
సమకాలీన ప్రపంచ క్రికెట్ లో అత్యుత్తమ కెప్టెన్ ఎవరని అడిగితే అందరూ ఠక్కున ‘మహేంద్ర సింగ్ ధోని’ అని చెబుతారు. అతడి హయాంలోనే భారత్ వన్డే, టీ20 , చాంపియన్స్ , టెస్ట్ చాంపియన్ షిప్ ఇలా అన్ని ట్రోఫీలను అందించిన ఏకైక విజయవంతమైన భారత కెప్టెన్ గా ఎంఎస్ ధోని పేరిట రికార్డు ఉంది. ఆ రికార్డును ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా ఏ కెప్టెన్ కూడా సాధించలేదు.
ఇక ప్రపంచంలోనే క్రికెట్ ను చదివేసిన వ్యూహాత్మక బుర్ర ఎంఎస్ ధోనిది అని విశ్లేషకులు చెబుతున్నారు. సోమవారం రాజస్థాన్ తో జరిగిన చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ లో ఓడిపోవాల్సిన చెన్నైని తన క్రికెట్ బుర్రతో గెలిపించాడు ధోని.
రాజస్థాన్ బ్యాట్స్ మెన్ జోస్ బట్లర్ 49, శివం దుబే 17 పరుగులతో ఆడుతున్న సమయంలో టీంను గెలిపించేలా కనిపించారు. బట్లర్ సిక్స్ కొట్టిన బంతి స్టేడియం అవతల పడడంతో కొత్త బంతిని తీసుకున్నారు.
అయితే పాతబడిన బంతి స్పిన్నర్లకు సహకరించదు. కొత్తది కావడంతో ధోని వెంటనే రవీంద్ర జడేజాను దించాడు. జడేజా బౌలింగ్ లో అన్నట్టుగా జోబట్లర్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత ఫీల్డర్లను సరైన ప్లేసులో పెట్టి దూబేను ఔట్ చేయించాడు. ఆ తర్వాత స్పిన్నర్ మెయిన్ అలీని దించి ఒకే ఓవర్ లో రెండు వికెట్లు తీయించాడు.
ఇదే నిన్న రాజస్థాన్ ను ఓడించి చెన్నైని గెలిపించింది. ధోని క్రికెట్ పరిజ్ఞానం అద్భుతమని.. అతడి ఫీల్డ్, బౌలింగ్ సెట్టింగ్ వల్లే చెన్నై గెలిచిందని ప్రముఖ దిగ్గజ క్రికెటర్ గవాస్కర్ ప్రశంసించడం విశేషం. ధోని కెప్టెన్సీ వల్లే చెన్నై గెలిచిందని ప్రశంసలు కురిపించారు మాజీ ఆటగాళ్లు. ఇలా ధోని తెలివితేటలు మరోసారి నిన్నటి మ్యాచ్ లో నిరూపితమయ్యాయి.