Homeక్రీడలుక్రికెట్‌Mohammed Siraj net worth: వారెవ్వా మహ్మద్ సిరాజ్.. ఎన్ని కోట్లకు ఎదిగాడో తెలుసా?

Mohammed Siraj net worth: వారెవ్వా మహ్మద్ సిరాజ్.. ఎన్ని కోట్లకు ఎదిగాడో తెలుసా?

Mohammed Siraj net worth: కష్టే ఫలి అంటారు కదా.. ఇది టీమిండియా క్రికెటర్ మహ్మద్ సిరాజ్ కు అచ్చుగుద్దినట్టు సరిపోతుంది. ఒకప్పుడు ఆటోలో వెళ్లడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి అతడిది. అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ రంజీ నుంచి జాతీయస్థాయి దాకా తన ప్రస్థానాన్ని సాగించాడు. టీమిండియాలో కీలక మైన బౌలర్ గా ఆవిర్భవించాడు. టీ 20, టెస్ట్, వన్డే ఫార్మాట్ లలో తిరుగులేని స్థాయిలో నిలిచాడు.

ప్రస్తుత టీ20 వరల్డ్ కప్ లో హర్షిత్ రాణా స్థానంలో అతడు చోటు దక్కించుకున్నాడు. తుదిజట్టులో కూడా స్థానం సంపాదించాడు. అద్భుతమైన ప్రదర్శన చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. పేద కుటుంబం నుంచి వచ్చిన సిరాజ్.. క్రికెట్ లో గొప్పగా రాణించడానికి ఎన్నో కష్టాలు పడ్డాడు. ఉత్తమమైన బౌలర్ గా ఆవిర్భవించాడు.

సిరాజ్ భారత జట్టులో కీలకమైన బౌలర్ గా కొనసాగుతున్నాడు. అంతేకాదు, మ్యాచ్ ఫీజు, వాణిజ్య ప్రకటనలు, ఐపీఎల్ ద్వారా భారీగా వెనకేసుకున్నాడు. అందువల్లే ఖరీదైన ఆస్తులను పోగేసుకున్నాడు. సిరాజ్ వద్ద ప్రస్తుతం ఉన్న ఆస్తులను లెక్కిస్తే అవి కోట్లలో ఉంటాయని తెలుస్తోంది.

సిరాజ్ దగ్గర రోలెక్స్ కాస్మోగ్రాఫ్ డే టోనా అనే వాచ్ ఉంది. దీని ధర 3.21 కోట్లవరకు ఉంటుంది.

రేంజ్ రోవర్ కంపెనీకి చెందిన వోగ్ అనే మోడల్ కారు ఉంది. దీని ధర 3.36 కోట్లు.

మెర్సిడెజ్ బెంజ్ లో ఎస్ క్లాస్ కారు కూడా ఉంది. దీని ధర రూ.1.86 కోట్లు.

బీఎండబ్ల్యూ 5 సిరీస్ కారు ఉంది. దీని ధర 72.35 లక్షలు.

జూబ్లీహిల్స్ ప్రాంతంలోని 13 కోట్ల విలాసవంతమైన భవనం ఉంది.

జూబ్లీహిల్స్ ప్రాంతంలోనే 600 చదరపు గజాల విలువైన రెసిడెన్సియల్ ప్లాట్ కూడా సిరాజ్ కు ఉంది. ఇటీవల సిరాజ్ రెస్టారెంట్ వ్యాపారంలోకి అడుగు పెట్టాడు. అందులో రకరకాల రుచులను అందుబాటులోకి తీసుకొచ్చాడు.

 

View this post on Instagram

 

A post shared by Man’s World India (@mansworldindia)

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular