Yuzvendra Chahal- Dhanashree
Yuzvendra Chahal : గత ఏడాది టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya Natasha divorce) తన భార్య నటాషా తో విడిపోతున్నట్టు ప్రకటించాడు..”ఇది బాధాకరమైన విషయం. చెప్పడానికి కాస్త ఇబ్బందిగానే ఉంది. కానీ తప్పడం లేదు. ఇకపై నటాషా, నేను వేరువేరు మార్గాలలో ప్రయాణించాలనుకుంటున్నాం. ఎంతో ఆలోచించి తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇకపై మేము కలిసి ప్రయాణించడం సాధ్యం కాదు. ఈ క్లిష్టమైన పరిస్థితిలో అభిమానులు మా గోప్యత కు భంగం కలిగించకుండా ఉంటారని అనుకుంటున్నాను. మా ఇద్దరికీ పుట్టిన అబ్బాయి విషయంలో మాత్రం తల్లిదండ్రులుగానే మేముంటాం. అతడికి అన్ని విధాలుగా అండగా ఉంటాం. అగస్త్యను ఒక ఉత్తమమైన పౌరుడిగా ఎదిగేందుకు మా వంతు ప్రయత్నిస్తాం. ఇది క్లిష్టమైన సమయం. ఇలాంటి సందర్భాల్లో మానసిక ప్రశాంతత అవసరమని” హార్దిక్ పాండ్యా అప్పట్లో సోషల్ మీడియాలో వ్యాఖ్యానించాడు. హార్దిక్ పాండ్యా – నటాషా విడాకుల తర్వాత.. వీరేంద్ర సెహ్వాగ్ తన భార్యకు విడాకులు ఇచ్చినట్టు ప్రచారం జరిగింది. అయితే సుదీర్ఘమైన వివాహ బంధాన్ని తెంచుకోవడానికి సిద్ధపడ్డాడు. అయితే వీరి విడాకుల వ్యవహారం గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది..
అన్ని కోట్లు ఇచ్చాడా?
హార్దిక్ పాండ్యా, వీరేంద్ర సెహ్వాగ్ వ్యవహారం తర్వాత.. ఇప్పుడు మీడియాలో ప్రధానంగా నానుతున్నది యజువేంద్ర చాహల్ – ధనశ్రీ టాపిక్. వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కరోనా సమయంలో ఒకటయ్యారు. ధనశ్రీ కొరియోగ్రాఫర్ గా, బాలీవుడ్ లో పేరొందిన సెలబ్రిటీగా కొనసాగుతోంది. వివాహానికంటే ముందు ధనశ్రీ – చాహల్ చాలా సంవత్సరాలు ప్రేమలో ఉన్నారు. ఆ తర్వాత తమ ప్రేమను మరో స్థాయికి తీసుకెళ్లడానికి పెళ్లి చేసుకున్నారు. అయితే మొదట్లో వీరి సంసారం సజావుగానే సాగింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ ఇద్దరు సోషల్ మీడియాలో ఒకరిని ఒకరు అన్ ఫాలో చేసుకున్నారు. ఆ తర్వాత వేర్వేరుగా ఉండడం మొదలుపెట్టారు. అయితే వీరిద్దరూ విడాకులు తీసుకున్నారని.. త్వరలోనే అధికారిక ప్రకటన చేస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే దీనిని ఇద్దరు కూడా ఖండించకపోవడం విశేషం. పైగా తమ వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించకుండా ఉండాలని విజ్ఞప్తి చేయడం గమనార్హం. అయితే ఇప్పుడు జాతీయ మీడియాలో ప్రసారమవుతున్న కథనాల ప్రకారం యజువేంద్ర చాహల్ తన భార్య ధనశ్రీకి విడాకులు ఇచ్చాడని.. భరణముగా 60 కోట్లు చెల్లించాలని తెలుస్తోంది. అయితే ఇవన్నీ పుకార్లు మాత్రమేనని.. అలాంటివి జరిగితే అధికారికంగా ప్రకటిస్తారు కదా అని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఈ పుకార్లకు చెక్ పడాలంటే యజువేంద్ర చాహల్ లేదా ధనశ్రీ స్పందించాల్సి ఉంది. వారిద్దరూ ఒక స్పష్టత ఇస్తేనే ఈ విడాకుల ఉత్కంఠకు తెరపడుతుంది.