Digvesh Rathi : దిగ్వేశ్ చేసిన పని కలకలం రేపింది. దీంతో అతడి మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధిస్తూ ఐపీఎల్ నిర్వాహ కమిటీ నిర్ణయం తీసుకుంది. దిగ్వేశ్ రాటి పై సీనియర్ క్రికెటర్లు కూడా మండిపడ్డారు. సునీల్ గవాస్కర్ లాంటి ఆటగాడు అయితే..దిగ్వేశ్ రాటి నోట్ బుక్ సెలబ్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేద ని.. అది అతడి అతి ప్రవర్తనను చూపిస్తోందని వ్యాఖ్యానించాడు. మ్యాచ్ ఫీజులో 25% కోత విధించినప్పటికీ దిగ్వేశ్ రాటి ప్రవర్తనలో మార్పు రాలేదు. అయితే ముంబై జట్టుతో జరిగిన మ్యాచ్లో లక్నో తరఫున స్పిన్ బౌలింగ్ వేసిన దిగ్వేశ్ రాటి.. మరోసారి ఓవరాక్షన్ చేశాడు. అతడు నోట్ బుక్ సెలబ్రేషన్ ను రిపీట్ చేశాడు. దీంతో అతని ఫీజులో మరోసారి కోతపడుతుందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ” దిగ్వేశ్ రాటి మళ్లీ ఓవరాక్షన్ చేశాడు. మ్యాచ్ ఫీజులో ఇప్పటికే అతడు 25% కోతకు గురయ్యాడు. మళ్లీ ఇప్పుడు అదే స్థాయిలో అతి ప్రవర్తన చేశాడు. ఈసారి ఐపీఎల్ నిర్వాహక కమిటీ అతడి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలని” నెటిజన్లు పేర్కొంటున్నారు.. ముంబై జట్టుతో జరిగిన మ్యాచ్లో దూకుడుగా ఆడుతున్న నమన్ ధీర్(46) ను దిగ్వేశ్ రాటి క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో ముంబై జట్టు ఇన్నింగ్స్ కు ఒక్కసారిగా బ్రేక్ పడింది. విజయ ముంగిట ముంబై జట్టు బొక్క బోర్లా పడింది. 12 పరుగుల తేడాతో లక్నో జట్టు చేతిలో ఓడిపోయింది. నమన్ ధీర్ వికెట్ తీయడంతో దిగ్వేశ్ రాటి మరోసారి మైదానంలో నోటుబుక్ సెలబ్రేషన్ ను రిపీట్ చేశాడు.
Also Read : “సంతకం” స్టార్ కు దిమ్మతిరిగే షాక్.. జన్మలో ఆ పని చేయడు.
మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా
ముంబై జట్టుతో జరిగిన మ్యాచ్లో లక్నో బౌలర్ దిగ్వేశ్ రాటి నోటుబుక్ సెలబ్రేషన్ తో పాటు అద్భుతమైన ప్రతిభను చూపించాడు. నాలుగు ఓవర్ల పాటు బౌలింగ్ వేసిన అతడు 21 పరుగులు ఇచ్చాడు. కీలకమైన నమన్ ధీర్ వికెట్ కూడా పడగొట్టాడు. అతని వికెట్ తీయడంతో ముంబై జట్టు గెలుపు ముందు తడబడింది. అయితే కీలకమైన వికెట్ తీయడంతో
దిగ్వేశ్ రాటి కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. లక్నో జట్టులో మార్ష్, మార్క్రం దూకుడుగా ఆడినప్పటికీ.. మార్ష్ 60, మార్క్రం 53 పరుగులు చేసినప్పటికీ.. వారికి కాకుండా దిగ్వేశ్ రాటి కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ రావడం సంచలనం కలిగించింది. నోట్ బుక్ సెలబ్రేషన్ తో ఓవరాక్షన్ చేసిన అతడు.. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు పొందడంతో సోషల్ మీడియాలో సంచలనంగా మారాడు. ” ఒక వికెట్ తీసినా.. లక్నో జట్టుకు అది కొండంత బలం లాగా మారింది. అతడు ఆ క్రికెట్ తీయడం వల్లే లక్నో గెలిచింది. లేకపోతే నమన్ ధీర్ కనుక అవుట్ కాకపోయి ఉంటే మ్యాచ్ స్వరూప మరో విధంగా ఉండేది. మొత్తంగా చూస్తే అతనికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఇవ్వడం సముచితమని” సోషల్ మీడియాలో నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.
Also Read : దీన్నే గెలికి తన్నించుకోవడం అంటారు..పాపం LSG బౌలర్