BCCI Auction Fund: వేలం ద్వారా వచ్చిన రూ.48,390 కోట్లు బీసీసీఐ ఏం చేస్తుందో తెలుసా?

BCCI Auction Fund: ఐపీఎల్ 2023-27 కోసం మీడియా హక్కుల కోసం బీసీసీఐకి భారీ మొత్తం సమకూరింది. దీంతో కాసుల పంట పండింది. ఈ మొత్తాన్ని ఎలా ఖర్చు పెట్టాలనేదానిపై బీసీసీఐ లెక్కలు వేసుకుంటోంది. ఇంత భారీ మొత్తంలో సమకూరిన ఆదాయాన్ని ఖర్చు చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తోంది. మీడియా హక్కుల ద్వారా బీసీసీఐకి రూ. 48,390 కోట్ల ఆదాయాన్ని పొందనుంది. దీంతో ఈ మొత్తాన్ని పంపిణీ చేసేందుకు బీసీసీఐ సిద్ధంగా ఉంది. ఐపీఎల్ కు ఇంత మొత్తం […]

Written By: Srinivas, Updated On : June 16, 2022 4:50 pm
Follow us on

BCCI Auction Fund: ఐపీఎల్ 2023-27 కోసం మీడియా హక్కుల కోసం బీసీసీఐకి భారీ మొత్తం సమకూరింది. దీంతో కాసుల పంట పండింది. ఈ మొత్తాన్ని ఎలా ఖర్చు పెట్టాలనేదానిపై బీసీసీఐ లెక్కలు వేసుకుంటోంది. ఇంత భారీ మొత్తంలో సమకూరిన ఆదాయాన్ని ఖర్చు చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తోంది. మీడియా హక్కుల ద్వారా బీసీసీఐకి రూ. 48,390 కోట్ల ఆదాయాన్ని పొందనుంది. దీంతో ఈ మొత్తాన్ని పంపిణీ చేసేందుకు బీసీసీఐ సిద్ధంగా ఉంది. ఐపీఎల్ కు ఇంత మొత్తం ఆదాయం సమకూరడంతో బీసీసీఐ ఏం చేయాలనే దానిపై తర్జనభర్జన పడుతోంది.

Sourav Ganguly

ఐపీఎల్ లో మరో రెండు జట్లు గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ రంగ ప్రవేశంతో ఆటల సంఖ్య పెరిగింది. ఆటలో జోష్ కూడా ఎక్కువైంది. దీంతో ప్రేక్షకులు కూడా పెరిగారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ వచ్చిన ఆదాయంతో ఖర్చు ఎలా చేయాలనేదానిపై మల్లగుళ్లాలు పడుతోంది. వచ్చిన డబ్బును పంపిణీ చేయాలని చూస్తోంది. ఇంత భారీ మొత్తంలో ఆదాయం రావడంతో బీసీసీఐ ఎలా ఖర్చు చేస్తుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. దేశంలో ప్రతిభావంతులైన యువ క్రికెటర్లకు సాయం చేసేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు బీసీసీఐ కార్యదర్శి జై షా ట్విటర్ ద్వారా ఈ విషయం తెలిపారు.

Also Read: Sudigali Sudheer Remuneration: కొత్త షోకు సుడిగాలి సుధీర్ తీసుకుంటున్న పారితోషికం ఎంతో తెలుసా?

సిబ్బంది, అధికారులు, వాటాదారులు, స్టేట్ అసోసియేషన్లు, ఫ్రాంచైజీలకు ఈ మొత్తం నుంచి కొంత కేటాయించనున్నట్లు తెలుస్తోంది. ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్, కోల్ కత నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్తాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ లకు సగం డబ్బు రూ.24,195 కోట్లు చెల్లించనుంది. ఎనిమిది ఫ్రాంచైజీలకు రూ. 3 వేల కోట్ల చొప్పున పంచేందుకు సిద్ధమైనట్లు చెబుతోంది. మిగిలిన సగం స్టేట్ అసోసియేషన్లకు అందజేయనుంది.

BCCI

ఇక రెండో సగంలో 26 శాతం రూ. .6290 దేశీయ, అంతర్జాతీయ క్రికెటర్లకు అందజేసేందుకు సిద్ధమవుతోంది. మిగిలిన దాంట్లో సిబ్బంది వేతనాలు చెల్లించేందుకు ప్రయత్నిస్తోంది. మిగిలిన 70 శాతం ప్రతిభావంతులైన క్రీడాకారుల కోసం ఖర్చు చేయనున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి బీసీసీఐ తనకు సమకూరిన ఆదాయంతో ఇంకా ఎన్నో పనులు చేసేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం. మొత్తానికి బీసీసీఐ తనకు వచ్చిన డబ్బుతో పలు పనులు చేయనుందని తెలుస్తోంది.

బీసీసీఐకి ఇంత భారీ మొత్తంలో ఆదాయం సమకూరడంతో ఎటూ తేల్చుకోలేకపోతోంది. వచ్చే ఐదేళ్లలో 410 మ్యాచులు ఐపీఎల్ లో ఆడనుంది. ఐపీఎల్ కు భారీ ఆదరణ పెరుగుతోంది. దీంతోనే దాని మీడియా హక్కుల కోసం అంత మొత్తంలో చెల్లించేందుకేు సంస్థలు ముందుకు వచ్చాయి. బీసీసీఐకి పైసల వర్షం కురుస్తోంది. ఇంత మొత్తంలో ఆదాయం రావడంతో అందరిలో హర్షం వ్యక్తమవుతోంది.

Also Read: RRR Closing Collection: ఆర్ ఆర్ ఆర్ వరల్డ్ వైడ్ క్లోజింగ్ కలెక్షన్స్..!

Tags