Homeక్రీడలుVirat Kohli : మరో వరల్డ్ కప్ ఆడే శక్తి విరాట్ కోహ్లీలో ఉందా?

Virat Kohli : మరో వరల్డ్ కప్ ఆడే శక్తి విరాట్ కోహ్లీలో ఉందా?

Virat Kohli : టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గతంలో ఎన్నడూ లేని విధంగా కొన్నాళ్ల నుంచి విమర్శలను ఎదుర్కొంటున్నాడు. ఒకటి, రెండు మ్యాచ్ ల్లో విఫలమైనా.. పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా ఎక్కువ కాలం క్రికెట్ ఆడే సామర్థ్యం కోహ్లీలో తగ్గుతోందంటూ వస్తున్న విమర్శలకు సమాధానం చెప్పేలా వెస్టిండీస్ లెజెండ్ క్రికెటర్ క్రిస్ గేల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఏడాది జరిగే వరల్డ్ కప్ కాకుండా నాలుగేళ్ల తర్వాత జరిగే మరో వరల్డ్ కప్ ఆడే సామర్థ్యం కూడా కోహ్లీలో ఉందంటూ గేల్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో ఆసక్తిని కలిగిస్తున్నాయి.

టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ అతి పెద్ద వయసులోనే అనేక రికార్డులను తన పేరిట నమోదు చేసుకున్నాడు. భారత జట్టు సారధిగాను తన సత్తాను నిరూపించుకున్నాడు. అయితే గత కొంతకాలం నుంచి ఫామ్ లేమితో బాధపడుతున్న కోహ్లీ అనేక విమర్శలను ఎదుర్కొన్నాడు. ఇప్పుడిప్పుడే ఫామ్ లోకి వస్తున్న కోహ్లీ.. తన బ్యాట్ ఝులిపిస్తున్నాడు. అయితే, ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీపై విమర్శలు చేసిన వారికి సరైన సమాధానం చెప్పేలా వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ క్రిస్ గేల్ కోహ్లీకి అండగా నిలిచాడు. కోహ్లీ గొప్ప క్రికెటర్ అంటూ కీర్తించాడు.
మరో వరల్డ్ కప్ ఆడే సామర్థ్యం కోహ్లీ లో ఉంది..
ఈ ఏడాది భారత్ లో జరిగే వన్డే వరల్డ్ కప్ కోహ్లీకి చివరిది అంటూ జరుగుతున్న ప్రచారంపై క్రిస్ గేల్ స్పందించాడు. కోహ్లీకి ఇదే చివరి వరల్డ్ కప్ అని తాను అనుకోవడం లేదని, మరో వరల్డ్ కప్ ఆడే శక్తి కోహ్లీలో ఉందంటూ స్పష్టం చేశాడు గేల్. అంటే 2027 వరకు క్రికెట్ ఆడే శక్తి, సామర్థ్యాలు కోహ్లీలో ఉన్నాయంటూ పరోక్షంగా గేల్ చెప్పాడు. స్వదేశంలో ఆడే టోర్నీలో భారత్ ఎప్పుడూ ఫేవరెట్ గానే ఉంటుందని, అదే సమయంలో ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంటుందని గేల్ స్పష్టం చేశాడు. ఈసారి పోటీ ఆసక్తికరంగా ఉంటుందని గేల్ వివరించాడు. ప్రస్తుతం గేల్ చేసిన వ్యాఖ్యలు కోహ్లీ అభిమానులను ఆనందాన్ని కలిగించాయి.
ఇది కోహ్లీ కెరియర్..
విరాట్ కోహ్లీ అండర్-19 వరల్డ్ కప్ విజయం తర్వాత భారత జట్టులోకి వచ్చాడు. 2008 ఆగస్టులో శ్రీలంకతో జరిగిన సిరీస్ ద్వారా వన్డే అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు 109 టెస్ట్ మ్యాచ్లు ఆడిన కోహ్లీ 48.79 సగటుతో 8479 పరుగులు చేశాడు. ఇందులో 28 సెంచరీలు, 28 అర్థ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోర్ 254 పరుగులు. అలాగే ఇప్పటివరకు 20074 వన్డే మ్యాచ్లు ఆడిన కోహ్లీ 57.32 సగటుతో 12,898 పరుగులు చేశాడు. ఇందులో అత్యధిక స్కోరు 183 పరుగులు కాగా, ఇందులో 46 సెంచరీలు, 65 అర్థ సెంచరీలు ఉన్నాయి. అలాగే టి20 కెరియర్ చూస్తే 115 మ్యాచులు ఆడిన కోహ్లీ 52.74 సగటు 4008 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 37 అర్థ సెంచరీలు ఉన్నాయి. ఇందులో అత్యధిక స్కోరు 122 పరుగులు. ఇకపోతే విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టి 15 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు.
Exit mobile version