Asia Cup 2022 India vs Pakistan: ఇండియా, పాక్ మ్యాచ్ గుంపులుగా చూస్తే అంతే.. రూ. 5 వేలు జరిమానా

Asia Cup 2022 India vs Pakistan: ప్రపంచమంతా ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ చూడాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఇరు జట్ల అభిమానులు ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్నారు. కొద్ది గంటల్లోనే దుబాయ్ వేదికగా జరిగే ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ కోసం ఇన్నాళ్లుగా వేచి చూస్తున్నారు. దీంతో ప్రేక్షకులు కళ్లు కాయలు కాసేలా వెయిట్ చేస్తున్నారు. తమ ఆటగాళ్ల ఆట విధానం చూడాలని అందరు వేయి కళ్లతో ఉన్నారు. ఈ నేపథ్యంలో దాయాది దేశాల మ్యాచ్ కు రెండు జట్ల […]

Written By: Srinivas, Updated On : August 28, 2022 6:25 pm
Follow us on

Asia Cup 2022 India vs Pakistan: ప్రపంచమంతా ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ చూడాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఇరు జట్ల అభిమానులు ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్నారు. కొద్ది గంటల్లోనే దుబాయ్ వేదికగా జరిగే ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ కోసం ఇన్నాళ్లుగా వేచి చూస్తున్నారు. దీంతో ప్రేక్షకులు కళ్లు కాయలు కాసేలా వెయిట్ చేస్తున్నారు. తమ ఆటగాళ్ల ఆట విధానం చూడాలని అందరు వేయి కళ్లతో ఉన్నారు. ఈ నేపథ్యంలో దాయాది దేశాల మ్యాచ్ కు రెండు జట్ల అభిమానులు ఎంతో ఆశతో ఉన్నారు. దీంతో ఈ మ్యాచ్ కు అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది.

Asia Cup 2022 India vs Pakistan

ప్రపంచం మొత్తం ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ చూడాలని భావిస్తుంటే జమ్ముకాశ్మీర్ లో మాత్రం పరిస్థితి మరోలా ఉంది. తానోటి తలిస్తే దైవమొకటి తలచిందన్నట్లుగా తాము మ్యాచ్ చూడాలని విద్యార్థులు అనుకుంటుంటే శ్రీనగర్ లోని నిట్ యాజమాన్యం కళాశాల విద్యార్థులకు అల్టిమేటం జారీ చేసింది. ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ చూస్తే రూ. 5 వేలు జరిమానా విధిస్తామని హుకుం జారీ చేసింది. దీంతో విద్యార్థులకు నిరాశే ఎదురవుతోంది. తమ ఆటగాళ్ల ప్రతాపం చూద్దామని అనుకున్న వారి ఆశలు తీరడం లేదు.

Also Read: Bandi Sanjay: బండి సంజయ్ ఎందుకు ఏడ్చాడు? కారణమేంటి?

ఇనిస్టిట్యూట్ లోని గదుల్లో నుంచి బయటకు వెళ్లి మ్యాచ్ చూసినా ఉపేక్షించేది లేదని చెబుతున్నారు. దీంతో ఒకవేళ దొంగచాటుగా చూసినా సంస్థ నుంచి బయటకు పంపించి తీరుతామని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. ఇలాంటి ఆదేశాలు ఇవ్వడంపై అక్కడి సంస్థ తీరుపై విమర్శలు వస్తున్నాయి. ఎంజాయ్ చేసే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని పలు విద్యార్థి సంఘాల నుంచి డిమాండ్లు వస్తున్నాయి. దీంతో క్రికెట్ మ్యాచ్ చూడటంపై నిషేధం విధించడం అవివేకమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Asia Cup 2022 India vs Pakistan

ఇంకా మ్యాచ్ పై సామాజిక మాధ్యమాల్లో సైతం ఎలాంటి పోస్టులు పెట్టొద్దని నిషేధాలు విధిస్తున్నారు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? నియంతృత్వంలో ఉన్నామా అర్థం కావడం లేదు. ఈ క్రమంలో శ్రీనగర్ లోని నిట్ తీరుపై ప్రత్యక్షంగా అనేక విధాలుగా ఆరోపణలు వస్తున్నాయి. జరిమానా విధిస్తామని ఆదేశాలు జారీ చేయడం చర్చనీయాంశంగా మారుతోంది. దీనిపై సహజంగా పెద్దఎత్తున ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. తమను మ్యాచ్ చూడనీయకుండా చేయడంలో ఆంతర్యమేమిటో అర్థం కావడం లేదని విద్యార్థులు వాపోతున్నారు.

Also Read:Krithi Shetty- Sudigali Sudheer: ఏకంగా కృతి శెట్టిపై కన్నేసిన సుడిగాలి సుధీర్… నీకు తగిన వాడ్ని నేనే అంటూ ఓపెన్ ప్రపోజల్

Tags