https://oktelugu.com/

ఐపీఎల్ అభిమానులకు పెద్ద షాక్..

ఈల.. గోల.. లేని మ్యాచ్‌లో బంతి డీలా పడింది. ఇరు జట్ల బ్యాటింగ్‌ విధ్వంసం ముందు బౌలింగే మోకరిల్లింది. స్టేడియంలో ప్రేక్షకుల అరుపులు లేకున్నా.. సిక్సర్లు, ఫోర్లతో బ్యాటర్స్‌ మెరుపులు మెరిపించారు. ఫోర్ల వరద.. సిక్సర్ల హోరుతో ప్రత్యర్థి అందుకోలేని స్కోర్‌‌ లు ఐపీఎల్ నమోదవుతున్నాయి. కరోనా సమయంలో ఐపీఎల్-2020 క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. గెలుపు కోసం రెండు జట్లు నువ్వా.. నేనా అని పోరాడుతున్న తీరు క్రికెట్ ప్రియులకు ఆనందాన్ని పంచుతోంది. దుబాయ్ వేదికగా నిన్న […]

Written By:
  • NARESH
  • , Updated On : September 29, 2020 / 02:32 PM IST

    dream

    Follow us on

    ఈల.. గోల.. లేని మ్యాచ్‌లో బంతి డీలా పడింది. ఇరు జట్ల బ్యాటింగ్‌ విధ్వంసం ముందు బౌలింగే మోకరిల్లింది. స్టేడియంలో ప్రేక్షకుల అరుపులు లేకున్నా.. సిక్సర్లు, ఫోర్లతో బ్యాటర్స్‌ మెరుపులు మెరిపించారు. ఫోర్ల వరద.. సిక్సర్ల హోరుతో ప్రత్యర్థి అందుకోలేని స్కోర్‌‌ లు ఐపీఎల్ నమోదవుతున్నాయి. కరోనా సమయంలో ఐపీఎల్-2020 క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. గెలుపు కోసం రెండు జట్లు నువ్వా.. నేనా అని పోరాడుతున్న తీరు క్రికెట్ ప్రియులకు ఆనందాన్ని పంచుతోంది. దుబాయ్ వేదికగా నిన్న ముంబై ఇండియన్స్-బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఆద్యంతం క్రికెట్ ఫ్యాన్స్ ను ఉర్రితలూగించింది. తొలి నుంచి ఉత్కంఠత సాగిన మ్యాచ్ చివరికీ ‘టై’ అయి సూపర్ ఓవర్ కు దారితీసింది.

    Also Read: ఐపీఎల్ మ్యాచ్ అంటే ఇదీ: ఉత్కం‘టై’నా.. కోహ్లీ సేన మ్యాజిక్ ఇదీ!

    ప్రస్తుత ఐపిఎల్ సీజన్ ప్రారంభం కావడంతో డ్రీమ్ 11పై జోరుగా ఆడేస్తున్నారు. తెలంగాణ ఇప్పటికే ఈ యాప్స్ పై నిషేధం విధించగా.. తాజాగా ఎపి ప్రభుత్వం కూడా ఈ యాప్ పై నిషేధం విధించేదని మీడియాలో వార్తలు వచ్చాయి. అయినప్పటికీ, చాలా మంది ప్రజలు ఈ డ్రీమ్ 11 యాప్ లలో  ఇప్పటికే ఫాంటసీ క్రికెట్ ఆడటం ప్రారంభించారు. ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఆకస్మిక చర్య ఇప్పుడు  వారిని గందరగోళ పరిస్థితుల్లోకి నెట్టివేసింది. అయితే, తెలంగాణతో సహా కొన్ని దేశంలోని రాష్ట్రాల్లో ఈ యాప్ నిషేధించబడింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తాజాగా గేమింగ్ చట్టాలను మార్చిన సంగతి తెలిసిందే. ఈ చట్టాలలో మార్పు ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా డ్రీమ్ 11 యాప్ నిషేధించబడింది. ఈ ఉదయం అందరికీ ఇది భారీ షాక్‌గా పరిణమించింది. ఐపీఎల్ ఫ్యాన్స్ ను ఇది తీవ్రంగా నిరాశపరిచింది.

    నిజానికి ఐపీఎల్ స్పాన్సరర్ గా ఇప్పుడు డ్రీమ్ 11 ఉంది. ఇది భారతదేశంలోనే ప్రముఖ ఫాంటసీ స్పోర్ట్స్ ప్లాట్‌ఫామ్‌లలో ఒకటి. ఈ స్పోర్స్ యాప్ లో పందెం వేయడం ద్వారా చట్టబద్ధంగా నిజమైన నగదును గెలుచుకోవచ్చు. డ్రీమ్ 11 దేశం నలుమూలల నుండి భారీ సంఖ్య వినియోగదారులను కలిగి ఉంది. ప్రజలు ఈ డ్రీమ్ 11 యాప్ లో  క్రికెట్, ఫుట్‌బాల్, కబడ్డీ మరియు ఇతర క్రీడలను ఆడవచ్చు. డ్రీమ్ 11 మాదిరిగానే పేటిఎం గేమ్స్ ను కూడా ఆంధ్రప్రదేశ్ లో నిషేధించారు. ఈ  మేరకు ఆంధ్రప్రదేశ్‌లో నిషేధించబడిందని వినియోగదారులకు సందేశాన్ని పంపించారు. “రాష్ట్ర చట్టాల ప్రకారం వర్తించే విధంగా, నగదుపై ఫాంటసీ స్పోర్ట్స్ ఆడటం ఏపీలో నిషేధం. డ్రీమ్ 11 కూడా ఏపీలో నిషేధించబడింది. ఆంధ్రప్రదేశ్ చట్టాలలో మార్పు వల్ల డ్రీమ్ 11 లో చెల్లింపు పోటీలను ఆడకుండా వినియోగదారుల జాగ్రత్త పడాలని ప్రభుత్వం తెలిపింది.

    Also Read: ఐపీఎల్ లో సంచలనం: చేజింగ్ లో రికార్డ్ బద్దలు

    దీంతో ఐపీఎల్ స్పాన్సరర్ డ్రీమ్ 11కు తెలుగు రాష్ట్రాల్లో చుక్కెదురైంది. ఐపీఎల్ వేళ అందరూ ఆడుతున్న ఈ గేమింగ్ ఫ్లాట్ ఫామ్ తెలుగు రాష్ట్రాల్లో అందుబాటులో లేకుండా పోయింది. దీంతో ఐపీఎల్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో కూరుకుపోయారు.