Venkatesh Daughter Engagement: ఈ మధ్య టాలీవుడ్ లో పెళ్లిళ్ల సందడి సురు అయింది. రీసెంట్ గానే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. వీరి పెళ్లి కూడా త్వరలోనే ఇటలీలో జరగబోతుంది. అంతే కాదు మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి తనయుడు హీరో శ్రీసింహ, టాలీవుడ్ స్టార్ యాక్టర్ మాంగటి మురళీ మోహన్ మనవరాలితో పెళ్లి జరగబోతుంది. ఇదిలా ఉంటే తాజాగా మరో జంట కూడా పెళ్లి పీటలెక్కబోతుంది. ఇప్పుడు ఈ జంట పెళ్లి గురించి ఓ వార్త నెట్టింట వైరల్ అవుతుంది. మరి ఆ జంట ఎవరు అనుకుంటున్నారా? అయితే ఇది మీకోసమే…
టాలీవుడ్ ఇండస్ట్రీలో పెళ్లికి సిద్ధమైన ఆ వధువు ఎవరో కాదు.. హీరో వెంకటేష్ కూతురు. అంటే దగ్గుబాటి వారి ఇంట పెళ్లి సందడికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నట్టు తెలుస్తోంది. అయితే వెంకటేష్ కి మొత్తం నలుగురు పిల్లలు.. వారిలో ముగ్గురు అమ్మాయిలు, ఒక అబ్బాయి వారిలో పెద్దమ్మాయికి ముందే పెళ్లి జరిగింది. ఇప్పుడు మరో అమ్మాయికి పెళ్లి చేసే సమయం ఆసన్నమైంది.
హీరో వెంకటేష్ రెండో కూతురు పెళ్లి అనగానే దగ్గుబాటి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వెంకి మామ తన రెండో కూతురుని అత్తారింటికి పంపడానికి సిద్దమయ్యాడా అంటూ కామెంట్లు చేస్తున్నారు. విజయవాడకి చెందిన ఒక డాక్టర్ ఫ్యామిలీలోని అబ్బాయికి తన కూతురిని ఇచ్చి పెళ్లి చేయబోతున్నాడట వెంకటేష్. ఎంగేజ్మెంట్ కూడా ఈ నెలలోనే జరగబోతున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయంలో నిజం ఏంటో తెలియదు కానీ..ఈ వార్త మాత్రం ఇప్పుడు టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది.