https://oktelugu.com/

MS Dhoni : ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కాలేదు.. ధోనీ సాధించాడు!

ఐపీఎల్‌ చరిత్రలో 250 మ్యాచ్‌లు ఆడిన ఏకైక ఆటగాడిగా ధోని రికార్డులకెక్కాడు. ఐపీఎల్‌-2023లో భాగంగా గుజరాత్‌ టైటాన్స్‌తో జరగుతున్న ఫైనల్‌ మ్యాచ్‌ ఆడేందుకు బరిలోకి దిగిన ధోని.. ఈ ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు.

Written By:
  • NARESH
  • , Updated On : May 30, 2023 / 11:18 AM IST

    MS Dhoni IPL 2023

    Follow us on

    MS Dhoni : ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్‌ చరిత్రలో 250 మ్యాచ్‌లు ఆడిన ఏకైక ఆటగాడిగా ధోని రికార్డులకెక్కాడు. ఐపీఎల్‌-2023లో భాగంగా గుజరాత్‌ టైటాన్స్‌తో జరగుతున్న ఫైనల్‌ మ్యాచ్‌ ఆడేందుకు బరిలోకి దిగిన ధోని.. ఈ ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు.

    తర్వాతి పది స్థానాల్లో..
    ఐపీఎల్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్ల జాబితాలో ధోని తర్వాత ముంబై కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (243), ఆర్సీబీ వికెట్‌కీపర్‌ దినేశ్‌ కార్తీక్‌(242), ఆర్సీబీ విరాట్‌ కోహ్లి(237), సీఎస్‌కే రవీంద్ర జడేజా(225), పంజాబ్‌ సారధి శిఖర్‌ ధవన్‌(217), సీఎస్‌కే మాజీ ప్లేయర్లు సురేశ్‌ రైనా(205), రాబిన్‌ ఉతప్ప(205), అంబటి రాయుడు (203), రాజస్థాన్ ఆల్‌రౌండర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌(197) వరుసగా 2 నుంచి 10 స్థానాల్లో ఉన్నారు.

    చివరి మ్యాచ్‌ ఇదేనా..
    ధోని.. తన అంతర్జాతీయ కెరీర్‌లోని చివరి మ్యాచ్‌ను రిజర్వ్‌ డే రోజునే ఆడాడు. 2019 వన్డే వరల్డ్‌కప్‌ సెమీఫైనల్లో షెడ్యూల్‌ ప్రకారం న్యూజిలాండ్‌తో జరగాల్సిన మ్యాచ్‌ వర్షం కారణంగా రిజర్వ్‌ డేకు(జులై 10) వాయిదా పడింది. ఆ మ్యాచ్‌లో టీమిండియా ఓడింది. ఏడాది అనంతరం 2020, ఆగస్టు 15వ తేదీన ధోని అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుతున్నట్లు ప్రకటించాడు.

    తాజా సంకేతం అదేనా..
    తాజాగా ఐపీఎల్‌ 2023 ఫైనల్‌ మ్యాచ్‌ కూడా వర్షం కారణంగా రిజర్వ్‌ డేకు వాయిదా పడింది. దీంతో ధోని అంతర్జాతీయ క్రికెట్‌లో ఆడిన చివరి మ్యాచ్‌ను, ఐపీఎల్‌ 2023 ఫైనల్‌ మ్యాచ్‌ను కంపేర్‌ చేసుకుంటూ తెగ ఫీలైపోతున్నారు. గణాంకాల ప్రకారం కూడా ధోనీ రిటైర్మెంట్‌కు కారణం చెబుతున్నారు. ధోనికి అంతర్జాతీయ క్రికెట్‌లో చివరి మ్యాచ్‌(వన్డే) 350వదని, ఐపీఎల్‌–2023 ఫైనల్‌ మ్యాచ్‌ అతనికి 250వదని పేర్కొంటున్నారు. ఈ లెక్కలతో కూడా ధోని రిటైర్మెంట్‌ను నిర్ధారిస్తున్నారు.