Gautam Gambhir : బ్యాటింగ్ కోచ్ లు లేనట్టు.. బౌలింగ్ కోచ్ లు ఇండియాలో లేనట్టు.. పడిక్కల్ ను ఆస్ట్రేలియా తీసుకెళ్లడం నిజంగా కామెడీ.. అజింక్యా రహానే, చటేశ్వర్ పూజార మిడిల్ ఆర్డర్లో లేకుండా ఆస్ట్రేలియా సిరీస్ ఆడటం నిజంగా గౌతమ్ గంభీర్ పిచ్చికి పరాకాష్ట.. అసలు జట్టులో రొటేషన్ విధానాన్ని అనుసరించినప్పుడు.. బౌలింగ్ కు అనుకూలించే మైదానం మీద ఇద్దరు స్పిన్ ఆల్ రౌండర్లు ఎందుకో గౌతమ్ గంభీర్ కే తెలియాలి. గౌతమ్ గంభీర్ చెప్పినట్టు డూడూ బసవన్నలాగా తల ఊపే బీసీసీఐ మేనేజ్మెంట్ కే తెలియాలి.. పోనీ వాళ్లతో బౌలింగ్ చేయించలేదు.. వారిని సమర్థవంతంగా ఉపయోగించుకోలేదు.. అనిల్ కుంబ్లే, రవి శాస్త్రి, రాహుల్ ద్రావిడ్ టీం కాన్ఫిడెన్స్ బిల్డ్ చేస్తే.. దానిని మొత్తం గౌతమ్ గాంధీ చంపేశాడు.. వాస్తవానికి రాజకీయాలలో నియంతలు ఉంటారు.. అందులో తప్పు కూడా లేదు.. కానీ క్రీడల్లో నియంతలు ఉండడమే ఆధునిక విధి వైచిత్రి. ముఖ్యంగా అది భారత క్రికెట్ జట్టులో ఉండటం మరింత దారుణం. బౌన్సీ మైదానాలపై పేస్ బౌలర్లు వికెట్లు తీయగలుగుతారు. బుమ్రా దానిని పదేపదే నిరూపించాడు. అతడి తర్వాత ఆ స్థాయిలో మిగతా బౌలర్లతో ఎందుకు బౌలింగ్ చేయించలేదు? ఒక్కసారైనా గౌతమ్ గంభీర్ ఈ విషయం గురించి ఆలోచించాడు.. ఆఫ్ స్టంప్ బయట వేసే బంతులను వేటాడకూడదని క్రికెటర్లకు చెప్పాడా? అది వారి వైఫల్యం అయినప్పటికీ.. కోచ్ గా వచ్చిన తర్వాత గౌతమ్ గంభీర్ ఏం చేస్తున్నట్టు.. ఆ వీక్నెస్ వల్ల మన క్రికెటర్లు వికెట్లు పోగొట్టుకున్నప్పుడు.. ఆ నెదర్లాండ్ ఆటగాడు ఏం చేస్తున్నట్టు.. ఇన్ని వైఫల్యల తర్వాత టీమిండియా మరోసారి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ దక్కించుకుంటుందంటే.. అది ఎడారిలో బావిని తవ్వినట్టే ఉంటుంది.. ఇప్పటికైనా మించిపోయింది ఏదీ లేదు గౌతమ్ గంభీర్.. నీ దిక్కుమాలిన చాదస్తాన్ని జట్టు మీద రుద్దింది చాలు.. గౌరవంగా రాజీనామా చెయ్. నావల్ల కాదు అంటూ వెళ్లిపో.. వచ్చే ఇంగ్లాండ్ సిరీస్ కు నువ్వు కోచ్ గా ఉండకు.. నీకు అంతగా ఉండాలి అనిపిస్తే ఐపీఎల్ వెళ్ళిపో. పోయి ఐపీఎల్ లో కోల్ కతా జట్టును నీ స్థాయి రాజకీయాలు చేసి మరోసారి ఛాంపియన్ గా నిలుపు.
ఎందుకు తల దూర్చినట్టు
గత రెండు సీజన్లో టీమిండియా పెద్దగా అంచనాలు లేకుండానే ఆస్ట్రేలియా వెళ్లిపోయింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో వరుసగా విజయాలు సాధించింది. ఆస్ట్రేలియా పొగరును నేలకు దించింది. కానీ అలాంటి జట్టు ఇప్పుడు తేలిపోయింది. పెర్త్ టెస్టులో గెలిచిన ఇండియా.. ఆ తర్వాత తలవంచింది.. ఆస్ట్రేలియా చేతిలో వరుస ఓటములు ఎదుర్కొంది. న్యూజిలాండ్ సిరీస్ తో వైట్ వాష్ కు గురైన టీమ్ ఇండియా.. గంభీర్ కోచ్ సారథ్యంలో విఫలమైంది.. పెర్త్ తర్వాత ఆ స్థాయిలో ప్రదర్శన చూపించలేకపోయింది. మొత్తంగా చూస్తే 2025 ఏడాదిని ఓటమితో మొదలుపెట్టింది. ఈ వైఫల్యంలో ఆటగాళ్ల పాత్ర లేదు అనడానికి లేదు.. కాకపోతే ఇందులో గౌతమ్ గంభీర్ పాత్రనే ఎక్కువగా ఉంటుంది. దానిని అతడు మార్చుకోకపోతే.. సరిదిద్దుకోకపోతే టీమిండియా భవిష్యత్తు కాలంలో మరిన్ని సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది.