, సైమా ఠాకోర్, మిన్ను మణి, టైటాస్ సాధు, ప్రియా మిశ్రా, తనూజా కన్వర్, ఉమా చెట్రీ, రాఘవి బిస్ట్, సయాలి సత్ఘారే
అంచనా వేసిన తుది జట్లు..
భారతదేశం: స్మృతి మంధాన, ప్రతికా రావల్, హర్లీన్ డియోల్, జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), దీప్తి శర్మ, మిన్ను మణి, సైమా ఠాకోర్, టైటాస్ సాధు, ప్రియా మిశ్రా, సయాలి సత్ఘారే/ తనూజా కన్వర్
ఐర్లాండ్: సారా ఫోర్బ్స్, గాబీ లూయిస్ (సి), ఓర్లా ప్రెండర్‌గాస్ట్, లియా పాల్, లారా డెలానీ, రెబెక్కా స్టోకెల్, అర్లీన్ కెల్లీ, క్రిస్టినా కౌల్టర్ రీల్లీ, అలానా డాల్జెల్, ఫ్రెయా సార్జెంట్, ఐమీ మాగైర్