Cricketers: క్రికెట్.. క్రికెట్.. క్రికెట్.. ఇప్పుడు అంతా ఇదే నామం జపిస్తున్నారు. నాలుగేళ్లకోసారి నిర్వహించే వన్డే వరల్డ్ కప్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. ఈ టోర్నీలో టీమిండియా తన జైత్రయాత్రను కొనసాగిస్తుంది. ఇప్పటి వరకు ఆడిన అన్ని మ్యాచ్‌లలోనూ విజయం సాధించింది. ఈ టోర్నీలో టీమిండియా, న్యూజిల్యాండ్, సౌత్ ఆఫ్రికా జట్లు సెమీస్‌కు చేరడం దాదాపుగా ఖాయమైంది. టీమిడింయా న్యూజిల్యాండ్ మధ్య ఈనెల 22న మ్యాచ్ జరిగింది. దీని తర్వాత భారత జట్టుకు విరామం దొరికింది. తర్వాత ఇంగ్లండ్, సౌత్ ఆఫ్రికా, నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. అయితే విరామ సమయంలో క్రికెటర్లు ఏం చేస్తారన్న సందేహాలు చాలా మందికి ఉన్నాయి. మ్యాచ్‌కు, మ్యాచ్‌కు మధ్య ఖాళీ సమయంలో క్రికెటర్లు ఏం చేస్తారో చూద్దాం.
గ్యాప్ తప్పనిసరి..
వరల్డ్ కప్ సిరీస్ అనే కాదు.. టీమిండియా అని అంతకన్నా కాదు.. ప్రతీ జట్టుకు సిరీస్‌లో మ్యాచ్‌కు మ్యాచ్‌కు మధ్య గ్యాప్ ఉంటుంది. టెస్ట్ సిరీస్ అయినా వన్డే సిరీస్ అయినా.. టీ20 అయినా మ్యాచ్‌కు మ్యాచ్‌కు మధ్య గ్యాప్ తప్పనిసరి. అయితే కొన్ని మ్యాచ్‌ల మధ్య ఒక రోజు, కొన్ని మ్యాచ్‌ల మధ్య రెండు, మూడు రోజులు, కొన్ని మ్యాచ్‌ల మధ్య ఐదు రోజుల వరకు గ్యాప్ ఉంటుంది. సిరీస్ షెడ్యూల్‌ను బట్టి గ్యాప్ నిర్ణయించబడుతుంది. మరి ఈ గ్యాప్‌లో క్రికెటర్లు చేసే కొన్ని పనులు ఇప్పుడు తెలుసుకుందాం.
ఫిట్‌నెస్..
క్రికెటర్లకు ఫిట్‌నెస్ ఎంతో ముఖ్యం. వన్డే, టెస్ట్, టీ20 మ్యాచ్‌లు ఏవైనా ఫిట్‌గా ఉంటేనే మ్యాచ్‌లో రాణిస్తారు. బాడీ ఫిట్‌నెస్ లేకుంటే ఏ ఆటగాడైనా తుది జట్టులో స్థానం దొరకదు. అందుకే స్థానిక కోచ్, ఫిజియో సహాయంతో ఫిట్‌నెస్ కోసం సాధన చేస్తారు. డైట్ విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటారు.
బృందంతో బాండింగ్ సెషన్..
ఇక జట్టులో సభ్యుల మధ్య సమన్వయం కూడా ముఖ్యం. సమన్వయం లేకుంటే.. ఆటగాళ్ల మధ్య గ్యాప్ ఉంటే అది జట్టు ఓటమికి పరోక్షంగా కారణమవుతుంది. సృహృద్భావ వాతావరణం దెబ్బతింటుంది. ఈ నేపథ్యంలో విచామ సమయంలో కోచ్, ఫిజియో, వైద్యులు జట్టు సభ్యుల మధ్య సత్సంబంధాలు నెలకొనేలా చూస్తారు. గ్యాప్ పూచ్చే ప్రయత్నం చేస్తారు.
సైకాలజీ సెషన్స్..
ఇక టోర్నీలో శారీరక దృఢత్వం ఎంత ముఖ్యమో, మానసిక దృఢత్వం కూడా అంతే అవసరం. మానసికంగా ఆటగాళ్లు సిద్ధంగా లేనప్పుడు ఆ ప్రభావం ఆటపై కచ్చితంగా పడుతుంది. ఈ నేపథ్యంలో ఆటగాళ్లు మానసికంగా సంసిద్ధంగా ఉండేలా సైకాలజీ సెషన్స్ కూడా నిర్వహిస్తారు.
