Team India Players Injuries: టీమిండియా దక్షిణాఫ్రికాతో ఆడే మూడు సిరీస్ ల కోసం ఆటగాళ్లను సెలక్షన్ కమిటీ ఎంపిక చేయనుంది. ఐపీఎల్ సీజన్ ముగిసిన వెంటనే దక్షిణాఫ్రికా తో పొట్టి ఫార్మాట్ లో భారత్ ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ ఆడనుంది. దీని కోసం ఆటగాళ్లను ఎంపిక చేసేందుకు సెలక్షన్ కమిటీ చైర్మన్ చేతన్ శర్మ సారధ్యంలో కమిటీ ఈనెల 23న సమావేశం కానుంది 25న జట్లను ప్రకటిస్తారు. జూన్ 9న ఆరంభమయ్యే సిరీస్ జూన్ 19న ముగుస్తుంది. చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జూన్ 9న టీ 20 సిరీస్ ప్రారంభం అయ్యే అవకాశముంది.

Harshal Patel
ఐర్లాండ్ రెండు టీ20 సిరీస్ లు ఆడాల్సి ఉండగా ఇంగ్లండ్ లో నిరుడు మిగిలిపోయిన చివరి టెస్ట్ తో ాటు పరిమిత ఓవర్ల సిరీస్ ఆడే అవకాశాలు ఉన్నాయి. కానీ టీమిండియా ఆటగాళ్లను గాయాలు వేధిస్తున్నాయి. ఇప్పటికే హర్షల్ పటేల్ గాయపడినట్లు తెలుస్తోంది. దీంతో అతడి ఎంపిక ప్రశ్నార్థకమే కానుంది. హర్షల్ కోలుకోవడానికి నాలుగు వారాలు పడుతుందని తెలుస్తోంది. ఈ కారణంగా అతడు అందుబాటులో ఉంటే చాన్స్ లేదని చెబుతున్నారు.
Also Read: CM KCR- Early Elections: ముందస్తు ఎన్నికలకు కేసీఆర్ వెళ్లనున్నారా?
దీపక్ చాహర్ తొడ కండరాల గాయంతో బాధ పడుతున్నాడు. రవీంద్ర జడేజా పక్కటెముకల గాయంతో విశ్రాంతి తీసుకుంటున్నాడు. సూర్యకుమార్ కండరాల గాయంతో, రహానే తొడ కండరాల గాయాలతో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో వీరి ఎంపిక సాధ్యపడదు. ఆటగాళ్ల విశ్రాంతి గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని దక్షిణాఫ్రికాతో జరిగే టీ 20 సిరీస్ కు విశ్రాంతి ఇస్తామని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Ravindra Jadeja
దక్షిణాఫ్రికా ఇప్పటికే జట్టును ప్రకటించడంతో ఇక బీసీసీఐ కూడా తమ జట్టును వెల్లడించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆటగాళ్ల గాయాల కారణంగా ఎవరికి రెస్ట్ ఇచ్చి ఎవరిని ఎంపిక చేస్తారనే దానిపై ఇంకా స్పష్టత లేదు. ఈ ఏడాది ఆస్ట్రేలియాలో జరిగే టీ20 ప్రపంచ కప్ కు ముందు జరిగే దక్షిణాఫ్రికాకు ఇది ముఖ్యమైన పర్యటన కానుంది. దీంతో ఆటగాళ్ల ఎంపికలో ఆచితూచి అడుగు వేస్తోంది. టీమిండియా జట్టు ఎంపికలో కూడా బీసీసీఐ ఏం నిర్ణయాలు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.
Also Read:KCR Delhi Tour: సంచలనమన్న కేసీఆర్.. సడీ సప్పుడు లేని కేజ్రీవాల్, అఖిలేష్!