https://oktelugu.com/

IPL Final 2023 GT Vs CSK: చెన్నై ఓటమి ముందే డిసైడ్‌ చేశారా.. ఏం జరిగింది?

స్క్రీన్‌పై కనిపించిన దృశ్యాన్ని ఫొటో తీసిన కొంతమంది సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. క్షణాల్లో ఇది వైరల్‌ అయింది. ధోని ఈసారి ఎలాగైనా టైటిల్‌ సాధిస్తాడని గంపెడాశలు పెట్టుకున్న సీఎస్‌కే అభిమానులు ఈ స్క్రీన్‌ ఫొటో చూసి షాక్‌ అయ్యారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : May 29, 2023 / 12:44 PM IST

    IPL Final 2023 GT Vs CSK

    Follow us on

    IPL Final 2023 GT Vs CSK: ఐపీఎల్‌లో చెన్నై ఓటమిని ముందే డిసైడ్‌ చేశారా.. నిర్వాహకులు పొరపాటు చేశారా.. మ్యాచ్‌ ఫిక్స్‌ అయిందా.. చెన్నై రన్నర్‌ అని ముందే ఎందుకు డిస్‌ప్లే చేశారు.. ఈ ప్రశ్నలు ఇప్పుడు క్రికెట్‌ ఫ్యాన్స్‌ను షేక్‌ చేస్తున్నాయి. దీనికి సబంధించిన ఓ వీడియో నెట్టింట్లో వైరల్‌ అవుతోంది. అసలు ఏం జరిగింది.. గుజరాత్‌–చెన్నై జట్ల మధ్య ఆదివారం(మే 28) జరగాల్సిన ఐపీఎల్‌–2023 ఫైనల్‌ మ్యాచ్‌ వర్షం కారణంగా రిజర్వ్‌ డే(సోమవారం)కు వాయిదా వేశారు. అయితే మ్యాచ్‌ ప్రారంభానికి కొద్ది నిమిషాల ముందు స్టేడియంలోని జెయింట్‌ స్క్రీన్‌పై ‘చెన్నై సూపర్‌ కింగ్స్‌ రన్నరప్‌‘ అని కొద్ది సెకెన్లు డిస్‌ప్లే అయింది. ఈ దృశ్యం ఇప్పుడు చర్చకు కారణమైంది.

    సీఎస్‌కే అభిమానుల ఆగ్రహం..
    స్క్రీన్‌పై కనిపించిన దృశ్యాన్ని ఫొటో తీసిన కొంతమంది సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. క్షణాల్లో ఇది వైరల్‌ అయింది. ధోని ఈసారి ఎలాగైనా టైటిల్‌ సాధిస్తాడని గంపెడాశలు పెట్టుకున్న సీఎస్‌కే అభిమానులు ఈ స్క్రీన్‌ ఫొటో చూసి షాక్‌ అయ్యారు. నిర్వాహకుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మ్యాచ్‌ జరగకుండానే తమను రన్నరప్‌గా ఎలా డిసైడ్‌ చేస్తారని మండిపడ్డారు. మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఏమైనా జరిగిందా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

    టెస్టింగ్‌ చేస్తుండగా.. అని వివరణ..
    ఇది తాము నిర్ణయించలేదుని స్క్రీన్‌ టెస్టింగ్‌లో భాగంగా ఇలా జరిగినట్లు నిర్వహకులు ప్రకటించారు. దీంతో ఈ వివాదం సద్దుమణిగింది. ఏదైనా ఫైనల్‌ మ్యాచ్‌కు ముందు ఇరు జట్లకు సంబంధించి విన్నర్, రన్నరప్‌ డిక్లేరేషన్‌ను చెక్‌ చేసి చూసుకోవడం సంబంధిత విభాగం వారి విధుల్లో భాగంగా జరుగుతుందని నిర్వహకులు వివరణ ఇచ్చారు. రన్నరప్‌ సీఎస్‌కే అనే కాకుండా, సీఎస్‌కే విన్నర్‌ అనే డిక్లేరేషన్ ను కూడా చెక్‌ చేశారని పేర్కొన్నారు. అలాగే గుజరాత్‌కు కూడా విన్నర్, రన్నరప్‌ డిక్లేరేషన్‌ను చెక్‌ చేశారని తెలిపారు. ఇది కేవలం స్క్రీన్‌ టెస్టింగ్‌లో భాగంగా జరిగిందేనని క్లారిటీ ఇచ్చారు. అయినా కొంతమందిలో అనుమానాలు కొనసాగుతున్నాయి. రిజర్వ్‌డే మ్యాచ్‌లో చెన్నై ఓడిపోతే.. అనుమానాస్పద ఘటనలు ఏమైనా జరిగితే.. మ్యాచ్‌ ఫిక్స్‌ అయిందని డిసైడ్‌ కావడం ఖాయం.