Sunrisers Hyderabad: సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ అంటే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రికెట్ అభిమానులందరికీ ఒక ఎమోషన్ గా మారిపోయింది. ఇక ప్రతి ఐపిఎల్ లో హైదరాబాద్ టీం కప్పు కొట్టాలని ప్రతి ఒక్కరు ఈగర్ గాఎదురు చూస్తున్నప్పటికీ ఆ టీం మాత్రం ఎప్పటికప్పుడు చతికలబడిపోతూ వస్తుంది. ఇక ఇలాంటి క్రమంలో దీనికి ఎంత మంది కెప్టెన్లు మారీనా కూడా ఆ టీం యొక్క పరిస్థితి మాత్రం మారడం లేదు.
ఇక ఈసారి ‘పాట్ కమ్మిన్స్’ సారథ్యంలో బరిలోకి దిగిన హైదరాబాద్ టీమ్ కప్పు కొట్టడమే లక్ష్యంగా దృఢ సంకల్పంతో ముందుకు కదులుతుంది. ఇక ఐపీఎల్ లో సన్ రైజర్స్ ప్రస్థానం 2013 వ సంవత్సరం నుంచి మొదలైంది. ఇక అందులో భాగంగానే 2016 వ సంవత్సరంలో డేవిడ్ వార్నర్ సారధ్యంలో బరిలోకి దిగిన హైదరాబాద్ టీం ఒకసారి కప్పును సాధించింది. ఇక ఇప్పటివరకు సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ 166 మ్యాచులు ఆడగా, అందులో 79 మ్యాచ్ ల్లో గెలవగా, 87 మ్యాచ్లో పరాజయం పాలైంది…
ఇక హైదరాబాద్ టీం కి కెప్టెన్ గా వ్యవహరించిన డేవిడ్ వార్నర్ 95 మ్యాచ్ ల్లో 4014 పరుగులు చేశాడు. ఈ టీమ్ తరుపున అత్యధిక స్కోర్ చేసిన ప్లేయర్ గా కూడా తను మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఈ టీం తరఫున ఇండియన్ బెస్ట్ బౌలర్లలో ఒకరైన భువనేశ్వర్ కుమార్ కూడా మొదటి నుంచి ఈ టీం కి తనదైన సేవలను అందిస్తూ వస్తున్నాడు. ఇక ఆయన ఈ టీమ్ తరఫున 129 మ్యాచులు ఆడితే, అందులో 145 వికెట్లను సాధించి ఇప్పటివరకు హైదరాబాద్ టీమ్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన ప్లేయర్ గా కూడా ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు…
ఇక 2017 వ సంవత్సరంలో కింగ్స్ ఎలేవన్ పంజాబ్ టీం మీద 19 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీశాడు. ఇక ఈ టీం తరఫున ఒక ఇన్నింగ్స్ లో అత్యుత్తమైన పర్ఫామెన్స్ ఇచ్చిన బౌలర్ గా కూడా భువనేశ్వర్ కుమార్ తన పేరుని చిరస్మరణీయంగా నిలిచిపోయేలా చేసుకున్నాడు…ఇక హైదరాబాద్ టీం పంజాబ్ కింగ్స్ మీద ఆడిన ఒక ఇన్నింగ్స్ లో అత్యధికంగా 231 పరుగులు సాధించింది. ఇక ఈసారి కూడా కప్పు కొట్టి రెండో సారి ఛాంపియన్స్ గా నిలవడానికి రెఢీ అవుతున్నారు…