https://oktelugu.com/

Hotstar: క్రికెట్ అభిమానులకు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ గుడ్ న్యూస్

ఐపీఎల్ 17వ సీజన్ పూర్తయిన తర్వాత ఐసీసీ టి-20 మెన్స్ వరల్డ్ కప్ ప్రారంభమవుతుంది.. ఈ టోర్నీ కి అమెరికా- వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : March 7, 2024 / 12:22 PM IST
    Hotstar

    Hotstar

    Follow us on

    Hotstar: జియో సినిమా ఊహించని ఆఫర్లు ఇస్తోంది. ఫలితంగా దానికి సబ్ స్క్రైబర్లు పెరుగుతున్నారు.. అమెజాన్ ప్రైమ్ కొత్త కంటెంట్ తీసుకొస్తోంది. అది కూడా మార్కెట్లో సగం వరకు దున్నేస్తోంది. యాడ్స్ రూపంలో సగానికి మించిన ఆదాయం అదే దక్కించుకుంటున్నది. నెట్ ఫ్లిక్స్ కూడా ఓటీటీ మార్కెట్ లో ఎదిగేందుకు ప్రయత్నం చేస్తోంది.. ఇప్పటికే సౌత్ సినిమాలను భారీగా కొనుగోలు చేసింది. ఇలాంటి క్రమంలో ఈ విభాగంలో నిలబడాలంటే ఏదో ఒక అద్భుతం జరగాలి లేదా కీలక నిర్ణయం తీసుకోవాలి. అద్భుతం జరిగేందుకు అవకాశం లేదు కాబట్టి కీలక నిర్ణయమే శరణ్యం అనుకుంది. అందుకే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ మరోసారి క్రికెట్ అభిమానులకు శుభవార్త చెప్పింది. జియోతో జట్టు కట్టేందుకు ఇటీవల డీల్ కుదిరినప్పటికీ.. అది కార్య రూపం దాల్చడానికి చాలా సమయం పట్టేలా ఉంది. అలాంటప్పుడు ఉన్న కొద్ది రోజులైనా సొంతంగా ఆదాయాన్ని సమకూర్చుకోవాలని డిస్నీ భావిస్తోంది. అందువల్లే మరోసారి ఉచిత ఎత్తుగడకు తెరలేపింది.

    ఐపీఎల్ 17వ సీజన్ పూర్తయిన తర్వాత ఐసీసీ టి-20 మెన్స్ వరల్డ్ కప్ ప్రారంభమవుతుంది.. ఈ టోర్నీ కి అమెరికా- వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. జూన్ 1 నుంచి జూన్ 29 వరకు ఈ టోర్నీ సాగుతోంది. ఇందులో భాగంగా 55 టీ-20 మ్యాచ్ లు నిర్వహించనున్నారు. ఈ టోర్నీకి సంబంధించి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కీలక ప్రకటన చేసింది. తమ మొబైల్ యూజర్లకు టి20 వరల్డ్ కప్-2024 మ్యాచ్ లు మొత్తం ఉచితంగా చూసే అవకాశం కల్పిస్తామని ప్రకటించింది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఇప్పుడు మాత్రమే కాదు గతంలో కూడా ఉచితంగానే మ్యాచ్ లు చూసే అవకాశం కల్పించింది..

    ఆసియా వన్డే కప్-2023, వన్డే వరల్డ్ కప్-2023 మ్యాచ్ లు మొత్తం తన మొబైల్ యూజర్ల కోసం డిస్నీ ఉచితంగా చూసే అవకాశం కల్పించింది.. మొత్తానికి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఈ ఆఫర్ ప్రకటించడంతో మొబైల్ యూజర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక జూన్ 5న టి20 వరల్డ్ కప్ లో భాగంగా భారత్ ఐర్లాండ్ జట్టుతో తలపడుతుంది. భారత్- పాకిస్తాన్ మధ్య జూన్ 9న హై వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఇక ఐపీఎల్ టి20 మ్యాచ్లను ఉచితంగా ప్రసారం చేస్తామని మొబైల్ యూజర్లకు ఇప్పటికే జియో సినిమా ఆఫర్ ఇచ్చింది.