India Vs England: సిక్స్ ఇలా కూడా కొడతారా.. వైరల్ వీడియో

రెండవ రోజు బ్యాటింగ్ లో స్వల్ప వ్యవధిలోనే జడేజా, కుల దీప్ యాదవ్ వెంట వెంటనే అవుట్ కావడంతో భారత్ తీవ్ర ఇబ్బంది పడింది. ఈ క్రమంలో రవిచంద్రన్ అశ్విన్, దృవ్ క్రీజులోకి వచ్చారు.

Written By: Suresh, Updated On : February 16, 2024 5:09 pm

India Vs England

Follow us on

India Vs England: రాజ్ కోట్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో భారత్ 445 పరుగులకు ఆల్ అవుట్ అయింది. రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా సెంచరీలతో కదంతో చెప్పారు. యశస్వి జైస్వాల్, గిల్, రజత్ పాటిదార్, కుల దీప్ యాదవ్ నిరాశపరిచారు. సర్ఫ రాజ్, ధృవ్ జూరేల్, రవిచంద్రన్ అశ్విన్, జస్ ప్రీత్ బుమ్రా కీలక ఇన్నింగ్స్ ఆడారు. రవిచంద్రన్ అశ్విన్ చేసిన తప్పిదం వల్ల ఎంపైర్ భారత్ పై ఫెనాల్టీ విధించారు. దీంతో ఇంగ్లాండ్ జట్టుకు అదనంగా 5 పరుగులు లభించాయి.

అయితే రెండవ రోజు బ్యాటింగ్ లో స్వల్ప వ్యవధిలోనే జడేజా, కుల దీప్ యాదవ్ వెంట వెంటనే అవుట్ కావడంతో భారత్ తీవ్ర ఇబ్బంది పడింది. ఈ క్రమంలో రవిచంద్రన్ అశ్విన్, దృవ్ క్రీజులోకి వచ్చారు. ఇంగ్లాండ్ బోధనలపై ఎదురు దాడికి దిగారు. ఎనిమిదో వికెట్ కు వీరిద్దరూ 77 పరుగులు జోడించారు. ముఖ్యంగా రవిచంద్రన్ అశ్విన్ 37 పరుగులు, ధృవ్ 46 పరుగులు చేశారు. ఆప్ సెంచరీ సాధిస్తాడు అనుకుంటున్న క్రమంలో ధృవ్ రెహాన్ అమ్మద్ బౌలింగ్ లో ఫోక్స్ కు క్యాచ్ ఇచ్చి ఆటయ్యాడు. ఐతే క్రీజు లో ఉన్నంత సేపు ధృవ్ మెరిపించాడు. తొలి టెస్ట్ ఆడిన ధృవ్ ఇంగ్లాండ్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. వారికి కొరకరాని కొయ్యగా మారాడు.

ధృవ్ ను బోల్తా కొట్టించేందుకు ఇంగ్లాండ్ కెప్టెన్ మార్క్ వుడ్ ను రంగంలోకి దింపాడు. ఇంగ్లాండ్ కెప్టెన్ ఆదేశాల మేరకు మార్క్ వుడ్ ఆఫ్ స్టంప్ దిశగా బౌన్సర్ విసిరాడు. అయితే ధృవ్ దానిని అత్యంత సమయస్ఫూర్తితో ఆడాడు. స్లిప్స్ మీదుగా అప్పర్ కట్ షాట్ ఆడి సిక్సర్ గా మలిచాడు. ఆరంగేట్ర ఆటగాడి నుంచి ఇటువంటి షాట్ ఊహించని మార్క్ వుడ్ ఒక్కసారిగా బిత్తర పోయాడు. ప్రస్తుతం ఈ షాట్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ సర్కులేట్ అవుతోంది. దీనిని చూసిన నెటిజెన్లు.. ” ఏంటి.. సిక్స్ ఇలా కూడా కొడతారా” అంటూ కామెంట్లు చేస్తున్నారు.