Rishabh Pant- DRS: రిషబ్ పంత్ స్వయంకృతాపరాధం ఢిల్లీ పాలిట శాపంగా మారింది. ఢిల్లీని ముందుకు నడిపించిన కెప్టెన్ రిషబ్ పంత్ వల్లే చివరి మెట్టుపై ఆ జట్టు బోల్తాపడింది. ప్లే ఆఫ్ ఆశలు దూరం చేసుకుంది. తప్పుడు నిర్ణయాలు ఆ జట్టును కీలకమైన సమయంలో ఓటమిపాలు చేశాయి. చేసిన తప్పు తెలుసుకోకుండా ఇతరులపై నెట్టే ప్రయత్నం చేసిన కెప్టెన్ పంత్ పై ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఐపీఎల్ లీగ్ చివరి దశలో గెలిస్తే ప్లే ఆఫ్ చేరే ఢిల్లీ క్యాపిటల్స్ చేజేతులారా ముంబై చేతిలో ఓడి ఇంటిదారి పట్టింది. అస్సలు ఆశలు లేని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీంను ఢిల్లీయే ప్లే ఆఫ్స్ కు చేర్చినట్టైంది. ముంబై ఇండియన్స్ తో జరిగిన కీలకమైన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓడిపోయింది. ప్లే ఆఫ్ రేసు నుంచి తప్పుకుంది. ఇదంతా ఢిల్లీ చేసుకున్న స్వయం కృతాపరాధమే.. జట్టు కెప్టెన్ రిషబ్ పంత్ తప్పుడు నిర్ణయాల ఫలితమేనని అంటున్నారు నెటిజన్లు.
Also Read: Team India Players Injuries: గాయాలతో సతమతమవుతున్న టీమిండియా ఆటగాళ్లతో కష్టమే?
13 మ్యాచ్ లలో 7 మ్యాచులు గెలిచి 14 పాయింట్లతో ఉంది ఢిల్లీ కేపిటల్స్ జట్టు. అటు ఆర్సీబీ 14 మ్యాచ్ లలో 8 గెలిచి 16 పాయింట్లు సాధించింది. గెలిస్తే ఢిల్లీ ప్లే ఆఫ్స్ చేరేది. ఈ మ్యాచ్ లో గెలిస్తే రన్ రేట్ కారణంగా ఆర్సీబీని వెనక్కి నెట్టి ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ప్లే ఆఫ్ కు చేరేది.
ముంబైని గెలిపించిన టీమ్ డేవిడ్ నిజానికి ఔట్ అయిపోయాడు. శార్ధుల్ వేసిన 15వ ఓవర్ తొలి బంతికే ఎడ్జ్ తాకి కీపర్ చేతుల్లో పడింది. అంపైట్ నాట్ అవుట్ ఇచ్చాడు. సర్ఫరాజ్ ఖాన్ తో పాటు అందరూ రిషబ్ పంత్ ను రివ్యూ తీసుకోవాలని చెప్పినా వినలేదు. రివ్యూలో అది ఔట్ అని తేలింది. అక్కడే ఢిల్లీ కథ ముగిసింది. టీమ్ డేవిడ్ కేవలం 11 బంతుల్లోనే 34 పరుగులు చేసి ముంబైని గెలిపించాడు.
పది బంతులు. ఢిల్లీ క్యాపిటల్స్ సీజన్‌ను ముగించడానికి.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ప్లేఆఫ్స్‌లోకి నెట్టడానికి టీం డేవిడ్ పది బంతుల మారణహోమమే కారణం. అతడు ఔట్ అయినా పంత్ డీఆర్ఎస్ తీసుకోకపోవడమే ఢిల్లీ ఓటమికి కారణంగా చెప్పొచ్చు.15వ ఓవర్లో ముంబై ఇండియన్స్ గెలవడానికి 33 పరుగుల్లో 65 పరుగులు చేయాల్సిన దశలో టిమ్ డేవిడ్ ఔట్ అయిన నిర్ణయాన్ని సమీక్షించాలని పంత్ ను టీంమేట్స్ కోరినా పెడచెవిన పెట్టాడు. అదే తీసుకుంటే టీమ్ డేవిడ్ 0 పరుగులకే అవుటయ్యేవాడు. కానీ అతడే ముంబైని గెలిపించాడు. ఢిల్లీని ఓడించాడు. తర్వాత మరో 10 బంతుల్లోనే 34 విధ్వంసకర పరుగులు సాధించి ఢిల్లీకి షాకిచ్చాడు. రిషబ్ పంత్ -ఢిల్లీ ప్లేయర్ల తప్పిదానికి ఇప్పుడు ఆ టీం ఎప్పటికీ క్షమించరాని తప్పిదం చేసినట్టైంది.
Also Read:KCR Delhi Tour: సంచలనమన్న కేసీఆర్.. సడీ సప్పుడు లేని కేజ్రీవాల్, అఖిలేష్!