Neeraj Chopra Wedding: నీరజ్ చోప్రా పారిస్ ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ కు కొంత దూరంలో నిలిచిపోయాడు. అతని కంటే ముందు షూటింగ్లో మనుబాకర్ (manubhakar) స్వర్ణాన్ని సాధించింది. అటు నీరజ్ కూడా మెడల్ సాధించడంతో.. వీరిద్దరూ పారిస్ వీధుల్లో సందడి చేశారు. ఇతరు ఏకాంతంగా చాలాసేపు మాట్లాడుకున్నారు. ఆ సమయంలో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని వార్తలు వచ్చాయి. అయితే వాటిని మను భాకర్ తండ్రి ఖండించాడు. వారిద్దరు స్నేహితులు మాత్రమేనని.. గేమ్ గురించి మాత్రమే మాట్లాడుకున్నారని స్పష్టం చేశారు. ఆ తర్వాత గజ్జల్లో గాయం కావడంతో శస్త్ర చికిత్స కోసం నీరజ్ లండన్ వెళ్లిపోయాడు. ఆ తర్వాత జరిగిన టోర్నీలో ప్రతిభ చాటి అదరగొట్టాడు. ప్రస్తుతం తన ఆటను మరింత మెరుగుపరచడానికి ప్రయత్నిస్తున్నాడు.. వచ్చే ఒలంపిక్స్ కోసం అతడు ఇప్పుడే సాధన చేస్తున్నాడు.. అయితే ఉన్నట్టుండి నీరజ్ పెళ్లి చేసుకోవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది.
చాలా కాలంగా ప్రేమలో..
నీరజ్ చోప్రా కొంతకాలంగా టెన్నిస్ క్రీడాకారిణి(tennis player) హిమానీ మోర్ (himani more) తో ప్రేమలో ఉన్నాడు. అయితే దానిని మరో స్థాయికి తీసుకెళ్లాలని నీరజ్, హిమాని భావించారు. ఇందులో భాగంగానే మూడు రోజుల క్రితం వివాహం చేస్తున్నారు. దానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇలా ఫోటోలు పోస్ట్ చేసి ఒక్కసారిగా అందర్నీ ఆశ్చర్యపరచాడు నీరజ్. ” నా జీవితంలో మరో అధ్యయనం మొదలైంది.. నాకు మీ అభినందనలు.. ఆశీస్సులు కొండంత బలాన్ని ఇస్తున్నాయి.. మీ అందరికీ ధన్యవాదాలని” నీరజ్ వ్యాఖ్యానించాడు.. ప్రస్తుతం నీరజ వయసు 27 సంవత్సరాలు.. అయితే నీరజ్ తను పెళ్లి చేసుకున్న విషయాన్ని అత్యంత గోప్యంగా ఉంచాడు. ఎక్కడ పెళ్లి చేసుకున్నది, ఎప్పుడు పెళ్లి చేసుకున్నది వంటి వివరాలను బయటకు చెప్పలేదు..” వివాహం అత్యంత నిరాడంబరంగా జరిగింది.. అతికొద్దిమంది అతిథులు మాత్రమే వచ్చారు. పెళ్లి నీరజ్, హిమానీ కుటుంబాల సంప్రదాయాల ప్రకారం జరిగింది.. పెళ్లి జరగడం.. కొత్త దంపతులు హనీమూన్ వెళ్లిపోవడం కూడా త్వర త్వరగా నే చోటు చేసుకున్నాయని” నీరజ్ మేనమామ పేర్కొన్నాడు.
హిమానీ నేపథ్యమిదే..
హిమానీ టెన్నిస్ క్రీడాకారిణి. ఈమెకు 25 సంవత్సరాలు. హర్యానా(Haryana)లోని సోని పట్(Sonipat) గ్రామం. ఢిల్లీలోని మిరిండా హౌస్ కాలేజీ నుంచి పొలిటికల్ సైన్స్, స్పోర్ట్స్ ఎడ్యుకేషన్లో డిగ్రీ చేసింది. ఆ తర్వాత అమెరికాలోని ఓ విశ్వవిద్యాలయంలో స్పోర్ట్స్ మేనేజ్మెంట్లో మాస్టర్స్ డిగ్రీ చేస్తోంది.. హిమాని ఇంటర్నేషనల్ టోర్నీలలో ఆడకపోయినప్పటికీ.. జాతీయస్థాయిలో మాత్రం అదరగొట్టింది.. 2018 లో నేషనల్స్ లెవెల్ లో జరిగిన పోటీలలో సింగిల్స్ లో 42, డబుల్స్లో 27 ర్యాంక్ సొంతం చేసుకుంది.