ఫ్యామిలీ టైం..
ఇక క్రికెట్ జట్లు టోర్నమెంట్‌లో ఉన్నప్పుడు ఫ్యామిలీకి నెలల దరబడి దూరమవుతారు. కొన్నిసార్లు ఫ్యామిలీని తీసుకెళ్లేందుకు అనుమతి ఉన్నా.. వారితో స్పెండ్ చేసే సమయం తక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో విరామ సమయంలో కుటుంబంతో మాట్లాడేందుకు మేనేజ్‌మెంట్ టైం ఇస్తుంది. కుటుంబంతో మాట్లాడడం ద్వారా ఆటగాళ్ల మానసిక స్థితి కూడా మెరుగు పడుతుందని, బెంగ ఉండదని భావిస్తారు.
వ్యూహాత్మక చర్చలు..
ఇక మ్యాచ్ విరామ సమయంలో.. వ్యూహాలపై చర్చ ఉంటుంది. ఇది జట్టుకు చాలా ముఖ్యం. ప్రత్యర్థి జట్టును దెబ్బకొట్టేందుకు వ్యూహాలు రూపొందిస్తారు. ఇందుకోసం ప్రత్యర్థిలోని బలమైన ఆటగాళ్ల బలహీనతలు గుర్తిస్తారు. ఏలా బౌలింగ్ చేయాలి, ఎవరి బౌలింగ్‌లో బ్యాట్స్‌మెన్స్ ఎక్కువ పరుగులు రాబాట్టాలి, పిచ్ పరిస్థితి ఎలా ఉంది. తదతర అంశాల ఆధారంగా వ్యూహరచన చేస్తారు.
సొంత బలాలు, బలహీనతల విశ్లేషణ
విరామ సమయంలో చేసే మరో ముఖ్యమైన పని సొంత బలాలు, బలహీనతలపై విశ్లేషణ. గత మ్యాచ్‌లో చేసిన పొరపాట్లు.. తర్వాతి మ్యాచ్‌లో చేయకూడని తప్పుల గుర్తించి వాటిని సరిచేసుకునే విషయమై కోచ్ సూచనలు చేస్తారు. బౌలింగ్, బ్యాటింగ్ విభాగంలో ఎలా ఉండాలో సూచిస్తారు. మ్యాచ్‌లో ఎక్కడా పొరపాటు జరుగకుండా చూసుకుంటారు.
ప్రత్యర్థుల బలాలు.. బలహీనతల విశ్లేషణ
ఇదే సమయంలో సొంత బలాలు, బలహీనతలతోపాటు, ప్రత్యర్థుల బలాలు, బలహీనతలను కూడా మ్యాచ్ విరామ సమయంలో విశ్లేషణ చేస్తారు. ఇందుకోసం పాత మ్యాచ్‌లకు సంబంధించిన వీడియోలు కూడా చూస్తారు. గతంలో ఔట్ చేసిన తీరు, బ్యాటింగ్, బౌలింగ్ తీరు తెలుసుకుని అంచనాకు వస్తారు.
విశ్రాంతి..
ఇక మరో ముఖ్యమైన అంశం విశ్రాంతి. ఆటగాళ్లకు సాధన ఎంత ముఖ్యమో విశ్రాంతి కూడా అంతే ముఖ్యం. ఖాళీగా ఉన్నప్పుడు ఫోన్లతో కాలక్షేపం చేయకుండా ఎక్కువగా విశ్రాంతి తీసుకునేలా చూస్తారు. శరీరానికి అవసరమైన విశ్రాంతి తప్పనిసరిగా ఉండేలా వైద్యులు చూస్తారు. సూచనలు చేస్తారు.
షాపింగ్..
ఇక కుటుంబంతో టోర్నీలకు వెళితే.. యాజమాన్యం అనుమతి మేరకు షాపింగ్, ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటారు. తాజాగా స్వదేశంలో జరుగుతున్న వరల్డ్ కప్‌లో ఫ్యామిలీతో టీమిండియా క్రికెటర్లు కాస్త సమయం గడుతుపున్నారు. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ధర్మశాలలోని చిన్మయ తపోవన ఆశ్రమాన్ని దర్శించాడు. న్యూజిల్యాండ్‌తో మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ ఈ ఆశ్రమానికి చేరుకున్నాడు. ఆటగాళ్లంతా ధర్మశాలలోని అనేక పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తున్నారు. విరాట్ కోహ్లీ కూడా ధర్మశాలలోని చిన్మయ తపోవన ఆశ్రమాన్ని సోమవారం సందర్శించాడు.