Homeఎంటర్టైన్మెంట్Ante Sundaraniki First Week Collections: అంటే సుందరానికి మొదటి వారం వసూళ్లు.. నాని కి...

Ante Sundaraniki First Week Collections: అంటే సుందరానికి మొదటి వారం వసూళ్లు.. నాని కి ఇది ఘోరమైన అవమానం

Ante Sundaraniki First Week Collections: న్యాచురల్ స్టార్ నాని హీరో గా నటించిన అంటే సుందరానికి మూవీ ఇటీవలే విడుదల అయ్యి సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి మన అందరికి తెలిసిందే..నాని నుండి ఛాయా కాలం తర్వాత వచ్చిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ కావడం తో ఈ సినిమా పై ఆయన అభిమానులు చాలా ఆశలే పెట్టుకున్నారు..అయితే కంటెంట్ పరంగా ఈ సినిమా ప్రేక్షకులను అలరించినప్పటికీ కలెక్షన్స్ పరంగా మొదటి రోజు నుండే నిరాశ పరుస్తూ వచ్చింది..సాధారణంగా మన టాలీవుడ్ లో రొమాంటిక్ కామెడీ ఎంటెర్టైనెర్స్ కి మంచి డిమాండ్ ఉంటుంది..ఈ జానర్ లో సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకున్న సినిమాలు అన్ని కూడా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతాలు సృష్టించాయి..అంటే సుందరానికి సినిమా కూడా అదే రేంజ్ లో ఆడుతుంది అని అందరూ అనుకున్నారు..టీజర్ మరియు ట్రైలర్ కూడా అదిరిపోవడం తో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అదిరిపోయింది..కానీ మొదటి వీకెండ్ మినహా ఈ సినిమాకి ఇప్పటి వరుకు బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ రేంజ్ వసూళ్లను నమోదు చేసుకుంటుంది..విడుదల అయ్యి వారం రోజులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇప్పటి వరుకు ఎంత వసూలు చేసిందో ఇప్పుడు మనం చూద్దాము.

Ante Sundaraniki First Week Collections
Ante Sundaraniki

Also Read: Union Minister Shobha Karandlaje: ఏపీ ఆదాయం విదేశాలకు తరలిపోతోందా? అసలేంటి కథ?

మొదటి రోజు కేవలం 3 కోట్ల 70 లక్షల రూపాయిల షేర్ ని మాత్రమే వసూలు చేసిన ఈ చిత్రం రెండవ రోజు మరియు మూడవ రోజు కూడా అదే స్థాయి వసూళ్లను రాబట్టింది..కానీ నాల్గవ రోజు నుండి ఈ సినిమాకి ప్రతి చోట కలెక్షన్లు అతి దారుణం గా పడిపోయాయి..ఒక్క బ్లాక్ బస్టర్ టాక్ వచ్చిన సినిమాకి ఈ స్థాయిలో దారుణమైన వసూళ్లు రావడం తెలుగు సినిమా హిస్టరీ లో ఇదే తొలిసారి..ఈ సినిమాని బయ్యర్లు అన్ని ప్రాతాలకు కలిపి దాదాపుగా 30 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసారు..ఇప్పుడు ఫుల్ రన్ లో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ పెర్ఫార్మన్స్ చూస్తూ ఉంటే 50 శాతం కి పైగా నష్టాలు వాటిల్లే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది..సినిమా బాగున్నా కూడా వసూళ్లు ఎందుకు ఆ స్థాయిలో రావడం లేదు అంటే కచ్చితంగా OTT ప్రభావం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

Ante Sundaraniki First Week Collections
Nani, Nazriya

ఇటీవల కాలం లో వరుసగా బ్లాక్ బస్టర్ సినిమాలు రావడం తో జనాలు డబ్బులను బాగా ఖర్చు చేసేశారని..ఎలాగో రెండు వారాలు పోతే OTT లో వస్తుంది కదా అప్పుడు చూసుకోవచ్చులే అనే అభిప్రాయం చాలా మందిలో ఏర్పడింది అని..అందుకే ఈ సినిమాకి ఆశించిన స్థాయి వసూళ్లు రావడం లేదు అని టాక్..అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా వసూళ్ల పరంగా డిజాస్టర్ గా నిలిచినప్పటికీ..USA లో మాత్రమే పర్వాలేదు అనే రేంజ్ వసూళ్లను రాబడుతుంది..దాదాపుగా ఇక్కడ 1 మిలియన్ డాలర్లు వసూలు చేసిన ఈ చిత్రం..ఫుల్ రన్ లో బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకుంటుంది అని అక్కడి ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి..ఇప్పటి వరుకు ప్రపంచవ్యాపటంగా ఈ సినిమాకి 16 కోట్ల రూపాయిలు షేర్ రాగా ఈ వీకెండ్ తో 17 నుండి 18 కోట్ల రూపాయిల షేర్ వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది..అంటే దాదాపుగా బయ్యర్లకు 12 కోట్ల రూపాయిల నష్టం వాటిల్లబోతుంది అన్నమాట.

Also Read: Mount Kailash: భూనాభి కైలాసగిరి.. అందుకే దాని అధిరోహం నిషేధం

Ante Sundaraniki Movie 1st Week Collections || Hero Nani || Nazriya || Vivek Athreya

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Exit mobile version